Thursday 23 November 2017

ఒక మలుపుకి అతి దగ్గరలో ..

"నా జీవితాన్ని నేను సృష్టించుకుంటాను!" ... 
"జీవితంలో ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది!" ...

ఈ రెండూ రెండు విభిన్న అలోచనా విధానాలు. భూమ్యాకాశాల అంతరం ఉన్న రెండు భిన్న ధ్రువాలు.

ప్రపంచ వ్యాప్తంగా ఏ కాలమాన పరిస్థితుల్లోనయినా ప్రధానంగా ఈ రెండు అలోచనా విధానాలే కొనసాగుతుంటాయి. మొదటి వ్యక్తి జీవన వాహనానికి సంబంధించిన "స్టీరింగ్" అతని చేతుల్లోనే ఉంటుంది. రెండో వ్యక్తి తన స్టీరింగ్ ను గాలికి వదిలేస్తాడు. దేని ఫలితం ఎలా ఉంటుందో ఎవరయినా  ఇట్టే ఊహించవచ్చు.

ప్రస్తుతం నా స్టీరింగ్ మళ్లీ  నాచేతుల్లోకి తీసుకున్నాను. కొంచెం ఆలస్యంగా.

సామర్థ్యం ఉన్నప్పుడు మరింతగా ఎదగడానికి ప్రయత్నించడం, మరింత ఉన్నతమైన జీవనశైలిని కోరుకోవటం తప్పు కాదు. అసంతృప్తితో బాధితుడుగా మిగిలిపోవటమా, సంతృప్తితో అనుకున్నస్థాయికి ఎదగడమా అన్నది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది.

ప్రస్తుతం అలాంటి ఒక మలుపుకి దగ్గరలో ఉన్నాను.

ఈ ప్రస్థానంలో - నా మొత్తం క్రియేటివ్ యాక్టివిటీస్‌లో సినిమా అనేది జస్ట్ ఒక పది శాతం మాత్రమే. ఒక అతి చిన్న భాగం మాత్రమే. ఇంకా చెప్పాలంటే, ఒక చిన్న జాబ్.

అది కూడా అతి కొద్దికాలం మాత్రమే.

నా ఉద్దేశ్యంలో .. ఈ రంగాన్ని మించిన ఫేసినేటింగ్ క్రియేటివ్ సామ్రాజ్యాలు ఇంకెన్నో ఉన్నాయి! నాకెంతో ఇష్టమయిన అలాంటి ఒక సామ్రాజ్యంలోకి పూర్తిస్థాయిలో ప్రవేశించే ఫ్రీడమ్‌ కోసమే ఎదురుచూస్తున్నాను.

ఆ ఫ్రీడమ్‌ను సృష్టించుకొనే క్రమంలోనే బిజీగా ఉన్నాను.  

No comments:

Post a Comment