Wednesday 24 August 2016

రిస్క్-ఫ్రీ .. ఫిల్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫర్!

మైక్రో బడ్జెట్‌లో ప్రస్తుతం నేను రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నాను.

వీటి తర్వాత కూడా ఇదే పధ్ధతిలో సీరీస్ ఆఫ్ సినిమాలుంటాయి. వీటికి సంబంధించిన పూర్తిస్థాయి ఎనౌన్స్‌మెంట్ సెప్టెంబర్‌లో ఉంటుంది.

ఫిల్మ్ ప్రొడక్షన్ కోసం బ్యానర్స్, టైటిల్స్ ఆల్రెడీ రిజిస్టర్ చేశాము. ఈ సినిమాలకు సంబంధించిన ఇతర ప్రిప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.

భారీ స్టార్స్‌తో భారీగా గ్యాంబ్లింగ్ చేసే భారీ చిత్రాలు తీయడానికి భారీ ప్రొడ్యూసర్లు, భారీ డైరెక్టర్లు భారీ సంఖ్యలోనే ఉన్నారు. ఆ కథ వేరే, ఆ సెక్షన్ వేరే. దాని గురించి ఇక్కడ నేనేం మాట్లాడ్డం లేదు.

నేనిప్పుడు మాట్లాడుతోంది ఆ మధ్య వచ్చిన "కుమారి 21 ఎఫ్", మొన్నీ మధ్యే వచ్చి కలెక్షన్లపరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న "పెళ్లిచూపులు" వంటి మైక్రోబడ్జెట్ సినిమాల గురించి.  

ఇప్పుడు నేను తీస్తున్న రెండు సినిమాల్లోనూ మెయిన్ లీడ్‌లో అంతా కొత్తవాళ్లే ఉంటారు. సపోర్టింగ్ రోల్స్‌లో మాత్రం కొందరు సీనియర్స్, కొందరు అప్‌కమింగ్ ఆర్టిస్టులుంటారు.

ఇవి పూర్తిగా "కోపరేటివ్ ఫిల్మ్ మేకింగ్ పధ్ధతి"లో చేస్తున్న సినిమాలు.

ఫిల్మ్ మేకింగ్‌లో వచ్చిన లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి, అతి తక్కువ ఇక్విప్‌మెంట్‌తో, నేచురల్ లైటింగ్‌తో, కాల్‌షీట్స్ వంటి నాన్సెన్స్ లేకుండా .. పూర్తి అన్‌ట్రెడిషనల్‌గా చేస్తున్న సినిమాలివి.

అలాగని, ఇవేవో సీరియస్ ఆర్ట్ సినిమాలు కాదు. పక్కా కమర్షియల్ ట్రెండీ యూత్ ఎంటర్‌టైనర్ సినిమాలు.

మాదొక లైక్‌మైండెడ్ టీమ్.

ఇక్కడ మా అందరికీ సినిమా తీసి సక్సెస్ చేయాలన్న ప్యాషనే ముఖ్యం. ఎందుకూ పనికిరాని ఈగోలు, ఫోజులు కాదు. ముఖ్యంగా, అంతా అయిపోయాక ఎవరో పక్కవారు చెప్పే ఉచిత సలహాలను విని, అప్పటికప్పుడు మా వ్యక్తిత్వాలను మార్చుకోలేం కూడా.  

కలిసి పనిచేద్దాం. కలిసి ఎదుగుదాం.  ఇదీ మా కాన్‌సెప్ట్.
     

కట్ టూ క్లయిమాక్స్ -  

ఫిల్మ్ ప్రొడక్షన్ బిజినెస్ పట్ల ఆసక్తి ఉండి, (కనీసం 10 లక్షలతో) కోప్రొడ్యూసర్స్‌గా చిన్నమొత్తంలోనయినా, వెంటనే పెట్టుబడి పెట్టగల స్థోమత ఉన్న కొత్త "ఫిల్మ్ ప్యాషనేట్ ఇన్వెస్టర్స్" కోసం మేం చూస్తున్నాము.

అలాంటివారు ఎవరున్నా, మీ ఆసక్తి తెలుపుతూ, మీ మొబైల్ నంబర్ నా Facebook / Twitter ఇన్‌బాక్స్ కు మెసేజ్ చేయండి. ఒకే అనుకుంటే మేమే మీకు కాల్ చేస్తాం.

మీరు పెట్టే ఈ అతి చిన్న ఇన్వెస్ట్‌మెంట్ దాదాపు రిస్క్-ఫ్రీ!

"ఈ రిస్క్-ఫ్రీ బిజినెస్ అఫర్ కొద్దిరోజులు మాత్రమే." 

Monday 22 August 2016

లైక్‌మైండెడ్ టీమ్ కోసం!

"హాయ్ సర్", "హవ్ ఆర్యూ సర్", "టిఫిన్ చేశారా" .. దయచేసి ఇలాంటి రొటీన్ చాటింగ్స్ వద్దు. నా వల్ల కాదు. చాలా పనుల్లో బిజీగా ఉంటాను.

ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉన్న్నప్పుడే నాకు మెసేజ్ చేయండి. నిజంగా అది ఇంపార్టెంట్ విషయమే అయితే, తప్పకుండా నేను వెంటనే జవాబిస్తాను.

ఈ విషయంలో దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు.

నా ప్రయారిటీస్, ఒక టైమ్‌ఫ్రేమ్‌లో నేను పూర్తిచేయాల్సిన పనులు .. చాలా ఉన్నాయి. ప్రస్తుతం నా ఫోకస్ అంతా ఆ వైపే ..

ఒక టీనేజ్ కుర్రాడిలా నేనేదో ఇప్పుడు కొత్తగా ఓ గాళ్ ఫ్రెండ్‌ను వెదుక్కోడానికో, వెంటపడటానికో ఫేస్‌బుక్‌లో లేను. నా సినిమా ప్రొఫెషన్‌కు సంబంధించిన నెట్‌వర్కింగ్ కోసమే నేనిక్కడున్నాను. నాదంటూ ఒక లైక్‌మైండెడ్ టీమ్‌ను ఎప్పటికప్పుడు తయారుచేసుకోవడం కోసమే నేనీ సోషల్ మీడియాలో ఉన్నాను.

ఇది వివరణ కాదు. వాస్తవం.

కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కోసం నేను ఎప్పటికప్పుడు విడిగా ఆడిషన్స్ ఎనౌన్స్ చేస్తుంటాను. అప్పుడు మాత్రమే దయచేసి మీరు స్పందించండి.

తక్కువ స్థాయిలోనైనా సరే, మీరొకవేళ సినిమా ఇన్వెస్ట్‌మెంట్ మీద ఆసక్తి ఉన్న కొత్త ఇన్వెస్టర్‌లు, ఇన్వెస్టర్ ఆర్టిస్టులు గానీ అయితే .. మీ ఆసక్తి వివరాలు తెలుపుతూ, మీ మొబైల్ నంబర్ ఇస్తూ, నాకు మెసేజ్ పెట్టండి. ఓకే అనుకొంటే మేమే కాల్ చేస్తాం.

బెస్ట్ విషెస్ ..           

Friday 19 August 2016

గో గోల్డ్, సింధు!

వరల్డ్ #10 సింధుకి, రియో ఒలంపిక్స్ గోల్డ్ మెడల్‌కు మధ్యనున్న ఒకే ఒక వ్యక్తి - కరొలినా మారిన్.

స్పెయిన్‌కు చెందిన ఈ వరల్డ్ #1 బ్యాడ్‌మింటన్ ప్లేయర్ కరొలినాకు "గాళ్ నాడల్" అన్న పేరుందన్న విషయం మనం ఇక్కడ గమనించాలి.  (వరల్డ్ #4 స్పానిష్ టెన్నిస్ ప్లేయర్ రాఫెల్ నాడల్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటాను.)

ఎలాంటి హెవీ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఫైనల్‌కు చేరుకున్న సింధు, ఒక్కో మ్యాచ్‌నే లక్ష్యంగా తీసుకుంటుంది. అలా తీసుకునే, ఇప్పుడు ఒలంపిక్స్ ఫైనల్లో వరల్డ్ #1 కరొలినాను ఎదుర్కొనేదాకా వచ్చింది.

ఇప్పుడు సింధు ఆడాల్సింది ఇంక ఒక్క మ్యాచే!

అదీ ఫైనల్ .. కొన్ని గంటల్లో ..


కట్ టూ సింధు నేపథ్యం - 

హైద్రాబాద్‌లో పుట్టి పెరిగిన సింధు పేరెంట్స్ గుంటూరు జిల్లా మాచర్లకు చెందినవారు. సింధు తండ్రి రమణ కూడా ప్లేయరే. పైగా అర్జున అవార్డు గ్రహీత కూడా కావడం విశేషం. అయితే, రమణ వాలీబాల్ ప్లేయర్.

"తెలంగాణ ముఖ్యమంత్రి కె సి ఆర్ గారి సహకారం, ప్రోత్సాహం లేకుండా సింధు ఒలంపిక్స్‌లో  ఈ స్థాయికి చేరుకొనేది కాదు" అని స్వయంగా రమణ గారే టివి9 ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.

సింధు కోచ్ పుల్లెల గోపిచంద్.

ప్రపంచస్థాయి చాంపియన్‌షిప్స్‌లో మెడల్ గెల్చుకొన్న మొట్టమొదటి భారతీయ మహిళగా రికార్డ్ ఉన్న సింధు, మొన్న 30 మార్చి 2015 రోజున పద్మశ్రీ అవార్డ్ కూడా అందుకుంది.

"నా లక్ష్యం గోల్డ్. దానికోసం నా మనసంతా పెట్టి ఆడతాను" అంటున్న సింధు తన లక్ష్యం చేరుకోవాలనీ, ఇవాళ ఒలంపిక్స్‌లో గోల్డ్ సాధించాలనీ, నేను మనస్పూర్తిగా కోరుకొంటున్నాను.

ఆ బంగారు క్షణం కోసం ఎదురుచూస్తున్నాను.

గో సింధూ, గెట్ యువర్ గోల్డ్! 

Thursday 18 August 2016

ఏక్ నిరంజన్!

అవ్వా బువ్వా రెండూ కావాలంటే కుదరదు.

ఒకటి సాధించాలనుకొంటే, ఒకటేదో వొదులుకోవాలి .. ఏ విషయంలోనయినా సరే,
ఏ వృత్తిలోనయినా సరే.

ఇది తప్పదు.

సినిమాల్లో అయితే, ఇది నూటికి నూరు శాతం అస్సలు తప్పదు.

కట్ టూ ఆ రెండు -  

ఒకటి: మీకిష్టమైన ఫీల్డులో ఎలాంటి అడ్డంకులూ, పరిమితులూ లేకుండా పనిచేసుకోగలగడం.

రెండు: పై విషయంలో ఇంట్లో భార్య/భర్త, కుటుంబం మనస్పూర్తిగా మిమ్మల్ని ప్రోత్సహించి, సహకరించడం.  

90 శాతం మంది విషయంలో ఈ రెండింటి బ్యాలెన్స్ అసలు కుదరదు. రెండోది ఉన్నప్పుడే .. మొదటి విషయంలో ఏదైనా సాధించే అవకాశముంటుంది. అలా లేదంటే మాత్రం, రెండిట్లోనూ ఫెయిలవక తప్పదు.  

అది కూడా అట్టర్‌ఫ్లాప్ అన్నమాట!

మరి మనకు సక్సెస్ కావాలా, ఫ్లాప్ కావాలా?!

ఇది మీ పాయింట్ నంబర్ 2 మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ ఆ కోపరేషన్ లేదంటే సింపుల్‌గా పాయింట్ నంబర్ 1 మర్చిపోవాలి.

లేదంటే ఒక్కటే మార్గం ..

ఏక్ నిరంజన్!

Sunday 14 August 2016

జై గురుదేవ్...

బెంగుళూరు శివార్లలో ఉన్న ఒక అంతర్జాతీయస్థాయి ఆధ్యాత్మిక గురువుతో కనీసం ఒక గంటసేపు, వన్-టూ-వన్, ఫేస్-టూ-ఫేస్ కూర్చొని మాట్లాడే అవకాశం దొరికిన అరుదైన వ్యక్తుల్లో ఒకడిగా నాకు రికార్డ్ ఉంది.

గురూజీ ఒక నాలుగంగుళాల ఎత్తున్న చెక్కపీటమీద కూర్చున్నారు. ఆయనకెదురుగా మంచి మ్యాట్ మీద నేను కూర్చున్నాను.

ఇదంతా ఆయన ఏకాంత వ్యక్తిగత కుటీరంలో జరిగింది.

అది 2004 లో.

వందలాదిమంది భారతీయ, విదేశీ భక్తులు ఆ కుటీరం బయట గురూజీ దర్శనం కోసం ఎదురుచుస్తున్నారు. నేనెప్పుడు బయటికొస్తానా, గురూజీ ఎప్పుడు బయటికొచ్చి అలా చిరునవ్వుతో అందరికీ చేయి ఊపి పలకరించి వెళతారా అని!

గంట తర్వాత, నేను కుటీరంలోంచి బయటకొస్తోంటే బయట గురూజీ భక్తులంతా నన్ను ఎంత ప్రత్యేకంగా చూశారో, ఎలా నాకు దారి ఇచ్చారో నేను ఇప్పటికీ మర్చిపోలేను.

కట్ టూ 2016 - 

నా వ్యక్తిగత పనులకోసం ఈ మధ్య, గత 9 నెలల్లోనే, కనీసం ఒక అరడజనుసార్లు నేను బెంగుళూరు వెళ్లాల్సివచ్చింది. వెళ్ళిన ప్రతిసారీ, శివార్లలో ఉన్న గురూజీ ఆశ్రమం మీదుగా కూడా వెళ్లాల్సివచ్చింది. 

ఓ గంట బ్రేక్ తీసుకొని, ఆశ్రమం లోపలికి వెళ్లాలని దాదాపు ప్రతిసారీ అనిపించింది. కానీ, కారాపి, వెళ్లలేకపోయాను.

ఇక్కడ విషయం నేను బిజీ అని కాదు.

"వెళ్లి చేసేదేముంది" అని అంతర్లీనంగా నాలో ఉన్న అనాసక్తి కావచ్చు, బహుశా.

సుమారు 12 ఏళ్ల క్రితం, గురూజీ దగ్గరికి నేను ఏదో ఆశించి వెళ్లలేదు. గురూజీకి అతి దగ్గరి అనుయాయులే నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. గురూజీ కూడా ఆరోజు నాకు అంత ప్రాముఖ్యం ఇవ్వడం నాకు ఇప్పటికీ ఒక అర్థంకాని గొప్ప విషయమే!

సరే, ఏదైతేనేం .. ఆరోజు .. ఒక గంట మాట్లాడిన తర్వాత నేను లేస్తుంటే, గురూజీ కళ్లుమూసుకొని మంత్రించి నాచేతికిచ్చిన యాపిల్ పండు ఆరోజు నుంచి ఇవాల్టివరకూ, నా జీవితంలో నాకు ఎలాంటి మిరాకిల్‌ను క్రియేట్ చేయలేకపోయింది. 

అలాంటి ఊహించని అద్భుతం ఏదో జతుగుతుందని నేను అనుకోలేదు కూడా.

వందలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆ ఆధ్యాత్మిక సామ్రాజ్యం, దాని నిర్వహణ మాత్రం నాకు బాగా నచ్చాయి. అలాంటి సువిశాల ఆధ్యాత్మిక సామ్రాజ్యాలు, గురూజీకి, ప్రపంచంలో కనీసం ఇంకో 70 దేశాల్లో కూడా ఉన్నాయని విన్నాను.

ఇది మామూలు విషయం కాదు. మామూలు వ్యక్తులవల్ల సాధ్యం కాదు కూడా.

ఈ ఒక్క "సక్సెస్ సైన్స్" పాయింటాఫ్ వ్యూలో మాత్రం గురూజీ నాకు బాగా నచ్చారు.

నమ్మకం అనేది పూర్తిగా వ్యక్తిగతం. దానికి శాస్త్రీయమైన రీజన్ కూడా ఉందని నేను నమ్ముతాను. ఈకోణంలో ఎదుటివారి నమ్మకాన్ని నేనెప్పుడూ గౌరవిస్తాను.

అయితే - ఆ నమ్మకమే పునాదిగా, ఆధ్యాత్మికం నేపథ్యంగా, అంత భారీ స్థాయిలో, 70 దేశాల్లో అంతమంది భక్తులను సంపాదించి, అంత సువిశాల ఆధ్యాత్మిక సామ్రాజ్యం నిర్మించగలిగిన ఒక అసాధారణ వ్యక్తిగా మాత్రం గురూజీ అంటే నాకు వ్యక్తిగతంగా చాలా చాలా ఇష్టం.

ఇప్పటికీ.

చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు గురూజీని గుర్తు చేసుకున్నాను కదా, ఇప్పుడేదైనా అద్భుతం జరుగుతుందేమో! చూడాలి ..

జై గురుదేవ్ .. 

Friday 5 August 2016

పర్సనల్ కోచింగ్ పవర్!

ఫిల్మ్ ఇన్స్‌టిట్యూట్ ట్రెయినింగ్‌కూ, పర్సనల్ కోచింగ్‌కూ నిజంగానే భూమ్యాకాశాల అంతరం ఉంటుంది.

> ఫిల్మ్ ఇన్స్‌టిట్యూట్‌లో అందర్నీ ఒక గ్రూప్‌లా క్లాస్‌రూంలో కూర్చోబెట్టి ఎక్కువగా థియరీ క్లాసులు తీసుకుంటారు. అరుదుగా, కొందరు ఖాళీగా ఉన్న చిన్నా చితకా యాక్టర్లు, డైరెక్టర్లు కూడా వచ్చి అప్పుడప్పుడు గెస్ట్ లెక్చర్స్ ఇస్తారు.

> ఫిల్మ్ ఇన్స్‌టిట్యూట్‌లో ప్రాక్టికల్‌గా జరిగే తతంగం ఏదైనా చాలా చాలా తక్కువ. కెమెరాలో షూట్ మాహా అయితే ఒకరోజు చూపించవచ్చు. మరీ గొప్ప ఇన్స్‌టిట్యూట్ అయితే, షార్ట్ ఫిల్మ్ పేరుతో స్టూడెంట్స్‌తో ఓ రెండు రోజులు షూటింగ్ చేయించవచ్చు.  

> కోర్సు చివర్లో ఒక సర్టిఫికేట్, ఫోటో .. దెన్ ప్యాకప్!

> కోర్సులో చేరినవారిలో ఎవరు ఏం నేర్చుకున్నారో, ఎలా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతారో, ఎవరు వీరి సర్టిఫికేట్స్ చూసి ఛాన్స్ ఇస్తారో ఎవరూ చెప్పలేరు.

> దీనికోసం మన హైద్రాబాద్‌లోనే, చిన్నా చితకా ఇన్స్‌టిట్యూట్స్ అన్నీ కలిపి, కనీసం ఓ 100 ఉన్నాయి. వీటిలో బాగా పేరున్న ఇన్స్‌టిట్యూట్స్ వసూలు చేస్తున్న ఫీజు సుమారు 5 నుంచి 7 లక్షల వరకు ఉంది. ఇది రియాలిటీ.


కట్ టూ పర్సనల్ కోచింగ్ - 

> ఇది పూర్తిగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్.

> వ్యక్తిగతంగా మీ బలాలు, బలహీనతలు ఏమిటో గుర్తించి .. మీ ఒక్కరినే లక్ష్యంగా పెట్టుకొని, ఎలా మీకు శిక్షణ ఇచ్చి, ఎలా మిమ్మల్ని తీర్చిదిద్దితే, మీరు ఫీల్డులోకి ఎంటరయి అనుకున్నది సాధిస్తారో .. ఆ కోణంలోనే పూర్తి వ్యక్తిగతంగా మీకు వన్-టూ-వన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది.

> సింపుల్‌గా చెప్పాలంటే .. ఒక క్రికెటర్‌కో, ఒక టెన్న్నిస్ ప్లేయర్‌కో వారికి ఉండే పర్సనల్ కోచ్ ఎలా అయితే శిక్షణ ఇస్తాడో .. దాదాపు అలాంటిదే ఈ పర్సనల్ కోచింగ్.

> ఇండస్ట్రీలో ఏ రకంగానూ చూసినా ఉపయోగపడని థియరీ క్లాసులుండవు, క్లాస్‌రూం కల్చర్ అస్సలు ఉండదు.

> ఇండస్ట్రీలో మీకిష్టమైన రంగంలోకి మీరు ప్రవేశించడానికి ప్రాక్టికల్‌గా మీకు ఏమేం తప్పనిసరిగా తెలియాలో, ఆ ముఖ్యమైన అంశాలపై మాత్రమే కోచింగ్ ఫోకస్ ఉంటుంది.

> నంది అవార్డు పొందిన ఒక రచయితగా, డైరెక్టర్‌గా .. ఇప్పటివరకు ఇండస్ట్రీతో నాకున్న అనుబంధం, ఇక్కడి నా అనుభవాల సారాంశం ఆధారంగా .. మీరు ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకుంటారు.

> మీరు డైరెక్టుగా నా టీమ్‌లో ఉంటారు. నేను తీస్తున్న సినిమాలో నేరుగా పనిచేస్తారు.

> ఎన్నేళ్లయినా దొరకని సినిమా ఛాన్స్ .. ఈ పర్సనల్ కోచింగ్ ద్వారా మీకు కొన్ని నెలల్లోనే దొరుకుతుంది. సిల్వర్ స్క్రీన్ పైన మీ టైటిల్ కార్డ్ మీరు చూసుకుంటారు.

> ఆ తర్వాత, మీ సినీ కెరీర్ లోని ఏ దశలోనయినా, మీకెలాంటి సలాహాలు అవసరమయినా సరే, నా నుంచి మీకు లైఫ్‌టైమ్ సపోర్ట్ ఉంటుంది.

సో, దటీజ్ ది పవర్ ఆఫ్ పర్సనల్ కోచింగ్. వన్-టూ-వన్ ..

ఎలా మీకు శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దితే మీరు పైకొస్తారో వ్యక్తిగతంగా అధ్యయనం చేసి, అలా మిమ్మల్ని తీర్చిదిద్ది, మీరు మీ గమ్యాన్ని సులభంగా చేరుకొనేలా చేయడమే ఈ పర్సనల్ కోచింగ్ ప్రధాన లక్ష్యం.