Thursday 29 September 2016

ఇప్పుడు కావల్సింది ఒక్క హిట్!

డబ్బు, సెలెబ్రిటీ హోదా, నానా ఆకర్షణలు, వివిధ రంగాల్లోని వి ఐ పి స్థాయి వ్యక్తులతో పరిచయాలు, పవర్‌ఫుల్ నెట్‌వర్క్ ..

ఇంకేం కావాలి?

సినీ ఫీల్డులో ఇవన్నీ ఉన్నాయి.

ఎవరెన్ని చెప్పినా, ఎన్ని నీతులు వల్లించినా .. సినిమా అనేది ఓ పెద్ద క్రియేటివ్ బిజినెస్.

మాగ్నెట్‌లా జివ్వున లాగే గ్లామర్ ఫీల్డ్. పట్టుకుందంటే వదలని ఓ పెద్ద అడిక్షన్.


కట్ టూ ది పాయింట్ - 

నిద్రపోతావో, నిశాచరుడివవుతావో ..  కష్టపడతావో, కన్నీళ్లే పెడతావో .. పరుగెడతావో, పరిగెత్తిస్తావో .. హార్డ్ వర్కో, స్మార్ట్ వర్కో .. అంతా నీ ఇష్టం.

మొత్తానికి నువ్వొక పని రాక్షసుడివి అయిపోవాలి.

నీ ఫోకస్ అంతా నీ ఏకైక లక్ష్యం మీదే ఉండాలి.

అప్పుడే .. ఈ మార్కెట్ స్టడీలు, హిట్ ఫార్ములాలు, సక్సెస్ సూత్రాలు, ఓపెనింగ్ ఫంక్షన్లు, క్లోజింగ్ పార్టీలు, ప్రెస్ మీట్లు, ఫ్లెక్సీలు, అదృష్ట సంఖ్యలు, సెంటిమెంట్లూ, తొక్కా .. ఇవేవీ నీకు వినిపించవు. కనిపించవు.

అప్పుడు .. అప్పుడు మాత్రమే, ఒకే ఒక్కటి .. నిన్ను వెదుక్కుంటూ వస్తుంది. నీ వెంటబడి వేధిస్తుంది. నిన్ను వరిస్తుంది.

హిట్!

ఆ ఒక్క హిట్‌తోనే, రాత్రికి రాత్రే .. నువ్వూహించని రేంజ్‌లో నీ జీవితం మారిపోతుంది.
ఎప్పటినుంచో నువ్వు కోరుకొంటున్న స్వేఛ్చ నీ సొంతమవుతుంది.

ఇక నీ జీవితం నీ ఇష్టం. నీ క్రియేటివిటీ నీ ఇష్టం.

ఏం సాధిస్తావో సాధించు.

ఏం జీవిస్తావో జీవించు.  

3 comments:

  1. "మొత్తానికి నువ్వొక పని రాక్షసుడివి అయిపోవాలి."
    ఏ రంగంలో ఐనా సరే పట్టుసాధించి విజయం సంపాదించాలంటే పనిరాక్షసుడు కాక తప్పదండీ.

    ReplyDelete
    Replies
    1. "..నువ్వొక పని రాక్షసుడివి అయిపోవాలి.

      నీ ఫోకస్ అంతా నీ ఏకైక లక్ష్యం మీదే ఉండాలి."
      ^^^
      అదే కదండీ నేనూ అన్నది! .. థాంక్ యూ ఫర్ యువర్ కామెంట్. :)

      Delete