Sunday 31 July 2016

దటీజ్ సినిమా!

సినిమా నిర్మాణంలో ఆధునికంగా వచ్చిన డిజిటల్ టెక్నాలజీ వల్ల బడ్జెట్‌లు చాలా తగ్గాయి. చిన్న స్థాయిలో, కొత్తవాళ్లతో సినిమాలు చేయాలనుకొనేవాళ్లకు బిజినెస్ పాయింటాఫ్ వ్యూలో ఇదొక మంచి ప్రాఫిటబుల్ అండ్ పాజిటివ్ మలుపు.

అయితే - దీన్ని ఎంతవరకు పాజిటివ్‌గా ఉపయోగించుకొని, ఏ రేంజ్‌లో సక్సెస్ సాధించగలమనేదే మిలియన్ డాలర్ కొశ్చన్.

ఎన్ని ఆడ్డంకులు వచ్చినా, అన్నీ మనకు అనుకూలం చేసుకొని ముందుకు సాగిపోగల సత్తా కూడా మనలో ఉండాలి.

ఎందుకంటే .. సినిమా ఒక స్పెక్యులేషన్. ఒక జూదం.

అయినా - భారీ స్థాయిలో డబ్బు రొటేషన్, ఊహించని రేంజ్ వ్యక్తులతో పరిచయాలూ, సంబంధాలూ, ఓవర్‌నైట్‌లో ఫేమ్ .. ఇవన్నీ ఇక్కడే సాధ్యం.

దటీజ్ సినిమా.

కట్ టూ నాణేనికి మరోవైపు - 

చాలా మందికి కొత్తవాళ్లతో తీసే చిన్న సినిమాలు మధ్యలోనే ఆగిపోతాయి .. అసలు రిలీజ్ కావు .. ఒకవేళ రిలీజ్ ఐనా హిట్టు కావు .. హిట్ అయినా డబ్బులు రావు .. అని ఇలా రకరకాల అభిప్రాయాలుంటాయి.

సినిమా నిర్మాణం మీద, బిజినెస్ పైన ఖచ్చితమైన అవగాహన ఉండి, సినిమా తీయడం వేరు. ఏదో సినిమా తీయాలని తీయడం వేరు.

ఒకవేళ తెలియనప్పుడు, తెలిసినవాళ్లు చెప్పేది వినడం చాలా అవసరం. అలా జరగనప్పుడే
పై అపోహలు నిజమవుతాయి. నిర్మాతతోపాటు - ఆ సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కూడా ఎంతో నష్టపోతారు.

ఇవన్నీ ఒకెత్తు కాగా, సినిమా ప్రమోషన్ మొత్తం ఒకెత్తు.

ప్రమోషన్ ప్రాముఖ్యం తెలియనివాళ్లు అసలు సినిమా తీయకుండా ఉండటం బెటర్. ఈ వాస్తవం గుర్తించినవారెవ్వరికీ ఏ సమస్యా ఉండదు. చిన్న బడ్జెట్‌లోనే మంచి హిట్ ఇస్తారు. మరిన్ని మంచి సినిమాలు తీస్తారు. కోట్లల్లో డబ్బు సంపాదించుకుంటారు.

అలాంటి లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్స్, కో ప్రొడ్యూసర్స్, ప్రొడ్యూసర్స్ పాతవాళ్లలో చాలా తక్కువగా ఉంటారు. కొత్తవారు దొరకడం అంత ఈజీ కాదు.

ఒక సినిమా ప్రారంభించే ముందు ఇలాంటివి ఎన్నో, ఎన్నెన్నో బాగా చూసుకోవాలి. సరైన అంచనాలు వేసుకోవాలి.

అందుకే చిన్న సినిమాల ప్రారంభంలో పదే పదే ఆలోచనలూ, ఆలస్యాలూ.

దటీజ్ సినిమా.

No comments:

Post a Comment