Monday 6 June 2016

ఒక్క హిట్ .. జీవితాన్నే మార్చేస్తుంది!

"సినిమా తీయాలన్న కమిట్‌మెంట్ ఉంటే చాలు. డబ్బులు ఎప్పుడూ సమస్య కాదు."

ఈ మాటలన్నది ఎవరో కాదు. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రే!

ఎలా కాదనగలం?

సత్యజిత్ రే "పథేర్ పాంచాలి" అలాగే తీశాడు. ఉద్యోగం చేస్తూ, జీతం వచ్చినపుడల్లా ఆ డబ్బుతో షూటింగ్ ప్లాన్ చేస్తూ, మరికొంతమంది మిత్రుల ద్వారా కూడా అవసరమయిన డబ్బు ఎప్పటికప్పుడు సమకూర్చుకుంటూ, అంచెలంచెలుగా తీశారు. అలాంటి అనుభవంతో చెప్పిన మాట అది. ఆ సినిమానే ఆయనకు అంత పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత సత్యజిత్ రే ఇంకెన్నో పిక్చర్లు తీశారు. ఆయన అనుకున్న సినిమాలే తీశారు.

విషయం ఇక్కడ ఆర్ట్ సినిమాలా, కమర్షియల్ సినిమాలా అన్నది కాదు. అనుకున్న సినిమాని ఒక కమిట్‌మెంట్ తో చేయగలగటం!

అసలు సినిమాలా ఇంకొకటా అన్నది కూడా సమస్య కాదు. చేయాలనుకున్నపని మీద ఒక క్లారిటీ, ఒక కమిట్‌మెంట్ ఉండి, ఏది ఎలా ఉన్నా ఆ ఒక్క పనిమీదే దృష్టి పెట్టగలిగినప్పుడు, ఆ పనిని పూర్తిచెయ్యడం అంత కష్టమేంకాదు.

బట్ .. అలాంటి ఏకాగ్రత పెట్టగల ఫినాన్షియల్ అండ్ పర్సనల్ ఫ్రీడమ్‌ను ముందు మనం సంపాదించుకోగలగాలి. ఆ తర్వాత అవకాశాలూ, విజయాలూ అన్నీ వాటికవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. రప్పించుకోగలుగుతాం.

కట్ టూ మా కంపెనీ - 

నిజంగా సినిమా తీయాలనుకుంటే ఇప్పుడు డబ్బు సమస్య కాదు. అంత తక్కువ బడ్జెట్ లో ఈ రోజుల్లో సినిమా తీయొచ్చు. అంతా కొత్తవాళ్లతో, నేచురల్ లొకేషన్లలో సినిమా తీస్తే - దాదాపు అది "నో బడ్జెట్" సినిమానే! ఇటీవలి కాలంలో వచ్చిన ఎన్నో యూత్ ఫుల్ కమర్షియల్ సినిమాలు ఈ విషయాన్ని నిరూపించాయి. పుష్కలంగా డబ్బుల వర్షం కురిపించాయి.

మొన్నటి నా స్విమ్మింగ్‌పూల్ చిత్రం ద్వారా నేను ఈమధ్యే పరిచయం చేసిన నా కో-చీఫ్ టెక్నీషియన్‌ ఒకరితో కలిసి, దాదాపు అంతా కొత్త వాళ్లతో, ఇప్పుడు నేను మా సొంత బ్యానర్‌లో ప్లాన్ చేస్తున్న మైక్రో బడ్జెట్ సినిమాలూ ఇలాంటివే. యూత్ ఫుల్ కమర్షియల్ ఎంటర్ టైనర్స్. కేవలం బడ్జెట్ దృష్టితో చూస్తే, వీటిని కమర్షియల్ ఆర్ట్ సినిమాలనవచ్చేమో!

ఏ కొంచెం హిట్ టాక్ వచ్చినా, ఈ చిన్న బడ్జెట్ సినిమాల కలెక్షన్ ఇంచుమించు పెద్ద సినిమాలకు పోటీగా ఉంటుంది. సినిమా ఆడకపోయినా, ఈ రేంజ్ బడ్జెట్ లో అసలు రిస్క్ అనేదే ఉండదు. ఇంకేం కావాలి?

ఒక్క హిట్!

అది జీవితాన్నే మార్చేస్తుంది ..  

No comments:

Post a Comment