Sunday 24 May 2015

మ్యూజిక్కా, మజాకా!?

"మా వాడు చదువుకోవట్లేదు. ఉద్యోగం చేయడు. బిజినెస్ చేయలేడు. ఏ పనీ చేతకాదు. ఎందుకూ పనికిరాడు. కొంచెం నీ దగ్గర డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పెట్టుకో!"

బయటివాళ్ల దృష్టిలో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అంటే మరీ అంత పనికిరానిదన్నమాట!

ఈ జోక్ నేను స్వయంగా గురువుగారు, దర్శకరత్న దాసరి నారాయణరావు గారి నోట విన్నాను.

ఒక్క డైరెక్షన్ డిపార్ట్‌మెంటే కాదు. టోటల్‌గా సినీఫీల్డులో పనిచేసేవారంతా ఎందుకూ పనికిరానివాళ్లని ఇతర ఫీల్డులవాళ్ల అభిప్రాయం.

"చదువుకోవడం చేతకానివాళ్లంతా సినీఫీల్డంటారు!" అని కూడా అంటారు కొంతమంది.

సరే, ఎవరు ఎలా అనుకున్నా ఏం ఫరవాలేదు. "మ్యాటర్ ఎప్పుడూ ఫీల్డు కాదు. మన మైండ్‌సెట్" అనేది కామన్‌సెన్స్ ..  

కట్ టూ మ్యూజిక్ మహరాజ్ - 

స్విమ్మింగ్‌పూల్ ద్వారా మ్యూజిక్ డైరెక్టర్‌గా నేను పరిచయం చేస్తున్న ప్రదీప్‌చంద్ర కు మ్యూజిక్ ఒక ప్యాషన్, ప్రాణం కూడా.

ఎం ఏ క్లాసికల్ మ్యూజిక్, ఎం ఏ వెస్టర్న్ మ్యూజిక్ పూర్తిచేశాడు. తర్వాత .. చదవడం చేతకాదు అనుకునేవాళ్లను సంతృప్తిపర్చడం కోసం కంప్యూటర్ సైన్స్ లో ఎం టెక్ చేశాడు. ఎం ఎస్సీ సైకాలజీ కూడా చేశాడు.

ఆ తర్వాతే, ఆ "మంద మెంటాలిటీ" దుకాణం మూసేసి, మళ్ళీ తనకెంతో ప్రియమైన మ్యూజిక్‌ని చేరుకున్నాడు. అక్కున చేర్చుకున్నాడు.  

స్విమ్మింగ్‌పూల్ ఒక రొమాంటిక్ హారర్ సినిమా. ఈ చిత్రం కోసం ప్రదీప్ చేసిన పాటల్లో ఒక్క మెలొడీ చాలు. తన టాలెంట్ ఏంటో గుర్తించడానికి. చివరి రీల్, చివరి సీన్‌లో అతనిచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలు. అసలు అతనేంటో తెలుసుకోడానికి!

ప్రదీప్‌కు ఇది జస్ట్ ఒక చిన్న ప్రారంభం మాత్రమే. ప్రాక్టికల్ పాయింటాఫ్ వ్యూలో తను నేర్చుకోవాల్సింది, చేయాల్సింది, చేసి తీరాల్సిందీ చాలా ఉంది.

నాకు తెలుసు. ప్రదీప్ అనుకున్నది సాధిస్తాడు.

ఆల్ ది బెస్ట్, ప్రదీప్! నీ తొలి ఆడియో వేడుకను "లైవ్" చేయగలుగుతున్నందుకు నాకు, కార్తీక్‌కు, మన ప్రొడ్యూసర్‌ అరుణ్ గారికి, మొత్తం మన శ్రీశ్రీ మూవీ క్రియేషన్స్ టీమ్‌కూ చాలా ఆనందంగా ఉంది.

రేపు జరగనున్న స్విమ్మింగ్‌పూల్ ఆడియో లాంచ్ నీ వేడుక.

సినిమా భాషలో చెప్పాలంటే,
"ఇంక కుమ్మెయ్!" ..     

Friday 22 May 2015

స్విమ్మింగ్‌పూల్ హీరోయిన్‌కు హాప్పీ బర్త్‌డే!!

కొన్ని అరంగేట్రాలు అనుకోకుండా జరిగిపోతాయని ఆ మధ్య ఓ బ్లాగ్ పోస్ట్ రాశాను. అది ప్రియ గురించే. 

స్విమ్మింగ్‌పూల్ సినిమాలో అఖిల్ కార్తీక్‌తో కలిసి, తన తొలి చిత్రంలోనే ఫుల్ మార్కులు కొట్టేసిన విశేషాలు కూడా ఓసారి ఇదే బ్లాగ్‌లో రాశాను. 

మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్ కూడా ఒకే ఒక్క అద్భుతమయిన మెలొడీ నాకిచ్చి, ప్రియను రొమాన్స్‌లో ముంచి తీసేలా చేశాడు. బహుశా ప్రియ ఇప్పటికీ ఆ రొమాంటిక్ ట్రాన్స్ లోనుంచి బయటికి వచ్చి ఉండదు.

ఒక కెమెరామన్ పాయింటాఫ్ వ్యూలో, ఒక డెబ్యుటెంట్‌గా ఆమెకు ఇవ్వాల్సిన సలహాలు సూచనలు ఇస్తూనే .. మా డిఓపి వీరేన్ అయితే కెమెరాతో ప్రియని ఒక ఆట ఆడుకున్నాడు.

కట్ టూ బర్త్‌డే బేబీ -  

గోల్డెన్ స్పూనో, సిల్వర్ స్పూనో నోట్లో పెట్టుకుని పుట్టినా - ప్రియలో ఎలాంటి పనికిరాని ఈగోలు లేవు. నంబర్ వన్ భోలా. కానీ, అదే ప్రియ, సందర్భం వచ్చినప్పుడు అంతుచూసేదాకా వాదిస్తుంది. అవసరమయితే బెల్ట్ తీస్తుంది, రాయి తీస్తుంది. ఆ రేంజ్ గట్స్ కూడా ఉన్నాయి తనకి.

ఇవన్నీ ఎలా ఉన్నా .. యాక్టింగ్ తనకి ప్యాషన్. ప్రాణం కూడా.

స్విమ్మింగ్‌పూల్ లో నేను ప్రియని ఇంట్రొడ్యూస్ చేసాను. తనలో ఒక హీరోయిన్‌గా టాప్ రేంజ్‌కు వెళ్లగల క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. వాటన్నిటికితోడు ఒక పెద్ద అండ కూడా ఉంది. ఆ అండ తన పప్పా వశిష్ట.

ఇవన్నీ సద్వినియోగం చేసుకుంటూ కాన్‌ఫిడెంట్‌గా ముందుకు వెళితే చాలు. ప్రియ తను అనుకున్నది చాలా సులభంగా  సాధిస్తుంది. సాధించాలని ఈ పుట్టినరోజు సందర్భంగా నేను మనస్పూర్తిగా విష్ చేస్తున్నాను.

హాపీ బర్త్‌డే ప్రియా! యూ రాక్!!            

భరత్‌కృష్ణ నవల

ఒక బెస్ట్ సెల్లర్ ఇంగ్లిష్ నవల జూన్‌లో ప్రపంచమంతా విడుదల కాబోతోంది. ఆ నవల పేరు తర్వాత చెప్తాను. ప్రస్తుతం ఆ నవలా రచయిత గురించే ఈ బ్లాగ్ పోస్ట్.

ఇది ఆ రచయిత రాసిన తొలి నవల. అయినా ముందే 'బెస్ట్ సెల్లర్' అని చెప్తున్నానంటే .. అది నా నమ్మకం. రేపు కాబోయే నిజం.

చెప్పాలంటే .. ఆ రైటర్‌కు నేను ఫ్యాన్‌ని!

కట్ టూ భరత్‌కృష్ణ - 

గుంటూరులోని ఓ కేంద్రప్రభుత్వ విద్యాసంస్థలో అప్పట్లో ఓ రెండేళ్లు పనిచేశాన్నేను.

ఆ రెండేళ్లలో, నేను చాలా దగ్గరగా గమనించిన విద్యార్థుల్లో కొందరు ఇప్పుడు ఐ ఎ యస్ లయ్యారు. ఎందరో డాక్టర్లు, ఇంజినీర్లయ్యారు. మరెందరో మంచి బిజినెస్‌మేన్‌లయ్యారు. ఇంకెందరో రకరకాల ఫీల్డుల్లో, వివిధహోదాల్లో, విదేశాల్లో కూడా ఉన్నారు.

అప్పుడు, అలా నేను చాలా దగ్గరగా గమనించిన విద్యార్థుల్లో కొందరితో నాకిప్పటికీ కమ్యూనికేషన్, అనుబంధం ఉంది. వాళ్లను నేను అభిమానిస్తాను. చెప్పాలంటే .. వారికి నేను ఫ్యాన్‌ని.

అదిగో, అలా .. నేను భరత్‌కృష్ణ ఫ్యాన్‌ని!

భరత్ గురించి నేనింతకుముందే ఒకసారి ఇదే బ్లాగ్‌లో "ఎవరు?" అంటూ పేరు చెప్పకుండా ప్రస్తావించాను.

భరత్ నవలను, దాని మాన్యుస్క్రిప్ట్ దశలోనే చదివిన క్రెడిట్, ఆనందం, గర్వం నాకున్నాయి. గర్వం ఎందుకంటే .. నేను చూస్తుండగా, నా కళ్లముందు ఎదిగిన నిలువెత్తు వ్యక్తిత్వం భరత్.

భరత్ ఈ నవల కాన్‌సెప్ట్‌ను అనుకున్న స్టేజ్ నుండి, దాన్ని రాయడం పూర్తిచేసేవరకు ప్రతి స్టేజ్ నాకు తెలుసు. చాలా తొందరగా రాయమని పోరుపెట్టింది నేనే. అది బయటికి రావడం ఆలస్యమౌతుంటే ఏమీ చేయలేక చూస్తుండిపోయిన సాక్షినికూడా నేనే.

నవల టాపిక్ ఏంటి, ఎలా ఉంటుంది, పేరేంటి .. అవన్నీ మీకు వెంటవెంటనే తెలిసేలా చేస్తాను. ఆ విషయం అలా పక్కనపెడితే - చాలా విచిత్రంగా - నా స్విమ్మింగ్‌పూల్ సినిమా, భరత్ నవల .. రెండూ .. దాదాపు ఒకే సమయంలో  రిలీజ్ అవుతున్నాయి.

ఇది మాత్రం నేను ఊహించని విశేషం! 

Thursday 21 May 2015

అసలు స్విమ్మింగ్‌పూల్ టైటిల్ ఐడియా ఎలా వచ్చింది?

దీని గురించి చెప్పాలంటే, మన ఫిలిం చాంబర్‌ల అత్యంత ఉన్నతస్థాయి మేధోవిత్వానికి సంబంధించిన పిట్ట కథ ఒకటి మీకు చెప్పాలి.

విషయం తెల్సుకున్న తర్వాత, ఆయా చాంబర్‌ల మేధోవిత్వానికి మీరు నవ్వుతారో, ఏడుస్తారో, తిడతారో, ఇంకేం చేస్తారో .. అది మీకే వదిలేస్తున్నాను.

స్విమ్మింగ్‌పూల్ సినిమాకు మేము ముందుగా అనుకున్న టైటిల్ "దేవి".

చాంబర్‌లో ముందే కనుక్కున్నాము. ఆ టైటిల్ ఫ్రీ గా ఉంది. రిజిస్టర్ చేసుకోవచ్చు అన్నారు. మేం రిజిస్ట్రేషన్‌కు అప్ప్లై చేశాం.

కట్ టూ ది  గ్రేట్ రూల్స్ ఆఫ్ ది చాంబర్ -

"శ్రీదేవి" అన్న టైటిల్ ముందే రిజిస్టర్ అయి ఉన్నందున, మీ టైటిల్ "దేవి" దానికి దగ్గరగా ఉన్నందున .. మీకీ టైటిల్ ఇవ్వటం లేదు .. అన్నారు ది గ్రేట్ చాంబర్ వారు!

అదండీ విషయం.

అంటే "రాజన్న" సినిమా తీశారు కాబట్టి, ""రామన్న" సినిమా టైటిల్ ఇవ్వరా? కామన్ సెన్స్!

కట్ టూ ఫ్లాష్‌బ్యాక్ - 

సరిగ్గా పదేళ్ల క్రితం కూడా నాకిలాగే జరిగింది. "ఒక్కటి" అన్న టైటిల్ రిజిస్టర్‌కు పంపాను.

"ఒక్కడు", "అతనొక్కడే" టైటిల్స్ ఆల్రెడీ ఉన్నందున మీకు "ఒక్కటి" టైటిల్ ఇవ్వటం లేదు అని శలవిచ్చారు చాంబర్ వారు!

ఏమైనా అర్థముందా?

ఒక్కడు, అతనొక్కడే టైటిల్స్ ఒక వ్యక్తిని గురించి చెప్తాయి. "ఒక్కటి" అనేది ఒక ఒంకె. డిజిట్. ఎగైన్ కామన్ సెన్స్!

సో, ఇలా ఉంటాయన్నమాట చాంబర్ రూల్స్!

విచిత్రమేంటంటే, ఈ రూల్స్ పెద్ద హెరోలకు, పెద్ద డైరెక్టర్‌లకు, పెద్ద బ్యానర్లకూ అస్సలు వర్తించవు. వాళ్లు రిజిస్టర్ కాకుండానే టైటిల్ అనౌన్స్ చేసుకుంటారు. ఇంకొకరి పేరు మీద ఆ టైటిల్ రిజిస్టర్ అయి ఉన్నాసరే, అదే టైటిల్ తో వారు సినిమాలు తీసేసుకుంటారు. అవి రిలీజవుతాయి. పోతాయి. అది వేరే విషయం.

అక్కడ ఎలాంటి రూల్స్ అడ్డురావు.  

నేను రాసి పెండింగ్‌లో పెట్టిన ఒక పుస్తకంలో ఇలాంటి మేధోవిత్వపు ఎపిసోడ్స్ చాలా రాశాను. అది మరి నేను ఎప్పుడు పబ్లిష్ చేస్తానో చూడాలి.

కట్ బ్యాక్ టూ మన టైటిల్ - 

పైన చెప్పిన లాంటి పరిస్థితుల్లో .. విధిలేక, మనం మాత్రం వేరే టైటిల్ కి వెళ్లిపోతాం. అలా చివరి క్షణాల్లో మేము అనుకున్న టైటిలే ఈ "స్విమ్మింగ్‌పూల్!"

బట్ నో ప్రాబ్లమ్. అంతా మన మంచికే అన్నట్టు, ఈ టైటిల్ మాకు ఇంకా బాగా వర్కవుట్ అయ్యింది. అయ్యేలా చేసుకున్నాం. 

Tuesday 19 May 2015

స్విమ్మింగ్‌పూల్ బ్లాగ్ మేనియా!

ఇంక కేవలం 12 రోజుల్లో స్విమ్మింగ్‌పూల్ ఆడియో లాంచ్ ఉంది. లైవ్ చేస్తున్నాం.

ఏ చానెల్ .. వెన్యూ ఎక్కడ తెలియాలంటే ఓ 2 రోజులు ఆగాలి. ఆ వివరాలు ఇక్కడే ఈ బ్లాగ్‌లోనూ, నా ఫేస్‌బుక్‌లోనూ తప్పకుండా పోస్ట్ చేస్తాను.

ఆడియో తర్వాత కేవలం మరో 12 రోజుల్లో స్విమ్మింగ్‌పూల్ సినిమా రిలీజ్ జూన్ 12 నాడు ఉంటుంది.

తప్పనిసరి పరిస్థితుల్లో, అప్పుడేదయినా పెద్ద సినిమా అనుకోకుండా ఎంటర్ అయినత్లైతే తప్ప, రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు ఉండదు. ఒకవేళ అనుకోకుండా ఏదయినా పెద్ద సినిమా అప్పుడు ఉన్నట్లైతే, ఒక వారం గ్యాప్ తర్వాత మన సినిమా రిలీజ్ ఉంటుంది.

కట్ టూ నా బ్లాగ్ మేనియా -

ఈ విషయంలో మరీ అంత పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి.

బట్, తప్పకుండా, ఈ సినిమా నిర్మాణ సమయంలో మా చిన్ని చిన్ని అనుభవాలు, జ్ఞాపకాలు, స్వీట్ నథింగ్స్, హాట్ డిస్కషన్స్, హాప్పీ ముమెంట్స్, ఊహించని ట్విస్టులు.. ఎట్సెట్రా ఎట్సెట్రా .. అన్నీ చిన్న చిన్న టిడ్‌బిట్స్ రూపంలో నా ఈ బ్లాగ్‌లో ఈ రోజునుంచే రాస్తున్నాను.

ఒకటీ అరా వేరే ముఖ్యమైన పోస్టులు తప్ప - స్విమ్మింగ్‌పూల్ సినిమా రిలీజ్ వరకూ, ఆతర్వాత కొన్నాళ్లూ దాదాపు అంతా స్విమ్మింగ్‌పూల్ గురించే ఉంటాయి పోస్టులన్నీ.

హోప్, యు ఎంజాయ్ .. 

స్విమ్మింగ్‌పూల్ ఆడియో లాంచ్ 100% లైవ్!

జూన్ 1 నాడు జరగనున్న స్విమ్మింగ్‌పూల్ ఆడియో లాంచ్ ను పూర్తి "లైవ్" ప్రోగ్రామ్‌గా జరపడానికి ప్రొడ్యూసర్ అరుణ్ కుమార్ పచ్చ జెండా ఊపేశారు.

వెన్యూ ఎక్కడ అన్నది ఇవాళ రేపట్లో ఫిక్సయిపోతుంది. గెస్ట్‌లకు ఇబ్బంది కాకుండా - సాధ్యమైనంతవరకు, ఆడియో లాంచ్ వేదిక ఫిలిమ్‌నగర్, జుబ్లీహిల్స్ పరిసరాల్లోనే ఉంటుంది.

స్విమ్మింగ్‌పూల్ ఆడియో సిడి, నంబర్ వన్ ఆడియో సంస్థ "ఆదిత్య మ్యూజిక్" ద్వారా రిలీజ్ కాబోతోంది.

బిగ్ థాంక్స్ టూ ఆదిత్య సత్యదేవ్!

ఆడియో లాంచ్ ప్రోగ్రాంకోసం గెస్ట్ లిస్ట్ కూడా భారీగానే తయారవుతోంది. వేదికమీద కనీసం ఓ అరడజను మంది ప్రముఖ సినీ గెస్ట్‌లు ఉండే అవకాశం ఉంది. లాస్ట్ మినట్ సర్‌ప్రైజ్‌లు మామూలే.

అనుకోకుండా, స్విమ్మింగ్‌పూల్ ఆడియో కార్యక్రమం ఓ పెద్ద ఈవెంట్ కాబోతోంది.

కట్ టూ మ్యూజిక్ -

స్విమ్మింగ్‌పూల్ సినిమా కోసం గీతామాధురి, సుభాష్ నారాయణ్, శ్రావణభార్గవి, లిప్సిక, రేవంత్, రమ్య బెహరా పాడారు. రేపటి ఆడియో లాంచ్‌లో ఈ సింగర్స్ అంతా మళ్లీ పాడబోతున్నారు. లైవ్‌గా!

తన ఏర్పాట్లన్నీ తను చకచకా చేసుకెళ్తున్నాడు మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్ర. ఈ సినిమా ద్వారా ప్రదీప్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం నిజంగా నాకు గర్వంగా ఉంది. సో, ఈ మ్యూజిక్ లాంచ్ ప్రదీప్‌కు మొట్టమొదటి లాంచ్ అన్నమాట.

మా టీమ్ అందరి తరపున ప్రదీప్‌కు అడ్వాన్స్ కంగ్రాట్స్!

ప్రదీప్, ఈ ఆడియో లాంచ్ పూర్తిగా నీ కార్యక్రమం. యూ రాక్, ప్రదీప్!! 

Saturday 16 May 2015

అంతా మన మంచికే!

కొన్ని పరిచయాలు, ప్రయాణాలు జీవితంలో ఒక మంచి అనుభూతినిస్తాయి. మరచిపోలేని తీపి జ్ఞాపకాలుగా మన మనస్సులో స్థిరపడిపోతాయి.

అలాంటి ఒక అద్భుతమైన అనుభూతి, అలాంటి ఒక మర్చిపోలేని జ్ఞాపకం .. మొన్నటి అమెరికా షూటింగ్ సందర్భంగా - నాగబాబు గారితో అతి దగ్గరగా గడిపే అవకాశం లభించిన ఆ ఆరు రోజులు!

ఆ మధ్య జరిగిన "మా" ఎన్నికలప్పుడు నాగబాబు గారికి ఏదో అలా పరిచయం అయ్యాను. అంతే.

ఓ కొత్త సినిమా షూటింగ్ కోసం మొన్న అమెరికా వెళ్లినపుడు మేమిద్దరం కలిసి ఒకే ఫ్లైట్‌లో ప్రయాణించాం. న్యూజెర్సీలో ఒకే హోటల్లో ఉన్నాం.

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్న, మంచి నటుడు, పెద్ద నిర్మాత కూడా అయిన నాగబాబు గారు నాతో అంత క్లోజ్‌గా మాట్లాడతారనీ, నా కెరీర్‌కు ఉపయోగపడే మంచి విషయాలెన్నో నాకు చెబుతారనీ నేను కలలో కూడా అనుకోలేదు.

కానీ జరిగింది.

అది కల కాదు.

నిజం.

కట్ టూ 'అంతా మన మంచికే' - 

ఒకవైపు ఓషో తులసీరాం గారి దర్శకత్వంలో నిషా కొఠారీతో కలిసి నేను నటించిన "క్రిమినల్స్" చిత్రం రిలీజ్; మరోవైపు మనోహర్ చిమ్మని హాట్ రొమాంటిక్ హారర్ "స్విమ్మింగ్‌పూల్" ఆడియో రిలీజ్, ఫిలిం రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ షూటింగ్ రావడం .. ప్లస్ మరో కారణం వల్ల ఈ షూటింగ్‌కు అంత ఉత్సాహంగా వెళ్లలేదు నేను.

కానీ నేనీ షూటింగ్‌కు వెళ్లడమే మంచిదయ్యింది. లేదంటే - జీవితంలో ఒక గొప్ప "క్వాలిటీ టైమ్" ను మిస్ అయ్యేవాణ్ణి. అదీ, నాగబాబు గారితో!

మా షూటింగ్ న్యూయార్క్‌లో.  మేం ఉన్నది మాత్రం న్యూజెర్సీలోని 'ఎక్జిక్యూటివ్ సూట్స్' హోటల్లో.

నాగబాబు గారూ, నేనూ కలిసి కాఫీ తాగడం .. షూటింగ్ లేనప్పుడు బయటకెళ్లి షాపింగ్ చేయడం నేనెన్నటికీ మర్చిపోలేను.

నేను ఎలా సినీఫీల్డుకొచ్చాను, ఎవరి సపోర్ట్ లేకుండానే ఎలా ఇన్ని సినిమాల్లో హీరోగా నటించగలిగాను, పదేళ్లనుంచీ ఎలా ఫీల్డులో ఉండగలిగాను, ఎలా ఇంకా కంటిన్యూ అవుతున్నాను .. ఇలా నాగురించి ప్రతి ఒక్కటీ అడిగి తెలుసుకున్నారు నాగబాబు గారు. నా కెరీర్‌కు ఉపయోగపడే మంచి సలహాలెన్నో ఇచ్చారు.

ఇద్దరం కలిసి ఫోటోలెన్నో దిగాం. అప్పుడప్పుడూ, నన్ను ఒక్కన్నే తనకు నచ్చిన స్పాట్‌లో నిలబెట్టి స్వయంగా నాగబాబుగారే ఫోటోలు తీయడం .. అప్పుడప్పుడూ ఇద్దరం "డిస్కషన్" చేయడం ..

అదంతా అసలు మర్చిపోలేను.

ఈ సందర్భంలోనే నాగబాబు గారితో "స్విమ్మింగ్‌పూల్" సినిమా గురించీ, దాన్ని మా డైరెక్టర్ మనోహర్ గారు కేవలం 13 రోజుల్లో పూర్తిచేయడం గురించి కూడా చెప్పాను.

చాలా ఆసక్తిగా విన్నారు. "తొందర్లోనే నీకు తప్పకుండా బ్రేక్ వస్తుంది. నా మాట నిజమౌతుంది చూడు!" అంటూ ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నాలో నింపారు.  

మా ఇద్దరి మాటల మధ్య ఒకసారి పుస్తకాల టాపిక్ కూడా వచ్చింది. రాబిన్ శర్మ "ది మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారీ" నేను చదివానని చెప్పగానే - నాగబాబు గారు కూడా ఎంతో ఉత్సాహంగా తను కూడా ఆ పుస్తకం చదివానని చెప్పారు. ఆ పుస్తకంలోని చాలా ముఖ్యమైన పాయింట్స్ గురించి చర్చించారు.

కొసమెరుపు ఏంటంటే -  ఆ పుస్తకాన్ని చదవమని నాగబాబు గారికి ఇచ్చింది మరెవరోకాదు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్!

-- స్విమ్మింగ్‌పూల్ హీరో అఖిల్ కార్తీక్ గెస్ట్ పోస్ట్  

Tuesday 12 May 2015

అసలేందీ స్విమ్మింగ్‌పూల్ సినిమా?

> ఒక ప్యాషనేట్ యంగ్ ప్రొడ్యూసర్, ఒక క్రియేటివ్‌లీ కూల్ డైరెక్టర్ కలిసి తీసిన సినిమా ఇది.

> స్విమ్మింగ్‌పూల్ - మామూలుగా ఒక హారర్ సినిమా. కానీ, ఏదో ఉట్టుట్టి హారర్ కాదు. "హాట్ రొమాంటిక్ హారర్!" సో, విషయం అర్థమయిందనుకుంటాను.

> ప్రధానంగా మెయిన్ ఆర్టిస్టులు, టెక్నీషియన్‌ల విషయంలో "కోపరేటివ్ పధ్ధతి"లో ప్లాన్ చేసిన ఈ సినిమా .. పోను పోను ఒక మిడ్ రేంజ్ బడ్జెట్ సినిమా అయింది చివరికి. అంటే - ఏదో చిన్నగా ప్లాన్ చేశాం కదా అని ఎక్కడా కాంప్రమైజ్ కాలేదన్నమాట!

> రెడ్ ఎం ఎక్స్ కెమెరాతోపాటు, దాదాపు ప్రతిరోజూ స్టడీకామ్‌ను కూడా ఉపయోగించి - సుమారు 40 రోజుల్లో తీయాల్సిన ఈ సినిమాను - కేవలం 13 రోజుల్లో పూర్తిచేశాం.

> 13 రోజుల్లో చేశాం అంటే .. ఏదో అలా చుట్ట చుట్టి పడేశామని కాదు. దాదాపు ప్రతిరోజూ రెండు/మూడు షిఫ్టులు పనిచేశాము ఈ సినిమా కోసం. అలా పనిచేయగల ప్యాషన్ ఉన్న లైక్‌మైండెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లనే (దాదాపు) ఈ సినిమాకు ఎన్నుకున్నాం.

> ఇప్పుడు, సూపర్ క్వాలిటీ ఔట్‌పుట్ వచ్చిన ఈ సినిమాను చూసి, రెండే రెండు చిన్న కట్స్ ఇస్తూ, సెన్సార్ ఆఫీసర్‌తోపాటు, మిగిలిన సభ్యులంతా కూడా బాగుందంటూ మమ్మల్ని అప్రిషియేట్ చేయడం విశేషం. మాకు ఆనందం కూడా. ఎందుకంటే స్విమ్మింగ్‌పూల్ సినిమాకు వాళ్లే మా తొలి ప్రేక్షకులు కాబట్టి.

> ఒక మెలొడీ, ఒక ఐటమ్ సాంగ్‌తోపాటు .. ప్రమోషన్ కోసం మరో రెండు పాటలున్న ఈ సినిమా ఆడియోను ప్రముఖ ఆడియో సంస్థ ఆదిత్య మ్యూజిక్ ద్వారా జూన్ 1 నాడు రిలీజ్ చేస్తున్నాము.

> ఎబ్రాడ్‌లో - యు కె, యూరోప్, యు ఎస్ లలో కూడా రిలీజవుతున్న మొట్టమొదటి మైక్రో బడ్జెట్ సినిమా స్విమ్మింగ్‌పూల్.

> సినిమా రిలీజ్ కోసం అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి. ఒకటి రెండు పెద్ద సినిమాల రిలీజ్ హడావిడివల్ల ఏర్పడిన గందరగోళంతో, వారం వారం కుప్పలుగా రిలీజవుతున్న చిన్న సినిమాల తాకిడి కూడా కొంచెం తగ్గాక, బహుశా జూలై చివర్లో స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ ఉంటుంది.      

Monday 11 May 2015

గోల్డ్ మెడల్స్‌కు అసలు విలువుందా?

గోల్డ్ మెడల్స్ కోసం అసలు నేనెప్పుడూ చదవలేదు. అవి వస్తాయని కూడా ఊహించలేదు.

కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రెండు గోల్డ్ మెడల్స్ పొందాన్నేను.

ఓ అదేపనిగా 365 రోజులు చదివే అవసరం లేకుండా, ఎంత తక్కువ సమయంలో ఎలా చదివితే, ఎలా రాస్తే, మార్కులు బాగా వస్తాయో నాకు బాగా తెలుసు.
అది నా ఇంట్యూషన్. అంతవరకే నాకు తెలుసు.

నిజంగా .. అంతవరకు మాత్రమే నాకు తెలుసు!

ఈ వాక్యాన్ని ఎందుకంతగా స్ట్రెస్ చేస్తూ చెప్తున్నానంటే - ఏ మెడల్స్ రాకుండానే, చదువులో నాతో ఏ రకంగానూ పోటీపడలేని నా మిత్రులు కొందరికి మాత్రం నా కంటే ఎన్నో విషయాలు ఎంతో బాగా తెలుసన్న విషయం నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. అందుకని చెప్తున్నాను.

యూనివర్సిటీ పోస్టుల ఇంటర్వ్యూలప్పుడు, ఏ మెడల్స్ రాని నా మిత్రులు ఒక విషయం నాకు చాలా స్పష్టంగా  ముందే చెప్పారు.

"ఈ జాబ్ నీకు రాదు. నాకు వస్తుంది" అని!

వాళ్లకు ఆ జాబ్ ఎందుకు వస్తుందో కూడా చెప్పారు. మంత్రుల రికమండేషన్, మనీ వగైరా అన్నమాట.

అలా చెప్పిన నా మిత్రులకు యూనివర్సిటీ జాబ్ ఇచ్చింది. రెండు గోల్డ్ మెడల్స్ ఇచ్చి నన్ను మాత్రం సెలక్టు చేసుకోలేదు నా యూనివర్సిటీ!

అలాగని ఇంటర్వ్యూలో నేను సరిగా పెర్ఫామ్ చేయలేదని కూడా కాదు. అసలు వాళ్లు నన్ను ప్రశ్నలు అడిగితే కదా!?      

జస్ట్ నా ఫైల్ అలా చూసి, "ఒకే మనోహర్ .. ఆల్ ద బెస్ట్!" అని పంపించేశారు.

దీనిమీద ఇంక నేను ఎంతైనా రాయగల జ్ఞాపకాలు నాకున్నాయి. కానీ, నెగెటివిటీ నాకిష్టం లేదు. సో, గోల్డ్ మెడల్స్ కు సంబంధించిన ఈ కోణం ఇక్కడితో ఆపేస్తున్నాను.

కట్ టూ తెల్ల ప్యాంట్ - 

అసలిదంతా మళ్లీ గుర్తుకుతెచ్చుకునేవాణ్నే కాదు. మొన్నీమధ్య నా ఫేస్‌బుక్ ఆల్బమ్‌లోంచి ఒక ఫోటో టక్కున బయటకొచ్చింది.

అది .. అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ చేతులమీదుగా నేను గోల్డ్ మెడల్ తీసుకొంటున్న ఫోటో.

ఆ ఫోటో ఒక గమ్మత్తైన జ్ఞాపకాన్ని నాకు మళ్లీ గుర్తు చేసింది. ఆ జ్ఞాపకాన్ని మీతో పంచుకోవడం కోసమే ఈ బ్లాగ్‌పోస్ట్.

గోల్డ్ మెడల్ తీసుకొనే కాన్వొకేషన్ ఫంక్షన్ కోసం ఆరోజు తెల్ల షర్టు, తెల్ల ప్యాంటు వేసుకెళ్లాలని డ్రెస్ కోడ్.

నాకసలు వైట్ ప్యాంటే లేదు. అప్పటికప్పుడు కొనుక్కొని వేసుకొనే పరిస్థితి కూడా లేదు. ఫ్రెండ్సూ అంతే. అందరం హాస్టల్ కోసం యూనివర్సిటీలో చేరినవాళ్లమే!

ఇంక చేసేదేంలేక, నా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా నాకు సరిపోయే వైట్ ప్యాంట్ కోసం క్యాంపస్‌లోని మొత్తం ఎ హాస్టల్, మంజీరా హాస్టల్ అంతా వెదికారు. చివరికి దొరికింది.

అలా దొరికిన ఆ తెల్ల ప్యాంటుని, నా తెల్ల చొక్కామీద వేసుకొని వెళ్లి ఆరోజు గోల్డ్ మెడల్ అందుకున్నాను.

నా చేతికి ఎప్పుడూ మా నాన్న కొనిపెట్టిన ట్రెస్సా వాచ్ ఉండేది. బయటకు వెళ్తున్నప్పుడు ఏది మిస్ అయినా దాన్ని మాత్రం మిస్సయ్యేవాణ్నికాదు. అదో ఆనందం. అలవాటు. క్రేజీ.

అయితే, అంతకు ముందురోజే నా ప్రియమైన ఆ వాచ్ స్ట్రాప్ తెగిపోయింది. సో, కాన్వోకేషన్ రోజు నేను చేతికి వాచీ లేకుండానే వెళ్లాను.

ఫోటోలో నా ఎడమచేతి మణికట్టు దగ్గర బోసిగా ఆ గుర్తు కూడా కనిపిస్తుంది.  

చాలా ఏళ్ల తర్వాత, కనీసం ఇలాంటి గమ్మత్తయిన జ్ఞాపకాల్ని గుర్తుచేసిన నా గోల్డ్ మెడల్స్ అసలు విలువలేనివని నేననుకోను.

వాటికి చాలా విలువుంది!  

Sunday 10 May 2015

జూన్ 1 న స్విమ్మింగ్‌పూల్ ఆడియో రిలీజ్!

ఎప్పుడెప్పుడా అనుకుంటున్న స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ షెడ్యూల్ చివరకు నిన్న రాత్రి ఫైనల్ చేశాము.

జూన్ 1 వ తేదీ స్విమ్మింగ్‌పూల్ ఆడియో లాంచ్ ఉంటుంది.

జూన్ 12 వ తేదీ స్విమ్మింగ్‌పూల్ సినిమా రిలీజ్.

ఒకవేళ జూన్ 12 వ తేదీనే ఏదయినా పెద్ద సినిమా రిలీజ్ ఉండే పరిస్థితి ఉన్నట్లయితేనే, స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ తేదీలో చిన్న మార్పు ఉంటుంది. థియేటర్‌ల అందుబాటు చూసుకొని, ఆ తర్వాత వారం రిలీజ్ చేస్తాము. అంతే.

అయితే - నా అంచనా ప్రకారం అలాంటి సమస్య రాకపోవచ్చు.

కట్ టూ సెన్సార్ - 

నా ఫేస్‌బుక్ లోనో, బ్లాగ్ లోనో మొన్నే ఈ విషయం రాసినట్టు గుర్తు. సినిమా చూసిన సెన్సార్ ఆఫీసర్, మెంబర్స్ కేవలం రెండే రెండు చిన్న కట్స్‌తో అంతా ఓకే చేసేశారు. బాగుందంటూ అప్రిషియేట్ చేశారు, "విష్ యూ ఆల్ సక్సెస్" అంటూ అభినందించారు కూడా.

ఆ రకంగా మా స్విమ్మింగ్‌పూల్ సినిమాకు తొలిప్రేక్షకులు వాళ్లే!

సెన్సార్ రూల్స్ ప్రకారం, మామూలుగా హారర్ జోనర్‌కి "ఏ" సర్టిఫికేట్ ఇస్తారో అదే మాకూ ఇచ్చారు.

ఇప్పుడిక్కడ విషయం సర్టిఫికేట్ కాదు. స్టఫ్! ఆ స్టఫ్‌ను మేము ఎంతవరకు ప్రమోట్ చేసుకొని, ఏ రేంజ్ ఓపెనింగ్స్ తెచ్చుకోగలం అన్నదే ముఖ్యం.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కనీసం 40 థియేటర్లలో స్విమ్మింగ్‌పూల్ రిలీజ్‌కు అన్ని సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి.

కట్ టూ ప్రదీప్‌చంద్ర - 

జూన్ 1 న, ఆదిత్య మ్యూజిక్ ద్వారా, స్విమ్మింగ్‌పూల్ ఆడియో రిలీజ్‌కు నిన్న రాత్రినుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ విషయంలో నా మిత్రులు ఆదిత్య సత్యదేవ్‌కు బిగ్ థాంక్స్!

స్విమ్మింగ్‌పూల్ చిత్రం ద్వారా నేను పరిచయం చేస్తున్న మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్రకు ఇదే తొలి ఆడియో లాంచ్!

ప్రదీప్ మై డియర్, యూ రాక్ .. !!  

Saturday 2 May 2015

సినిమా .. ఒక పెద్ద బిజినెస్!

ఒక కళ.
ఒక మాయ.
ఒక ఆకర్షణ.
ఒక స్పెక్యులేషన్.
ఒక జూదం.
ఒక జీవితం.

సినిమా గురించి పైన చెప్పిన ప్రతి ఒక్క మాట అక్షరాలా నిజం. కాకపోతే .. ఒక్కో సినిమా సెటప్‌ని బట్టి, అప్పటి పరిస్థితులను బట్టి, వ్యక్తుల అనుభవాలను బట్టి ఈ నిర్వచనాలు మారుతుంటాయి.

నలభై కోట్లు పెట్టి - ఓ బ్రాండెడ్ హీరోతో, మరో బ్రాండెడ్ డైరెక్టర్ ఏడాదిపాటు చెక్కిన ఒక తెలుగు సినిమాను రెండే రెండు గంటల్లో ప్రేక్షకుడు చెత్త సినిమా అనో, వేస్ట్ అనో ఒక్క మాటలో తేల్చిపడేయొచ్చు.

మరోవైపు .. కేవలం ఓ నలభై లక్షల్లో కొత్తవాళ్లతో తీసిన ఒక మైక్రో బడ్జెట్ సినిమాను చూసి, అదే ప్రేక్షకుడు బాగుంది అని దాన్ని హిట్ చేయొచ్చు.

ఈ రెండు సినిమాల నిర్మాణంలో ప్రాసెస్ ఒకటే. రేంజ్ మాత్రమే వేరు. ఒక సినిమా కంటెంట్ ఆ క్షణం ప్రేక్షకులకు నచ్చింది. మరొక సినిమా కంటెంట్ నచ్చలేదు. అంతే.

సినిమా పుట్టినప్పటినుంచీ ఇదే వ్యవహారం.

కేవలం 5 శాతం సినిమాలు మాత్రమే ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటాయి. అది హాలీవుడ్ కావొచ్చు. బాలీవుడ్ కావొచ్చు. మన తెలుగువుడ్డు కూడా కావొచ్చు. ఎక్కడయినా, ఎప్పుడయినా ఇదే జరిగేది.

95% ఫెయిల్యూర్ రేట్ అన్నమాట!

అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ .. సినిమా అంటే ఇదే. సినిమా లెక్కలు ఇవే.

అందుకే .. సినిమా ఒక జూదం కూడా. ఒక పెద్ద క్రియేటివ్ గ్యాంబ్లింగ్.

ఈ ప్రాక్టికల్ నిజాన్ని పక్కనపెట్టి, ఆయా సినిమాలని తీయడంలో వాళ్లు పడ్ద శ్రమని, వాళ్లు అనుభవించిన కష్టనష్టాలనీ, ఆ సినిమాల నిర్మాణ నేపథ్యాన్నీ కనీసం ఆలోచించకుండా .. ఎవరెవరో సినిమాల గురించి ఏదేదో రాస్తారు. కొందరు ఉచిత సలహాలనిస్తారు.

వాళ్లు క్రిటిక్స్. మేధావులు. అది వారి ప్రొఫెషన్. వారి హాబీ. ఆ విషయం అలా వదిలేద్దాం.    

కట్ టూ బిజినెస్ -

ఎవరు ఎన్ని చెప్పినా ఇదే నిజం. సినిమా ప్యూర్‌లీ ఒక పెద్ద బిజినెస్. క్రియేటివ్ బిజినెస్.

"నాకసలు డబ్బు అక్కర్లేదు. మంచి సినిమా తీసిన పేరు, సంతృప్తి చాలు!" అని చెప్పగలవాళ్లు నిజంగా ఎంతమందున్నారు? ఎంతమంది అంత సింపుల్‌గా, అంత భారీ రేంజ్‌లో డబ్బులు కోల్పోడానికి ఇష్టపడతారు?

ఒకవేళ ఎవరయినా అలా చెప్పి, డబ్బులు అసలే వచ్చే అవకాశంలేని ఒక అద్భుతమయిన ఆర్ట్ సినిమా తీసినా .. అందులో కూడా పెద్ద బిజినెస్ ఉంది.

తన పేరు, సంతృప్తికోసం సినిమా తీస్తున్నాడు. ఈ కాన్సెప్ట్ కూడా నథింగ్ బట్ బిజినెస్!

సో, కమర్షియల్ సినిమాలు తీసినా, ఆర్ట్ సినిమాలు తీసినా .. ఎవరికయినా ముందు కావల్సింది సినిమా మీద ప్యాషన్.

ఆ ప్యాషన్‌తోనే ఇప్పుడు మొట్టమొదటిసారిగా పూర్తిస్థాయిలో ఫీల్డులోకి దిగాన్నేను. అది కూడా  కొంతకాలమే కావొచ్చు. నా ఇష్టం.

ఫాక్టరీకి పునాదులు పడుతున్నాయి.

నా ఫాక్టరీ నుంచి అన్నీ మైక్రో బడ్జెట్ సినిమాలే వస్తాయి. పూర్తి క్రియేటివ్ ఫ్రీడమ్‌తో, మైక్రో బడ్జెట్లో, మంచి క్వాలిటీతో, తక్కువ రోజుల్లో ఎక్కువ సినిమాలు తీయడం కోసమే ఈ ఫాక్టరీ.

సినిమా నిర్మాణంలో ఆధునికంగా వచ్చిన డిజిటల్ టెక్నాలజీ వల్ల బడ్జెట్‌లు చాలా తగ్గాయి. చిన్న స్థాయిలో, కొత్తవాళ్లతో సినిమాలు చేయాలనుకొనేవాళ్లకు బిజినెస్ పాయింటాఫ్ వ్యూలో ఇదొక మంచి ప్రాఫిటబుల్ అండ్ పాజిటివ్ మలుపు.

అయితే - దీన్ని ఎంతవరకు పాజిటివ్‌గా ఉపయోగించుకొని, ఏ రేంజ్‌లో సక్సెస్ సాధించగలమనేదే మిలియన్ డాలర్ కొశ్చన్. ఎన్ని ఆడ్డంకులు వచ్చినా, అన్నీ మనకు అనుకూలం చేసుకొని ముందుకు సాగిపోగల సత్తా కూడా మనలో ఉండాలి.

ఎందుకంటే - ముందే చెప్పినట్టు .. సినిమా ఒక స్పెక్యులేషన్. ఒక జూదం.

అయినా - భారీ స్థాయిలో డబ్బూ, ఊహించని రేంజ్ వ్యక్తులతో సంబంధాలూ, ఓవర్‌నైట్‌లో ఫేమ్ .. ఇవన్నీ ఇక్కడే సాధ్యం.

దటీజ్ సినిమా.

ఒక బిగ్ బిజినెస్.