Monday 30 March 2015

ఒక ఆలోచన .. ఒక ఆఫర్!

కిక్‌స్టార్టర్, ఇండీగోగో అనేవి ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందిన యు ఎస్ బేస్‌డ్ "క్రౌడ్ ఫండింగ్" వెబ్‌సైట్‌లు.

అయితే -

ఒక సినిమా నిర్మాణం కోసమో, మరేదయినా ప్రాజెక్టు కోసమో - ఒక్కో డాలర్ అయినా సరే, 'ఫండింగ్' చేసేవాళ్లని అసలు "Crowd" అని ఎలా అనగలుగుతాం? ఆ పధ్ధతిన వాళ్ళిచ్చే డబ్బంతా "Crowd Funding" ఎలా అవుతుంది?


నిజానికి - ఎంతో ప్యాషన్‌తో ఫండింగ్ చేసే ఈ పధ్ధతిని చాలా గౌరవంగా "Proud Funding" అనాలి.

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా, ఈ క్రౌడ్ ఫండింగ్ పధ్ధతి అమెరికాలోనూ, ఇంకెన్నో పాశ్చాత్య దేశాల్లో యమ సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఒక్క మన దేశంలో తప్ప.

కిక్‌స్టార్టర్, ఇండీగోగో వంటి సైట్స్ మన దేశంలోనూ ఒకటి రెండు వచ్చినా అంతగా ప్రాచుర్యం పొందలేదు. కారణాలు రెండు: ఒకటి రిజర్వ్ బ్యాంక్ రూల్స్. రెండు: 'మిస్ యూజ్ చేయడం' అనబడే మన వాళ్ల సర్వసహజమైన కాపీరైట్ హక్కు!

ఉదాహరణకు, మనవాళ్లు సినిమాల "శాటిలైట్ రైట్స్" ను ఎంత రేంజ్‌లో మిస్ యూజ్ చేయాలో అంతా చేశారు. చివరికిప్పుడు అసలు శాటిలైట్ రైట్స్ అనేవే లేకుండా పోయాయి!

కట్ టూ మన టాపిక్ - 

ఈ క్రౌడ్ ఫండింగ్ పధ్ధతినే, ఒక చిన్న బాధ్యతాయుతమయిన ట్విస్ట్‌తో, మన దగ్గర కూడా సక్సెస్ చేయవచ్చునేమోనని నాకనిపించింది. అలా అనిపించిన నా అలోచననలనే ఒక ఆఫర్‌గా అతిత్వరలో మీ ముందుకి ఓ చిన్న బ్లాగ్ రూపంలో తెస్తున్నాను.

అదే -

మైక్రో బడ్జెట్ ఫిలిం ఫండింగ్!

సింపుల్‌గా MBFF.

ముందే చెప్పినట్టు - ఇదొక ఆలోచన. సినీ ఫీల్డు పట్ల ప్యాషన్, చిన్న స్థాయిలోనయినా సినిమాల్లో ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచన ఉన్నవారికి ఒక ఆఫర్. మొత్తం సినిమా బిజినెస్‌ను ప్రత్యక్షంగా స్టడీ చేయడానికి ఇదొక అవకాశం కూడా.

'అదేంటి .. ఎలా' అన్నది అతిత్వరలో, ఇక్కడే, ఇదే బ్లాగ్‌లో ..  

Thursday 26 March 2015

"స్విమ్మింగ్‌పూల్" .. బిజినెస్ టైమ్!

తెలుగు 'హాట్ రొమాంటిక్ హారర్' సినిమా స్విమ్మింగ్‌పూల్ ఫైనల్ మిక్స్ ఇవాళ మధ్యాహ్నంతో ర్తయింది. రెండ్రోజుల్లో కాపీ వస్తుంది. మరో వారంలో సెన్సార్ అయిపోతుంది. తర్వాత ఆడియో రిలీజ్, ఆ తర్వాత ఫిలిం రిలీజ్.  

ఇంకిప్పుడు, ఇది బిజినెస్ టైమ్!

బిజినెస్ పార్ట్‌నర్స్, కోఆర్డినేటర్స్, బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్, శాటిలైట్ రైట్స్ థర్డ్ పార్టీ మీడియేటర్స్ .. ఇదంతా మామూలే. ఈ పనులకోసం ఎవరయినా, ఎప్పుడయినా నన్ను గానీ, ప్రొడ్యూసర్‌ను గానీ కలవ్వొచ్చు.

సెన్సార్ అయిపోయి, ఆడియో రిలీజ్ అయిందంటే మా సినిమా నిజంగా హాట్ కేకే!

శుభవార్త ఏంటంటే - మా స్విమ్మింగ్‌పూల్ సినిమా ఓవర్సీస్ బిజినెస్ సుమారు 5 దేశాల్లో ఇప్పటికే అయిపోయింది. యు ఎస్ తో సహా.

సో, ఈ విషయంలో మాకేం భయం లేదు. అవసరమయితే మేమే రిలీజ్ కూడా చేసుకోగలం.

దయచేసి ఉత్తుత్తి రొటీన్ "గప్పాల మాస్టర్‌"లు మాత్రం మాకొద్దు. "మేం ఇది పొడుస్తాం .. మేం అది పొడుస్తాం" అని పచ్చి అబధ్ధాలు చెప్పే పాతరాతి యుగపు టైమ్‌పాస్ మేధావులు దయచేసి మమ్మల్ని వదిలేయండి.

సత్తా ఉందా.. పని చేసి చూపించండి. రాజాల్లాగా రాయాల్టీ/కమిషన్ తీసుకోండి.

మేం చూస్తున్నది .. కేవలం సిన్సియర్‌గా మా కోసం, మా సినిమా కోసం .. పనిచేసిపెట్టగల, గట్స్ ఉన్న, సమర్థవంతమయిన బిజినెస్ పార్ట్‌నర్స్, కోఅర్డినేటర్స్, మీడియేటర్స్ కోసం.

అలాంటి జెంటిల్‌మెన్‌కి హృదయపూర్వక స్వాగతం.

కట్ టూ స్పాన్సర్స్, ఈవెంట్ మేనేజర్స్ - 

ఇదే అసలు విషయం. ఇప్పటికిప్పుడు మాకు అవసరమయిన విషయం.

స్విమ్మింగ్‌పూల్ ప్రమోషన్ లోని వివిధ దశల్లో పోస్టర్స్, హోర్డింగ్స్, ఆడియో ప్రోగ్రాం లైవ్, టీవీ ఫిలిం బేస్‌డ్ ప్రమోషన్ ప్రోగ్రామ్‌స్, యూనిట్ టూర్స్ వగైరా స్పాన్సర్ చేయించగల సమర్థవంతమయిన ఏజెంట్స్‌కీ, ఈవెంట్ మేనేజర్‌లకూ ఇదే మా ఆహ్వానం.

ట్రెడిషనల్ ముసుగులో గుద్దులాట ఏంలేదు.

మాకేం చేస్తారు బిజినెస్?
మీరేం తీసుకుంటారు కమిషన్?
ఎంత త్వరగా?
అదీ పాయింట్ ..

మీరు మాకు చేసిపెట్టే ప్రతి చిన్న, పెద్ద పనికీ ఆకర్షణీయమయిన రాయాల్టీ/కమిషన్ ఉంటుంది.

ఆన్ ది స్పాట్!

***

మీ మొబైల్ నంబర్ ఈమెయిల్ చేయండి:
manutimemedia@gmail.com

Monday 23 March 2015

ఎవరీ హంస?

నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్‌లో లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్ చదివినప్పటి జ్ఞాపకం ఈ హంస.

మా క్లాస్‌లో సుమారు ఓ డజన్ మంది అమ్మాయిలుండేవాళ్లు. ఆ డజన్ మంది గాళ్ స్టుడెంట్స్‌లో కనీసం ఓ నలుగురో, అయిదుగురో ఆంటీలు కూడా ఉండేవాళ్లు. వారిలో కొందరు పెళ్లయి పిల్లలున్నవాళ్లు. కొందరు అప్పటికే మంచి ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు.

ఆ నలుగురయిదుగురు ఆంటీలను నేనెప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు... గమనించలేదు. నా క్లాస్‌మేట్స్ కొందరు మాత్రం ప్రత్యేకంగా వాళ్లకే లైనేసేవాళ్లు.. అది వేరే విషయం.

ఒకరోజు - "అబ్స్‌ట్రాక్టింగ్ అండ్ ఇండెక్సింగ్" సబ్జెక్టును అద్భుతంగా చెప్పే మా వేణుగోపాల్ సర్ క్లాస్‌కి ఒక ఆంటీ చాలా లేట్‌గా వచ్చింది. వచ్చి అలా గమ్మున కూర్చోకుండా, పక్కనున్న స్టుడెంట్‌తో ఏ టాపిక్ చెప్తున్నారు... వగైరా ఎంక్వయిరీ చేయసాగింది గుసగుసగా.

అసలే డిస్టర్బ్ అయిన వేణుగోపాల్ సర్ ఆమెను చడమడా తిట్టేశారు. బోరున ఏడ్చేసింది మా క్లాస్‌మేట్.

అలా నా దృష్టిలో మొదటిసారిపడిన అప్పటి నా క్లాస్‌మేట్ పేరు హంస.

ఆ తర్వాత మా మధ్య జరిగిన కొన్ని సంభాషణల్లో బయటపడ్డ విషయమేంటంటే, అప్పటికి సుమారు పదేళ్లక్రితం తను "మాభూమి" సినిమాలో నటించింది. లంబాడి చంద్రి పాత్రలో...

ఒక్కసారిగా షాక్!

ముందు నమ్మలేకపోయాను. కానీ తర్వాత జాగ్రత్తగా గమనించాను. నిజమే, పోలికలు అవే. కానీ, ఈ పదేళ్లలో కొంచెం లావెక్కింది హంస.

పాలరాతి బొమ్మలా గుండ్రంగా ఉండే ఆ హంసకు తెలుగు రాదు. మరాఠీ అమ్మాయి అని తర్వాత తెలిసింది. నోట్స్ కోసమో, ఇంకేదయినా మాట్లాడ్డం కోసమో హంస నా వైపు వస్తున్నపుడల్లా తప్పించుకొనే ప్రయత్నం చాలా చేసేవాణ్ణి. 

కట్ టూ నా ఇంగ్లిష్  - 

హంస నోరు తెరిస్తే ఇంగ్లిష్. ఆమె రేంజ్‌లో ఇంగ్లిష్‌లో మాట్లాడ్డానికి నాకు భయం. కొద్దిరోజుల తర్వాత నాలో ఉన్న ఆ భయాన్ని తనే ఎగరగొట్టేసిందనుకోండి... తెగ మాట్లాడీ, మాట్లాడీ.

లైబ్రరీకి ప్రాక్టికల్స్ కోసం వస్తున్నానని చెప్పి నేను వెళ్లకపోవడమో, తనకు ఏదయినా నోట్స్ ఇస్తానని చెప్పి టైమ్‌కు నేను ఇవ్వకపోవడమో మా మధ్య చాలా కామన్‌గా జరిగేది. అలా మిస్ కావడానికి కారణం అప్పటి నా హాస్టల్ లైఫ్. లేదా, నా రష్యన్ డిప్లొమాలోని అమ్మాయిలతో క్యాంపస్‌లోని చెట్లక్రింది క్యాంటీన్ దగ్గర ఎడతెగని కబుర్లు.

ఇలాంటి ఒక సందర్భంలోనే... అప్పటికి నాకు తెలియని, నేను అప్పటివరకూ వాడని ఒక ఇంగ్లిష్ వర్డ్‌ను హంస నోటివెంట విన్నాను. ఆ మాట ఇప్పుడెప్పుడయినా నేనే వాడినా, ఇంకెవరి నోటనయినా విన్నా... నాకు అప్పటి నా క్లాస్‌మేట్ హంసనే గుర్తుకొస్తుంది.

"Hey, don't ditch me!"

తనొక్కతే ఉన్నప్పుడు... ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టుగా ఉండే అప్పటి నా క్లాస్‌మేట్ హంస ఇప్పుడు ఎక్కడుందో నాకు తెలియదు. సోషల్ మీడియాలో కూడా ఎక్కడా కనిపించలేదు. 

ఎవరికయినా తెలిస్తే చెప్పండి. దాదాపు పాతికేళ్లయింది. కనీసం ఒక "హాయ్" చెప్తాను.             

Sunday 22 March 2015

"మాభూమి" ఒక్కటే .. ఒక్కసారే!

"చరిత్రలో తెలంగాణ సాయుధపోరాటం ఒక్కసారే జరిగింది. అలాగే మాభూమి సినిమా నిర్మాణం కూడా!" - బి. నరసింగరావు

కొంతమంది అదృష్టవంతులుంటారు.

అంటే - ఏ గుళ్లూ గోపురాల మొక్కులతోనో, ఇంకేదో కనిపించని శక్తివల్లనో వీళ్లకు అదృష్టం వరిస్తుందని కాదు. ఉన్నవీ, లేనివీ అన్ని శక్తుల్నీ తమవైపు బైపాస్ చేయించుకొని, అందరూ చెప్పే ఆ అదృష్టాన్ని తమ దగ్గరికే రప్పించుకొంటారు వీళ్లు.

దీన్నే ఒకే ఒక్క ముక్కలో "కమిట్‌మెంట్" అనొచ్చుననుకుంటాను.

ఆ కమిట్‌మెంట్ ముందు 'వాళ్లేమనుకుంటారో వీళ్లేమనుకుంటారో' అనే పనికిరాని ఊగిసలాటలు .. ఇల్లు, జాగా, డబ్బు, దస్కం .. ఏమీ నిలవవు. అష్టకష్టాలు పడ్డా సరే అనుకున్న పని అనుకున్నట్టు చేస్తారు ఈ అదృష్టవంతులు.

అలాంటి అదృష్టవంతుల్లో ఒకర్ని ఇవాళ గుర్తుకుతెచ్చుకోవడం చాలా అవసరమనిపిస్తోంది.

ఆ క్రియేటివ్ సోల్ పేరు - బి. నరసింగరావు.

1977లో తను 'ఏదో ఒకటి కొత్తగా చేయాలి' అనుకోకపోతే - ఆ తర్వాత మూడేళ్లకు, 1980 ఇదే మార్చి 23 నాడు, సరిగ్గా 35 ఏళ్ల క్రితం .. "మాభూమి" వచ్చేదే కాదు.

బి. నరసింగరావు ఆల్వాల్ సిండికేట్ బ్యాంక్‌లో ఇల్లు తాకట్టు పెట్టి లక్ష అప్పు తెస్తే, ఇంకో ప్రొడ్యూసర్ రవీంద్రనాథ్ ఏళ్లతరబడిగా దాచుకొన్న వాళ్ల వెడ్డింగ్ రింగ్స్ కూడా అమ్మేసి, వచ్చిన 700 రూపాయలతో మాభూమి సినిమా సెన్సార్ చేయించాడు!

అదీ .. అప్పట్లో వారు చేస్తున్న ఆ పని పట్ల .. ఆ సబ్జెక్ట్ పట్ల .. ప్రేమ, ప్యాషన్, నమ్మకం.

అదొక రెనగేడ్ కమిట్‌మెంట్!

మాభూమి సినిమా 1980లో వచ్చినపుడు నేను నిజంగా ఒక 'బచ్చా'ని. ఆ సినిమాను మొదటిసారి వరంగల్‌లోని కాకతీయ టాకీస్‌లో మార్నింగ్‌షో చూశాను. ఇప్పటికీ మర్చిపోలేని అనుభూతి అది.

ఒక ట్రాన్స్‌లోకి వెళ్లిపోయాను.

గౌతమ్ ఘోష్ దర్శకత్వంలో బి.నరసింగరావు రూపొందించిన ఆ కలాఖండం గురించి, దాని మేకింగ్ గురించీ ఓ పెద్ద పుస్తకమే రాయొచ్చు.

లారీ వెనక భాగంలో టార్పాలిన్ పట్టా మీద కూర్చొని, టీమ్ అంతా రోజూ షూటింగ్‌కు వెళ్లేదని విన్నాను. మీరూ వినే ఉంటారు బహుశా.

బండెనక బండికట్టే ఒక గద్దర్ పాట, పల్లెటూరి పిల్లగాడా అనే ఆర్ద్రమైన సంధ్య గొంతు, సాయిచంద్, శకుంతల, హంస .. చాలామంది నాకింకా గుర్తున్నారు.

బి. నరసింగరావు, గౌతమ్ ఘోష్‌లతో కలిసి .. మాభూమి చిత్రం కోసం చైతన్య చిత్ర ఇంటర్నేషనల్‌కు పనిచేసిన ఆ టీమ్ మొత్తానికి నా హాట్సాఫ్ .. సెల్యూట్ .. అన్నీ!

కట్ టూ తెలంగాణ ఉద్యమం --

ఎన్నోసార్లు పడుతూ లేస్తూ, నివురుగప్పిన నిప్పులా ఉన్న తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసి నింగినంటేలా  చేసిందీ, ఉద్యమ లక్ష్యం సాధించిందీ కూడా ఒక్కడే.

కె సి ఆర్.

బి. నరసింగరావుది సినిమా అయితే, కె సి ఆర్ ది జీవితం.

ఇద్దరినీ నడిపించింది ఒక్కటే.

సిన్సియర్ కమిట్‌మెంట్.

జయహో తెలంగాణ!  

Saturday 21 March 2015

మన్మథ నామ సంవత్సరం మనదే!

సందేహం లేదు. ఈ మన్మథ నామ సంవత్సరంలో సినిమా ఫీల్డులో నేను అనుకున్న చిన్న చిన్న లక్ష్యాలన్నీ ఛేదిస్తాను.. చేరుకుంటాను.

కొద్దిరోజుల్లోనే, చాలా గ్యాప్ తర్వాత నేను చేస్తున్న సినిమా "స్విమ్మింగ్‌పూల్" ఫస్ట్ కాపీ రాబోతోంది. ఆ తర్వాత ఆ సినిమా ఆడియో రిలీజ్, రిలీజ్ ఉంటాయి.

ఇప్పటికే ఆదిత్య ద్వారా యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన స్విమ్మింగ్‌పూల్ ప్రమోషనల్ సాంగ్‌కు ఆన్‌లైన్‌లో ఆదరణ అదిరిపోతోంది. కేవలం 5 రోజుల్లోనే ఆ వీడియో 20 వేలను దాటింది అంటే విషయం అర్థంచేసుకోవచ్చు.  

మొదటిసారిగా ఒక చిన్న బడ్జెట్ సినిమా స్విమ్మింగ్‌పూల్ .. అమెరికాలోని అన్ని ప్రధాన సెంటర్‌లలో ఒక భారీ సినిమా రేంజ్‌లో రిలీజ్ కాబోతోంది. ఆ ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఇంకా యు కె, జర్మనీ, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ అవుతోంది.

ఈ వివరాలన్నీ అతి త్వరలో ఎప్పటికప్పుడు మీరు నా ఫేస్‌బుక్ లోనూ, ఇదే బ్లాగ్ లోనూ చూస్తారు.

కట్ టూ హీరో అండ్ హీరోయిన్ - 

ఈ సంవత్సరం కార్తీక్ తప్పక ఒక రేంజ్ కు చేరుకుంటాడు. ఎప్పటినుంచో అతనితో దాగుడుమూతలు ఆడుతున్న హిట్ ఇప్పుడు అతన్ని అక్కున చేర్చుకోబోతోంది.

ఇక, మా హాట్ హీరోయిన్ ప్రియ వశిష్ట స్విమ్మింగ్‌పూల్ తర్వాత కనీసం ఒక 3 సినిమాలు సైన్ చేస్తుంది .. 6 దేశాలు తిరుగుతుంది.

ఇది జోస్యం కాదు. వారు పడ్డ కష్టం, దాని ఫలితం.

వీరితోపాటు నా టీమ్‌లో, నాతో పాటు నిజంగా కష్టపడ్డ అందరికీ .. ఈ సంవత్సరం, ఆ తర్వాత కూడా .. అన్నివిధాలుగా బాగుంటుందనీ, ఉండాలనీ మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

కట్ టూ ఫినిషింగ్ టచ్ -   

నేను ఈ చిత్రం ద్వారా పరిచయం చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్రకు అప్పుడే 3 సినిమాలు వచ్చాయి. పిచ్చి బిజీ అయిఫొయాడు.

ప్రదీప్, యూ రాక్!

"నాకు తెలిసి ఆయనకు అసలు మ్యూజిక్ రాదు!" అనీ, ఇంకా ఏదేదో చెత్త అంతా ఎవరెవరో వాగుతుంటారు. అవన్నీ పట్టించుకోవద్దు. ఒక లక్ష్యం కోసం నిజంగా కష్టపడేవారెప్పుడూ, తోటివారిని అలా సరదాకి కూడా అనలేరు. వాళ్లంతా అలా అంటూ అక్కడే ఉంటారు. మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్లడమే ..   

Tuesday 17 March 2015

40 నిమిషాల్లో ప్రోమో సాంగ్!


"సర్, లిప్సిక మధ్యహ్నం 2 గంటలకి రికార్డింగ్‌కి వస్తోంది" అని ప్రదీప్ కాల్ చేసి చెప్పాడు.

ఎక్కువ ఆలోచించే టైమ్ లేదు. ప్లాన్ చేసే టైమ్ అసలు లేదు. అప్పటికి జస్ట్ ఓ 2 గంటల టైమ్ ఉంది.

వెంటనే కార్తీక్ కి ఫోన్ చేశాను. షార్ట్‌కట్‌లో విషయం చెప్పాను. పాట రికార్డింగ్ మాత్రం ఉంది. నువ్వు రావాల్సిన అవసరం లేదు. కానీ, ఆ టైమ్‌లో కొంత వీడియో షూట్ చెయ్యాలనుకుంటున్నాను. నువ్వుంటే బావుంటుంది.. అని చెప్పాను.

ఇంకో విషయం కూడా చెప్పాను. షూట్ ఉండకపోవచ్చు కూడా. "ఒకవేళ అలాగానీ జరిగితే ఏమనుకోవద్దు" అన్నాను. స్టూడియో అడ్రస్, టైమ్ చెప్పాను.  

"నో ప్రాబ్లమ్ సర్. మనం కాసేపు కల్సి 'డిస్కస్' చేసినట్టు కూడా ఉంటుంది కదా. నేను వస్తున్నాను!" అన్నాడు కార్తీక్.

కట్ టూ హీరోయిన్ - 

ప్రియ పప్పా వశిష్ట గారికి ఫోన్ చేసేటప్పటికి ఆయన ఆ టైమ్‌లో విజయవాడలో ఉన్న విషయం తెలిసింది. ఆయన లేకుండా ప్రియ రావడం కుదరదు.

మఠాష్ అనుకున్నాను.

అయినా, విషయం చెప్పాను. ఓ అరగంట ప్రియ రావాలి. స్టూడియోలో చిన్న షూట్ ఉంది అని చెప్పాను.

ఆయన బిజినెస్‌మాన్. ఆ ఆలోచనా విధానం పూర్తిగా వేరు. నేను చేయాలనుకుంటున్న షూట్ ఇంపార్టెన్స్ ఆయన గ్రహించాడు. ఒక్కటే మాట చెప్పారాయన.

"నేను ప్రియకు ఫోన్ చేసి చెప్తాను. తనిప్పుడు ఎక్కడుంది.. ఏం చేస్తోంది.. అదంతా మాట్లాడే టైమ్ లేదు. ప్రియకు ఫోన్ చేసి, తనను రప్పించుకొని షూట్ పూర్తిచేసుకోండి. తర్వాత మళ్లీ తనని ఇంటిదగ్గర డ్రాప్ చేసే బాధ్యత మీదే. క్యారీ ఆన్!" అని చెప్పేసి ఫోన్ పెట్టేశారు ప్రియ పప్పా.  

ప్రదీప్ నాకు ఫోన్ చేసి అప్పటికే అరగంట అయిపోయింది. ఇంకో గంటన్నరలో రికార్డింగ్!

ప్రియకు ఫోన్ చేశాను. ఎక్కడో మెహదీపట్నంలో ఏదో ముఖ్యమైన పనిలో ఉంది. విషయం చెప్పి ఆడ్రెస్ చెప్పాను.

"నేను వెంటనే వస్తాను సర్. కానీ మా కార్ రావడానికి టైమ్ పడుతుంది. ఎలా?" అంది ప్రియ.

నేను కారు పంపి, తను అంత దూరం నుంచి వచ్చేటప్పటికి ఈ ట్రాఫిక్‌లో ఇంక సాధ్యం కాదు అనిపించింది. ఐడియా డ్రాప్ అనుకున్నాను. కానీ .. ఏమైనా సరే చెయ్యాలి అనుకున్నాను.

"ప్రియా! నువ్వు కారు, క్యాబ్ అని అలోచించే టైమ్ లేదు. డైరెక్ట్ ఆటో మాట్లాడుకొని సత్యం థియేటర్ దగ్గరికి వచ్చెయ్యి. అక్కడ నా కారుంటుంది. ఎక్కి స్టూడియోకి వచ్చెయ్యి!" అన్నాను.

ఆలోచించకుండా "స్టార్ట్ అవుతున్నాను, సర్!" అంది ప్రియ.

ఎంతయినా బిజినెస్‌మ్యాన్ కూతురు కదా .. స్పాట్ డెసిషన్!

కట్ టూ స్టూడియో -

పది నిమిషాలముందే సింగర్ లిప్సిక వచ్చింది. ప్రదీప్ తనతో కూర్చుని సాంగ్ కి ప్రిపేర్ చేస్తున్నాడు.

నేను సౌండ్ ఇంజినీర్ వేణు పక్కన కూర్చున్నాను. కార్తీక్ టైమ్‌కు వచ్చి అప్పటికే నా పక్కనే ఉన్నాడు. ప్రియ మాత్రం ఇంకా రాలేదు.

చూస్తుండగానే లిరిక్స్ తీసుకొని లిప్సిక లోపలికి వెళ్ళిపోయింది .. పాడటం కోసం. "స్టార్ట్ అవుతుంది ఇంక" అన్నట్టుగా ప్రదీప్ నావైపు చూశాడు.

"ఇంకా ప్రియ రాలేదేంటి!?" అన్నట్టుగా నన్ను సైగలతో అడిగాడు కార్తీక్.

అప్పుడే స్టూడియో డోర్ ఓపెన్ అయింది.

"హాయ్" అంటూ ప్రియ ఎంటర్ ..

టెన్షన్ రిలీఫ్ ..

కట్ టూ ది రెనెగేడ్ షూట్ -

అప్పటికే తన కెమెరాతో రెడీగా ఉన్న మా స్టిల్స్‌మ్యాన్ గంగాధర్ వీడియో తీయడం మొదలెట్టాడు.

సరిగ్గా 40 నిమిషాల్లో లిప్సిక పాడి వెళ్లిపోయింది. రికార్డింగ్ జరిగిన ఆ 40 నిమిషాల్లో .. స్టూడియోలో ఆవైపూ, ఈ వైపూ, నాకు కావల్సినన్ని షాట్స్ చక చకా తీసుకొని ప్యాకప్ చెప్పాను.

అలా  .. హీరో హీరోయిలకు ఎలాంటి మేకప్ లేకుండా, స్పెషల్ కాస్ట్యూమ్‌స్ లేకుండా, బులెట్ స్పీడ్‌లో తీసిందే మా "స్విమ్మింగ్‌పూల్" ప్రమోషనల్ సాంగ్. దాన్నే మా సినిమా ఆడియో రైట్స్ తీసుకొన్న 'నంబర్ వన్ ఆడియో కంపనీ' ఆదిత్య మ్యూజిక్ వాళ్లు మొన్నయూట్యూబ్‌లోకి ఎక్కించారు.

అదే ..

"డార్లింగ్  ఫీల్  మై  హార్ట్ .."   

Sunday 15 March 2015

ప్రమోషనల్ సాంగ్ ఐడియా ఎలా పుట్టింది?

ఒక పక్కా కమర్షియల్ రొమాంటిక్ హారర్ చిత్రంలో అయిదో, ఆరో పాటల్ని కావాలని ఇరికించడమంత ఫూలిష్ పని ఇంకోటి ఉండదు.

అయినా ..

తెలుగు ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకొని "స్విమ్మింగ్‌పూల్" సినిమా కోసం ఓ మూడు సాంగ్స్ రికార్డ్ చేశాం.

ఒకటి - ట్రెండీ యూత్ సాంగ్; రెండోది - డ్యూయెట్; మూడోది - మా ప్రొడ్యూసర్ అరుణ్ కుమార్ గారి కోరిక మేరకు మాంచి ఐటమ్ సాంగ్.

అన్నీ బాగా వచ్చాయి. అంతా ఓకే అనుకున్నాం. కానీ, కనీసం ఓ నాలుగు పాటలయినా లేకపోతే, ఆడియో కంపనీలు ఆడియో తీసుకొని రిలీజ్ చేయరుగాక చేయరని కొంతమంది "పాతకాపులు" అదే పనిగా ఊదరగొట్టారు.

ముందు ప్లాన్‌లో లేని నాలుగోపాట పుట్టడానికి ఇదో కారణం. కానీ, ఖచ్చితంగా ఇదొక్కటే మాత్రం కారణం కాదు. ఎందుకంటే - ఆ మధ్య ఒకే ఒక్క పాట ఉన్న "ఐతే" సినిమా ఆడియో కూడా రిలీజయింది. ఒక్క పాటతోనే! మరి .. దీనికేమంటారు మన పాతకాపులు?

అదలా వదిలేద్దాం.

కట్ టూ మన టాపిక్ - 

ఇందాకే చెప్పినట్టు - ఆడియో సీడీ కోసం నాలుగు పాటలు కావాలన్నది సెకండరీ రీజన్.

కానీ .. నాకు మాత్రం ఇంకోపాట కావాలనిపించింది. అది నాకోసం కాదు. సినిమా కోసం. ఆడియోకు ముందే సినిమాను వెరైటీగా ప్రజెంట్ చేయడం కోసం.

ఇంకా చెప్పాలంటే - "స్విమ్మింగ్ పూల్" పైన అందరి దృష్టీ పడేలా చేయడం కోసం!

డిసైడ్ అయిపోయాను.

టీమ్‌లోని ఒకరిద్దరితో నా ఈ అలోచన గురించి చెప్పాను. కానీ ఎవరికీ అంత వివరంగా ఏమీ చెప్పలేదు.

ఒకరోజు ఉన్నట్టుండి వెండితెరకు తొలిసారిగా నేను పరిచయం చేస్తున్న మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌కు కాల్ చేశాను. "మనం నాలుగోపాట రికార్డ్ చేస్తున్నాం" అన్నాను.

ఎందుకు, ఏమిటి, ఎలాంటిది, బడ్జెట్ ఎంత, డబ్బులున్నాయా .. అని ఒక్క ప్రశ్న కూడా అడక్కుండా "డన్, సర్" అన్నాడు.

"పాట ఇంగ్లిష్‌లో ఉంటుంది" అన్నాను.

మరింత ఉత్సాహంగా "మీరెప్పుడంటే అప్పుడే!" అన్నాడు ప్రదీప్.

తొందరపడి ట్యూనేం కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పాన్నేను ప్రదీప్‌తో.

కట్ చేస్తే -  

ఓ వారం తర్వాత, ఆల్రెడీ రికార్డ్ చేసిన మా మూడు పాటల్లోని ఒక పాట ట్యూన్ ని నేనడగ్గానే - పియానో మీద అద్భుతంగా వాయించి ఇచ్చాడు ప్రదీప్.

అదే నాకు సపోర్ట్. దాన్ని వింటూ ఓ రోజు అర్థరాత్రి దాటాక ఓ రెండుగంటలపాటు కూర్చుని పాటని రాశాను.

తర్వాత ఓ నేటివ్ అమెరికన్ ఫ్రెండ్‌తో ఆ ట్యూన్‌కి ట్రాక్ పాడించి తెప్పించుకున్నాను. విన్నాను.

నేను అనుకున్నట్టే .. పాట బావుంది.

వెంటనే ఆ ట్రాక్, నా ఇంగ్లిష్ లిరిక్స్ ఫైల్స్ ప్రదీప్‌కి ఈమెయిల్ చేశాను. "ఇక్కడ నీకు నచ్చిన సింగర్‌తో పాడించు. నేను అనుకున్నట్టు రాకపోతే .. యు ఎస్ లోనే ఒక నేటివ్ సింగర్‌తో పాడించడానికి ఏర్పాటు చేసేశాను. డోంట్ వర్రీ!" అని చెప్పేశాను.

కట్ టూ లిప్సిక -  

వెరీ ఫేసినేటింగ్ నేమ్! పేరొక్కటే కాదు. తన వాయిస్ కూడా.

ప్రదీప్ సెలెక్షన్ కరెక్ట్. లిప్సిక నేను ఊహించినదానికంటే చాలా బాగా పాడింది.

సో.. అలా క్రియేట్ అయ్యిందే ఈ ప్రమోషనల్ సాంగ్!

డార్లింగ్ ఫీల్ మై హార్ట్ .. 

అయితే - ఈ ప్రమోషనల్ సాంగ్ రికార్డింగ్ రోజు అక్కడికి హీరో అఖిల్ కార్తీక్‌ని ఎలా రప్పించాను, హీరోయిన్ ప్రియ వశిష్ట ఎలా వచ్చిందీ, ఒక ప్లానూ గీనూ ఏదీ లేకుండా అప్పటికప్పుడు ఎలా షూట్ చేశాం ..

అదంతా .. రేపు, ఇక్కడే, ఇదే బ్లాగ్‌లో !     

Thursday 12 March 2015

ఫాక్టరీలు ఎందుకు పెడతారు?

ఫిలిం మేకింగ్ టెక్నాలజీలో లేటెస్ట్‌గా ఎన్నో మార్పులు వచ్చాయి. అవన్నీ తెలియవు. పట్టించుకోరు.

ఇంకా ప్రిహిస్టారిక్ ఏజ్‌లోనే ఉంది మన ఇండస్ట్రీ.

ఎప్పుడో నెగెటివ్ ఉన్న పాతకాలంలో, ఒక చిన్న ప్రాసెస్ చెయ్యడానికి వారం రోజులు పట్టిందని, ఇప్పుడు కూడా అంతే టైమ్ తీసుకోవడం, అలాగే కొనసాగించడం ఎంత అవివేకం?

అప్పుడు వారం పట్టిన ఒక పని ఇప్పుడు కంప్యూటర్‌పైన కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో అయిపోతోంది. ఎన్ని సాఫ్ట్‌వేర్‌లు వచ్చాయి? ఎంత వేగంగా ఉంది మనిషి జీవితం ఇప్పుడు? ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారు?

ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్‌లోనూ ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఎన్నో కొత్త ట్రెండ్స్ గురించి వీళ్లింకా ఎప్పుడు తెలుసుకుంటారో?

"న్యూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ" అని వర్మ అన్నాడంటే ఇలాంటివి ఎన్నో చూశాకే అనుంటాడు.

ఆర్ జి వి 100% కరెక్ట్.

కట్ టూ సొల్యూషన్ - 

ఇకమీదట ఇండస్ట్రీ పాతవాసనలతో లింక్ ఉన్న ఎవరితోనూ కనెక్ట్ కావొద్దు. ఒక్క షూటింగే కాదు.. పోస్ట్ ప్రొడక్షన్‌ను కూడా ఇంకెంతో సింప్లిఫై చెయ్యాలి. అది అందరికీ తెలిసేలా చెయ్యాలి.

ఈ ప్రాసెస్‌లో కొత్తగా ఇంకెన్నో "ఫాక్టరీ"లు వస్తాయి. వాటిని మనస్పూర్తిగా ఆహ్వానించాలి.      

Saturday 7 March 2015

ఉర్సు టూ హారిస్‌బర్గ్‌!

ఒకరోజు పొద్దుటే యు ఎస్ నుంచి ఓ ఫోన్ కాలొచ్చింది. అప్పుడు యు ఎస్ లో ఏ అర్థరాత్రో దాటి ఉంటుంది. నేనెవరో తనకు తెల్సునన్నాడు అవతలనుంచి నాకు కాల్ చేసినతను. అనటమే కాదు. నాగురించి చాలా చెప్పాడు. తనెవరో కూడా చెప్పుకున్నాడు.

ఇద్దరం ఒకే ఊళ్లో పుట్టి పెరిగినవాళ్లం.

ఉర్సు, వరంగల్.

వరంగల్ నుంచి యు ఎస్ వెళ్లినవాళ్లు చాలామంది ఉన్నారు. కానీ, నాకు తెలిసినంతవరకు - మా వరంగల్ 17 వ వార్డులోని ఉర్సు నుంచి యు ఎస్ వెళ్లి అక్కడ మంచి పొజిషన్లో బాగా స్థిరపడింది మాత్రం నా ఈ మిత్రుడొక్కడే.

నేను నిజంగా గర్వంగా ఫీలయ్యాను ఆ క్షణం. మా ఉర్సు నుంచి కూడా ఒక మిత్రుడున్నాడు యు ఎస్ లో అని!

నాకంటే ఓ ఆరేడేళ్లు చిన్నవాడు నా మిత్రుడు. వాళ్ల బంధువర్గం, మా బంధువర్గం, అతను గుర్తుచేసిన మా కనెక్టింగ్ మిత్రులు.. అన్నీ ఓకే. అన్నీ నాకు తెలిసినవే. ఆయన గురించి మాత్రం నాకు చాలా తక్కువ తెలుసు.

కానీ తర్వాత్తరువాత తన గురించి నేనే స్వయంగా చాలా తెల్సుకున్నాను.

అసలు మా మధ్య ఈ గ్యాప్ కు కూడా ఒక కారణముంది. ఎప్పుడో 1985 లో నేను వరంగల్ నుంచి బయటపడ్డాను అంటే మళ్ళీ అట్నుంచి నాకు ఎలాంటి కనెక్షన్లు లేవు. ఎవరూ నన్ను గానీ, నేను ఎవర్ని గానీ గుర్తుపెట్టుకొనే అవకాశం లేదు.

సో, ఈ లెక్కన ఏ పాతికేళ్ల క్రితమో.. లేదంటే అంతకంటే ఇంకా ముందో.. నా మిత్రుడు నన్ను చూసుంటాడు.

ఓకే..

ఆ మొదటి ఫోన్ తర్వాత మా ఇద్దరి మధ్య ఫోన్‌లు, ఈమెయిల్స్ అలా కంటిన్యూ అయ్యాయి. ఇదంతా దాదాపు ఓ పదినెలలక్రితం ప్రారంభమయిన వ్యవహారం.

కర్టెసీ.. ఫేస్‌బుక్!

మళ్ళీ మార్క్ జకెర్‌బర్గ్‌కి థాంక్స్ చెప్పక తప్పదు.

కట్ చేస్తే -  

2012 జనవరి 4 నాడు నాకు జరిగిన ఓ భారీ యాక్సిడెంట్ గురించి విన్నాడు నా మిత్రుడు. ఇప్పుడు మళ్ళీ నేనెందుకు సినీఫీల్డులోకి రీ-ఎంటరవ్వాలనుకుంటున్నానో కూడా విన్నాడు.

యు ఎస్ నేపథ్యంలో - దాదాపు చాలా సహజంగా ఉండే పూర్తి మెటీరియలిస్టిక్ పరిధులు దాటి, తన విలువయిన సమయాన్ని వెచ్చించి మరీ స్నేహ హస్తం అందించాడు నా మిత్రుడు.

నా మిత్రుడు చేసిన సహాయంలో నేను బాగా విలువిచ్చేదీ, గుర్తించేదీ అవతలివారు నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ, దాన్ని నా మిత్రుడు చాలా ఇష్టంగా చేయగలిగాడు. చేసి, తనేంటో నిరూపించుకున్నాడు.

ఈ మొత్తం ఎపిసోడ్‌లో - నా స్విమ్మింగ్‌పూల్ సినిమా యు ఎస్ షూటింగ్ పార్ట్ కోసం, అన్‌కండిషనల్‌గా నా మిత్రుడు నాకు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను.

క్రియేటివిటీపరంగా మల్టీ టాలెంటెడ్ అయిన నా మిత్రుడు అక్కడ చేస్తున్న ఉద్యోగం వేరు. ఇక్కడ నేను చేస్తున్న ఈ రొమాంటిక్ హారర్ సినిమాకోసం ఆయన చేసిన సహాయం వేరు. అదే అతని గొప్పతనం.

తను చేయగలడని నాకు తెలుసు. చేసి చూపించాడు. "భేష్" అనిపించుకున్నాడు. ఇక్కడ పోస్ట్ ప్రొడక్షన్ సూట్స్‌లో కూడా దాదాపు అందరు టెక్నీషియన్సూ అదే మాట!

ఫినిచింగ్ టచ్ ఏంటంటే - మంచి న్యూస్‌కాస్టర్, వాయిసోవర్ ఆర్టిస్టు కూడా అయిన ఈ మిత్రుడితో స్విమ్మింగ్‌పూల్ లోని ఒక సీన్‌లో యాక్ట్ కూడా చేయించాను!

మైనస్ డిగ్రీల చలిలో కూడా ఎంతో కూల్‌గా, ఉత్సాహంగా నటించిన నా మిత్రుడి కమిట్‌మెంట్‌ని ఇక్కడ పోస్ట్‌ప్రొడక్షన్ మానిటర్స్‌లో చూసినప్పుడల్లా గర్విస్తుంటాను.

అతి త్వరలో యు ఎస్ లో కూడా దాదాపు అన్ని ముఖ్యమయిన సెంటర్లలోనూ విడుదలకాబోతున్న "స్విమ్మింగ్‌పూల్" సినిమా ద్వారా నా మిత్రుడు తొలిసారిగా వెండితెరపై కనిపించబోతున్నాడు. అది నా సంతోషం కోసం!

బహుశా ఈ 2015 లోనే, మేమిద్దరం మళ్లీ కల్సుకుంటామని నాకెందుకో బాగా అనిపిస్తోంది. దానికో ప్లానుంది. ఆ ప్లాన్ కూడా నా మిత్రుడిదే. ఆ ప్లాన్‌ని నిజం చేయగల సామర్థ్యం నాకుంది.

ఇది నిజం అవుతుందని నా నమ్మకం.

నా మిత్రునికి సమాజం సంపూర్ణంగా తెలుసు. క్రియేటివిటీ గురించీ తెలుసు. స్నేహం గురించీ తెలుసు.

కూల్ జెంటిల్‌మాన్.

ఇదంతా చెప్పి, నా మిత్రుడి పేరు చెప్పకుండా ఈ బ్లాగ్‌పోస్టుని ఎలా ముగిస్తాను?

సదానందం భారత.

థాంక్ యూ సదా!

ఫర్ ఎవ్విరిథింగ్ ..  

Friday 6 March 2015

బలమ్ పిచ్‌కారీ ..

హిందీ సినిమాల్లో వచ్చినన్ని హోలీ పాటలు తెలుగులో లేవు.

ఎక్కడో ఒకటీ అరా వచ్చినా, ఆ స్థాయిలో లేవు.

సిల్‌సిలాలో అమితాబ్ "రంగ్ బర్‌సే" తర్వాత, ఈ మధ్యకాలంలో నన్ను బాగా ప్రభావితం చేసిన హిందీ హోలీ పాట యే జవానీ హై దివానీ సినిమాలోని "బలమ్ పిచ్‌కారీ" పాట!

ఈ సినిమా దర్శకుడు ఆయన్ ముఖర్జీ చాలా యంగ్. ఈ సినిమా సబ్జెక్ట్ ఎన్నికే ఒక హైలైట్. ఆ సబ్జెక్టును నిర్మాతల చేత ఒప్పించి, తను అనుకున్న విధంగా తెరమీద ప్రెజెంట్ చేయడం అనేది ఆయన్ ముఖర్జీ విషయంలో ఓ గొప్ప అచీవ్‌మెంట్.

సినిమా చూడాలి. ఇలాంటి ట్రెండీ సినిమాలు తెలుగులో ఎందుకు రాలేకపోతున్నాయో అర్థం చేసుకోవాలి. పాతరాతి యుగం నాటి పధ్ధతిలో కాకుండా - చాలా వేగంగా, ఫిలిమ్‌మేకింగ్‌లో వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ, చాలా తక్కువ బడ్జెట్‌లో, ఇలాంటి మంచి ట్రెండీ సినిమాలు తీసే ఒక ఫాక్టరీని ప్రారంభించే ఆలోచనలో ఉన్నాను. స్విమ్మింగ్‌పూల్ కాపీ వచ్చాక ఆ పనులు కూడా ప్రారంభించవచ్చు. అదలా వదిలేద్దాం.

కట్ టూ మన స్విమ్మింగ్‌పూల్ - 

ఆయన్ ముఖర్జీ సినిమాలోని ఈ పాటను ఎంజాయ్ చెయ్యాలంటే, తప్పకుండా ఈ సినిమా చూసి ఉండాలి. దీపిక ఒక సమగ్ర నటిగా టాప్ రేంజ్‌కి ఎదిగింది ఈ సినిమాతోనేనని నేననుకుంటాను.

స్విమ్మింగ్‌పూల్ లోని ఒక సీన్లో - ఒక క్యారెక్టర్ టీవీ చూస్తున్నప్పుడు ఓ చానెల్లో ఈ పాట వస్తున్నట్టు ఓ చిన్న బిట్ చూపించాను. ఈ పాటంటే నాకు అంత ఇష్టం!

నా మిత్రులు, శ్రేయోభిలాషులు, నా స్విమ్మింగ్‌పూల్ టీమ్ .. అందరికీ హోలీ శుభాకాంక్షలు! 

Tuesday 3 March 2015

"స్విమ్మింగ్‌పూల్" ప్రమోషనల్ సాంగ్ అతి త్వరలో!

స్విమ్మింగ్‌పూల్ ఆడియోలో ఇక మొత్తం నాలుగు పాటలుంటాయన్నమాట. మూడు పాటలు ముందే రికార్డయ్యాయి. వారం క్రితం నాలుగో పాట కూడా హాట్ హాట్‌గా రికార్డ్ చేశాం.

అదే .. స్విమ్మింగ్‌పూల్ సినిమాకు ప్రమోషనల్ సాంగ్.

యాక్చువల్‌గా ఈ ఐడియా ముందు నుంచి ఉన్నది కాదు. నానా ట్రెడిషనల్ పధ్ధతులు ఇండస్ట్రీలో ఇంకా కొనసా..గుతూ ఉండటం వల్ల, పోస్ట్ ప్రొడక్షన్ పనులు నేను అనుకున్న స్పీడ్‌లో జరగటం లేదు. ఈ స్వల్ప ఆలస్యాన్ని కవర్ చేయడం కోసం అనే కాకుండా - బిజినెస్‌కూ, సినిమా సక్సెస్‌కు కూడా ఉపయోగపడుతుందన్న ఉద్దేశ్యంతో ఈ మధ్యే ఆ పాట గురించి అనుకున్నాను.      

నా ఈ కొత్త ఐడియాకు సూటయ్యే లిరిక్ రైటర్‌ను ఇప్పటికిప్పుడు వెదుక్కొని రాయించుకొనే టైమ్ లేక, పాటని నేనే రాశాను.

ఈ పాట పూర్తిగా ఇంగ్లిష్‌లో ఉంటుంది.

సోలో ఫిమేల్ వాయిస్. ప్లస్ .. మంచి మెలొడీ.

ఈ ప్రమోషనల్ సాంగ్ ట్రాక్‌ని యు ఎస్ లో ఉన్న ఒక నేటివ్ అమెరికన్ ఫ్రెండ్‌తో ముందు పాడించాను. తను ట్రాక్ బాగా పాడింది. ఇక్కడ రికార్డింగ్ ఒకవేళ నేను అనుకున్నట్టు రాకపోతే - నా ఫ్రెండ్ పాడిన ఆ ట్రాక్ సపోర్ట్‌తో, ఒక నేటివ్ అమెరికన్ సింగర్‌తోనే పాడించడానికి నిర్ణయించుకున్నాను కూడా.

మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్ర కూడా అందుకు ఓకే అన్నాడు.

కానీ ఆ అవసరం రాలేదు.

మన తెలుగు గాయని లిప్సిక చాలా బాగా పాడింది.

కట్ టూ యూట్యూబ్ - 

ఎలాగో ప్రమోషనల్ సాంగ్ రికార్డింగ్‌ని షూట్ చేశాం. షూట్‌కి అసలు హీరోయిన్ ప్రియ వశిష్ట వస్తుందా రాదా అన్న టెన్షన్ చివరి నిమిషం వరకూ ఉంది. కానీ, కొంచెం ఆలస్యంగానయినా స్టూడియోకు రీచ్ కాగలిగింది ప్రియ.

మొత్తానికి .. ఏ మాత్రం హడావిడి లేకుండా, చాలా సింపుల్‌గా, ప్రమోషనల్ సాంగ్ రికార్డింగ్‌ షూట్ ఒక్క నలభై నిమిషాల్లో పూర్తిచేశాం.

హీరో అఖిల్ కార్తీక్ సిన్సియర్ కోపరేషన్ గురించి ఎప్పుడూ చెప్పడం బాగుండదు. వెరీ కూల్ అండ్ పర్‌ఫెక్ట్. ఎప్పట్లాగే.

మళ్లీ పాయింట్‌కొస్తే -

ఈ ప్రమోషనల్ సాంగ్ వీడియోను ఎడిట్ చేశాక, ఈ వీకెండ్‌లోపే దీన్ని యూట్యూబ్‌కి ఎక్కించాలనుకుంటున్నాను.

కొంచెం ఎక్జయిటింగ్‌గా ఉంది నాకే. అయితే ఈ ఎగ్జయిట్‌మెంట్ నా గురించి కాదు. ప్రదీప్‌చంద్ర గురించి!

ఎందుకంటే - ప్రదీప్ ఫిజికల్ అపియరెన్స్‌ను చూసి ఆయన సంగీత జ్ఞానాన్ని,  ఆయన్ని సంగీత దర్శకుడిగా పరిచయం చేసిన నా నిర్ణయాన్నీ టోటల్ నెగెటివ్‌గా అంచనా వేసినవాళ్లు చాలా మంది ఉన్నారు.

ఈ జడ్జ్‌మెంట్ చేయడానికి వీళ్లేమీ శంకరాభరణం శంకరశాస్త్రులో, విశ్వనాథ్ గారి మరో సినిమాలో మమ్మూట్టిలో కారు. ఈ కామన్‌సెన్స్ (లెస్) కామెడీ ట్రాక్ గురించి మరోసారి మరో బ్లాగ్‌పోస్ట్‌లో రాస్తాను.  

ఫినిషింగ్ టచ్ ఏంటంటే - ఈ ప్రమోషనల్ సాంగ్‌కు వెర్షన్ 2 కూడా ఉంటుంది.

అదెలాఉంటుందన్నది ఇప్పటికి సస్పెన్స్!