Thursday 22 October 2015

కొత్త సినిమా గురూ!

చాలా ఏళ్ల క్రితం నేనో ఇంటర్వ్యూ చదివాను. అది తమ్మారెడ్డి భరద్వాజ గారిది. ఆ ఇంటర్వ్యూలో నేను చదివిన ఒక ఆసక్తికరమైన విషయం నాకిప్పటికీ గుర్తుంది.

"తెల్లవారితే సినిమా ఓపెనింగ్. జేబులో వంద కాగితం మాత్రమే ఉంది!"

నమ్ముతారా?

నమ్మితీరాలి.

ప్రొడ్యూసర్, డైరెక్టర్‌గా భరద్వాజ గారు సుమారు 30 సినిమాలు తీశారు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సార్లు ఎన్నో పదవుల్ని చేపట్టారు. ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలా యాక్టివ్‌గా ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఎవరో ఒకరికి ఏదో సహాయం చేస్తూనే ఉంటారు.

ఇంతకూ ఏమయింది? తెల్లవారిందా మరి??

తెల్లవారింది. అన్నీ వాటంతటవే సమకూరాయి. ఆ సినిమా ఓపెనింగ్ కూడా బ్రహ్మాండంగా జరిగింది.

సినిమా పేరు నాకు గుర్తులేదు. బహుశా అది హిట్ కూడా అయ్యే ఉంటుంది.

మరో ఇంటర్వ్యూలో సత్యజిత్ రే ఒక మాటన్నారు. దీన్ని నేను ఇప్పటికే ఫేస్‌బుక్‌లో ఓ మూడునాలుగు సార్లు కోట్ చేశాను.

మొన్నీమధ్యే లేటెస్టుగా దీన్ని కోట్ చేసినప్పుడు .. నా మిత్రురాలు, కె రాఘవేంద్రరావు గారి శిష్యురాలు, కాబోయే డైరెక్టర్ ప్రియదర్శిని ఓ పంచ్ లాంటి కామెంట్ పెట్టారు: "ఆ కొటేషన్ చదివేనండీ ఇక్కడకొచ్చి ఇలా ఇరుక్కుపోయాం!" అని.

ఇంతకూ సత్యజిత్ రే చెప్పింది ఏంటంటే - "సినిమా తీయాలన్న సంకల్పం ముఖ్యం. అదుంటే చాలు. అన్నీ అవే సమకూరతాయి!" అని.

భరద్వాజ గారి సంకల్పమే ఆరోజు వారి సినిమా ఓపెనింగ్ సాఫీగా జరిగేట్టు చేసిందన్నది నా వ్యక్తిగత నమ్మకం.

సినిమాకయినా, జీవితంలో ఇంక దేనికయినా .. అది చిన్న పనైనా, పెద్ద పనైనా .. సంకల్పం అనేది చాలా ముఖ్యం.

కట్ టూ నా కొత్త సినిమా - 

> నా తర్వాతి సినిమా పూర్తిగా కొత్తవాళ్లు/అప్‌కమింగ్ ఆర్టిస్టులతోనే తీస్తున్నాను.
> ఆడిషన్లు త్వరలోనే ఉంటాయి. ఆ వివరాలు నా టైమ్‌లైన్ మీద పోస్ట్ చేస్తాను. ఇతర ఎఫ్ బి గ్రూపుల్లో, ఫిలిం మేగజైన్స్‌లో కూడా దీనికి సంబంధించిన యాడ్ వస్తుంది.
> ఔత్సాహికులు ఆ యాడ్ ను ఫాలో కండి. ఆడిషన్స్ ఎప్పుడు, ఎక్కడ, నాకు చాన్స్ ఇవ్వండీ అంటూ ప్రతిరోజూ దయచేసి నాకు ఎలాంటి మెసేజ్‌లు పెట్టొద్దని మనవి.
> చీఫ్ టెక్నీషియన్లు చాలావరకు మొన్నటి నా "స్విమ్మింగ్‌పూల్" సినిమాకు పనిచేసినవాళ్లే ఉంటారు.
> నవంబర్ చివరివారంలో గోవా IFFI లో కనీసం ఓ నాలుగురోజులయినా ఎంజాయ్ చేసొచ్చాక - డిసెంబర్ రెండో వారం నుంచి షూటింగ్ ఉంటుంది.
> బ్యానర్ రిజిస్ట్రేషన్, టైటిల్ రిజిస్ట్రేషన్ పనులు పూర్తయ్యాక, ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలతో మళ్ళీకలుస్తాను. అప్పటిదాకా ట్విట్టర్‌లో మీతో టచ్‌లో ఉంటాను. నా ట్వీట్స్ ఫేస్‌బుక్‌లో కూడా ఆటొమాటిగ్గా మీకు కనిపిస్తాయి.

కట్ టూ సంకల్పం - 

అప్పుడప్పుడూ ఏదో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చినట్టుగా - నేనిప్పటివరకూ ఓ నాలుగు సినిమాలు చేశాను. ఇకనుంచి మాత్రం రెగ్యులర్‌గా సినిమాలు చేస్తాను. ఈ దిశలోనే ఇకమీదట అన్ని ఏర్పాట్లూ చకచకా జరిగిపోతుంటాయి.

నా ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం ఒక్కటే. లేటెస్ట్ డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ టెక్నాలజీ. అతి తక్కువ బడ్జెట్‌లో సినిమాలు చేయొచ్చు. ఊహించనంత వేగంగా కూడా సినిమాలు పూర్తిచేసి రిలీజ్ చేయొచ్చు.

ఇంతకుముందే ఒకసారి చెప్పినట్టుగా -  కనీసం ఓ రెండేళ్లపాటు ఇక సినిమాలే నా ప్రధాన ప్యాషన్, వృత్తి, వ్యాపకం, హాబీ, అవసరం .. అన్నీ కూడా.  

6 comments:

  1. చక్కటి నిర్ణయం! మీ లాంటి వారు ఈ లేటెస్ట్ టెక్నాలజీని అద్భుతంగా వాడుకోగలరు, బ్రహ్మాండమైన విజయాన్ని సాధిస్తారని నా ప్రగాఢ నమ్మకం!! Go ahead Manoharji !!!

    ReplyDelete
    Replies
    1. థాంక్ యూ వెరీ మచ్ రామ్‌కుమార్ జీ!

      Delete
  2. మనోహర్ గారూ... భరద్వాజ గారి ఆ సినిమా పేరు..ఊర్మిళ. మాలాశ్రీ తో చేశారు. ఆ సినిమా ముహూర్తం రోజు నైజాం డిస్ట్రిబ్యూటర్ గంగిరెడ్డి గారు అడ్వాన్సు ఇవ్వడంతో షూటింగ్ మొదలైంది.

    ReplyDelete
    Replies
    1. థాంక్ యూ ఫర్ ది ఇన్‌ఫర్మేషన్, చందు తులసి గారూ!

      Delete
  3. మనోహర్ గారూ...రెండే రెండు మాటలు చెబుతా...
    మీ పుస్తకం చదివాక....అది సినీ ఔత్సాహికులకు నిఘంటువు అనిపించింది. రైటర్లు, దర్శకులు, నిర్మాతలు అవుదామని ఆశించేవారికి కచ్చితంగా అదో కరదీపిక...
    మీనుంచి ఓ గొప్ప బ్లాక్ బ్లస్టర్ ఆశిస్తున్నాం.

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ ఫర్ యువర్ కామెంట్స్!
      > నేనూ అలానే ఒక బ్లాక్‌బస్టర్ ఇవ్వాలనుకుంటున్నా. కానీ, నా ప్రాజెక్ట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి బడ్జెట్ పరిమితులవల్ల, ఒక్క క్రియేటివిటీ తప్ప మిగిలిన అన్ని పనులు, అన్ని ఏర్పాట్లు నేనే స్వయంగా చూసుకోవాల్సివస్తోంది. ఇంకా చెప్పాలంటే క్రియేటివిటీ 10%, ఇతర అన్ని ఓనులూ 90% చూసుకోవాల్సి వస్తోంది. అయినప్పటికీ, ఉన్న పరిమితుల్లో నేను చాలా బాగా చేయడానికే ప్రయత్నించాను. చేశాను కూడా.
      > అయితే - వచ్చే చిక్కంతా ప్రమోషన్, రిలీజ్ దగ్గరే.
      > నా తర్వాతి చిత్రాలకు ఆ సమస్యలు లేకుండా చూసుకుంటున్నాను. నో కాంప్రమైజ్!

      Delete