Tuesday 12 May 2015

అసలేందీ స్విమ్మింగ్‌పూల్ సినిమా?

> ఒక ప్యాషనేట్ యంగ్ ప్రొడ్యూసర్, ఒక క్రియేటివ్‌లీ కూల్ డైరెక్టర్ కలిసి తీసిన సినిమా ఇది.

> స్విమ్మింగ్‌పూల్ - మామూలుగా ఒక హారర్ సినిమా. కానీ, ఏదో ఉట్టుట్టి హారర్ కాదు. "హాట్ రొమాంటిక్ హారర్!" సో, విషయం అర్థమయిందనుకుంటాను.

> ప్రధానంగా మెయిన్ ఆర్టిస్టులు, టెక్నీషియన్‌ల విషయంలో "కోపరేటివ్ పధ్ధతి"లో ప్లాన్ చేసిన ఈ సినిమా .. పోను పోను ఒక మిడ్ రేంజ్ బడ్జెట్ సినిమా అయింది చివరికి. అంటే - ఏదో చిన్నగా ప్లాన్ చేశాం కదా అని ఎక్కడా కాంప్రమైజ్ కాలేదన్నమాట!

> రెడ్ ఎం ఎక్స్ కెమెరాతోపాటు, దాదాపు ప్రతిరోజూ స్టడీకామ్‌ను కూడా ఉపయోగించి - సుమారు 40 రోజుల్లో తీయాల్సిన ఈ సినిమాను - కేవలం 13 రోజుల్లో పూర్తిచేశాం.

> 13 రోజుల్లో చేశాం అంటే .. ఏదో అలా చుట్ట చుట్టి పడేశామని కాదు. దాదాపు ప్రతిరోజూ రెండు/మూడు షిఫ్టులు పనిచేశాము ఈ సినిమా కోసం. అలా పనిచేయగల ప్యాషన్ ఉన్న లైక్‌మైండెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లనే (దాదాపు) ఈ సినిమాకు ఎన్నుకున్నాం.

> ఇప్పుడు, సూపర్ క్వాలిటీ ఔట్‌పుట్ వచ్చిన ఈ సినిమాను చూసి, రెండే రెండు చిన్న కట్స్ ఇస్తూ, సెన్సార్ ఆఫీసర్‌తోపాటు, మిగిలిన సభ్యులంతా కూడా బాగుందంటూ మమ్మల్ని అప్రిషియేట్ చేయడం విశేషం. మాకు ఆనందం కూడా. ఎందుకంటే స్విమ్మింగ్‌పూల్ సినిమాకు వాళ్లే మా తొలి ప్రేక్షకులు కాబట్టి.

> ఒక మెలొడీ, ఒక ఐటమ్ సాంగ్‌తోపాటు .. ప్రమోషన్ కోసం మరో రెండు పాటలున్న ఈ సినిమా ఆడియోను ప్రముఖ ఆడియో సంస్థ ఆదిత్య మ్యూజిక్ ద్వారా జూన్ 1 నాడు రిలీజ్ చేస్తున్నాము.

> ఎబ్రాడ్‌లో - యు కె, యూరోప్, యు ఎస్ లలో కూడా రిలీజవుతున్న మొట్టమొదటి మైక్రో బడ్జెట్ సినిమా స్విమ్మింగ్‌పూల్.

> సినిమా రిలీజ్ కోసం అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి. ఒకటి రెండు పెద్ద సినిమాల రిలీజ్ హడావిడివల్ల ఏర్పడిన గందరగోళంతో, వారం వారం కుప్పలుగా రిలీజవుతున్న చిన్న సినిమాల తాకిడి కూడా కొంచెం తగ్గాక, బహుశా జూలై చివర్లో స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ ఉంటుంది.      

2 comments: