Saturday 2 May 2015

సినిమా .. ఒక పెద్ద బిజినెస్!

ఒక కళ.
ఒక మాయ.
ఒక ఆకర్షణ.
ఒక స్పెక్యులేషన్.
ఒక జూదం.
ఒక జీవితం.

సినిమా గురించి పైన చెప్పిన ప్రతి ఒక్క మాట అక్షరాలా నిజం. కాకపోతే .. ఒక్కో సినిమా సెటప్‌ని బట్టి, అప్పటి పరిస్థితులను బట్టి, వ్యక్తుల అనుభవాలను బట్టి ఈ నిర్వచనాలు మారుతుంటాయి.

నలభై కోట్లు పెట్టి - ఓ బ్రాండెడ్ హీరోతో, మరో బ్రాండెడ్ డైరెక్టర్ ఏడాదిపాటు చెక్కిన ఒక తెలుగు సినిమాను రెండే రెండు గంటల్లో ప్రేక్షకుడు చెత్త సినిమా అనో, వేస్ట్ అనో ఒక్క మాటలో తేల్చిపడేయొచ్చు.

మరోవైపు .. కేవలం ఓ నలభై లక్షల్లో కొత్తవాళ్లతో తీసిన ఒక మైక్రో బడ్జెట్ సినిమాను చూసి, అదే ప్రేక్షకుడు బాగుంది అని దాన్ని హిట్ చేయొచ్చు.

ఈ రెండు సినిమాల నిర్మాణంలో ప్రాసెస్ ఒకటే. రేంజ్ మాత్రమే వేరు. ఒక సినిమా కంటెంట్ ఆ క్షణం ప్రేక్షకులకు నచ్చింది. మరొక సినిమా కంటెంట్ నచ్చలేదు. అంతే.

సినిమా పుట్టినప్పటినుంచీ ఇదే వ్యవహారం.

కేవలం 5 శాతం సినిమాలు మాత్రమే ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటాయి. అది హాలీవుడ్ కావొచ్చు. బాలీవుడ్ కావొచ్చు. మన తెలుగువుడ్డు కూడా కావొచ్చు. ఎక్కడయినా, ఎప్పుడయినా ఇదే జరిగేది.

95% ఫెయిల్యూర్ రేట్ అన్నమాట!

అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ .. సినిమా అంటే ఇదే. సినిమా లెక్కలు ఇవే.

అందుకే .. సినిమా ఒక జూదం కూడా. ఒక పెద్ద క్రియేటివ్ గ్యాంబ్లింగ్.

ఈ ప్రాక్టికల్ నిజాన్ని పక్కనపెట్టి, ఆయా సినిమాలని తీయడంలో వాళ్లు పడ్ద శ్రమని, వాళ్లు అనుభవించిన కష్టనష్టాలనీ, ఆ సినిమాల నిర్మాణ నేపథ్యాన్నీ కనీసం ఆలోచించకుండా .. ఎవరెవరో సినిమాల గురించి ఏదేదో రాస్తారు. కొందరు ఉచిత సలహాలనిస్తారు.

వాళ్లు క్రిటిక్స్. మేధావులు. అది వారి ప్రొఫెషన్. వారి హాబీ. ఆ విషయం అలా వదిలేద్దాం.    

కట్ టూ బిజినెస్ -

ఎవరు ఎన్ని చెప్పినా ఇదే నిజం. సినిమా ప్యూర్‌లీ ఒక పెద్ద బిజినెస్. క్రియేటివ్ బిజినెస్.

"నాకసలు డబ్బు అక్కర్లేదు. మంచి సినిమా తీసిన పేరు, సంతృప్తి చాలు!" అని చెప్పగలవాళ్లు నిజంగా ఎంతమందున్నారు? ఎంతమంది అంత సింపుల్‌గా, అంత భారీ రేంజ్‌లో డబ్బులు కోల్పోడానికి ఇష్టపడతారు?

ఒకవేళ ఎవరయినా అలా చెప్పి, డబ్బులు అసలే వచ్చే అవకాశంలేని ఒక అద్భుతమయిన ఆర్ట్ సినిమా తీసినా .. అందులో కూడా పెద్ద బిజినెస్ ఉంది.

తన పేరు, సంతృప్తికోసం సినిమా తీస్తున్నాడు. ఈ కాన్సెప్ట్ కూడా నథింగ్ బట్ బిజినెస్!

సో, కమర్షియల్ సినిమాలు తీసినా, ఆర్ట్ సినిమాలు తీసినా .. ఎవరికయినా ముందు కావల్సింది సినిమా మీద ప్యాషన్.

ఆ ప్యాషన్‌తోనే ఇప్పుడు మొట్టమొదటిసారిగా పూర్తిస్థాయిలో ఫీల్డులోకి దిగాన్నేను. అది కూడా  కొంతకాలమే కావొచ్చు. నా ఇష్టం.

ఫాక్టరీకి పునాదులు పడుతున్నాయి.

నా ఫాక్టరీ నుంచి అన్నీ మైక్రో బడ్జెట్ సినిమాలే వస్తాయి. పూర్తి క్రియేటివ్ ఫ్రీడమ్‌తో, మైక్రో బడ్జెట్లో, మంచి క్వాలిటీతో, తక్కువ రోజుల్లో ఎక్కువ సినిమాలు తీయడం కోసమే ఈ ఫాక్టరీ.

సినిమా నిర్మాణంలో ఆధునికంగా వచ్చిన డిజిటల్ టెక్నాలజీ వల్ల బడ్జెట్‌లు చాలా తగ్గాయి. చిన్న స్థాయిలో, కొత్తవాళ్లతో సినిమాలు చేయాలనుకొనేవాళ్లకు బిజినెస్ పాయింటాఫ్ వ్యూలో ఇదొక మంచి ప్రాఫిటబుల్ అండ్ పాజిటివ్ మలుపు.

అయితే - దీన్ని ఎంతవరకు పాజిటివ్‌గా ఉపయోగించుకొని, ఏ రేంజ్‌లో సక్సెస్ సాధించగలమనేదే మిలియన్ డాలర్ కొశ్చన్. ఎన్ని ఆడ్డంకులు వచ్చినా, అన్నీ మనకు అనుకూలం చేసుకొని ముందుకు సాగిపోగల సత్తా కూడా మనలో ఉండాలి.

ఎందుకంటే - ముందే చెప్పినట్టు .. సినిమా ఒక స్పెక్యులేషన్. ఒక జూదం.

అయినా - భారీ స్థాయిలో డబ్బూ, ఊహించని రేంజ్ వ్యక్తులతో సంబంధాలూ, ఓవర్‌నైట్‌లో ఫేమ్ .. ఇవన్నీ ఇక్కడే సాధ్యం.

దటీజ్ సినిమా.

ఒక బిగ్ బిజినెస్.   

No comments:

Post a Comment