Friday 17 April 2015

నా అసలైన గురువులకు వందనం!

న్యూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ (NTFI) పధ్ధతిలో, ఎవరికీ ముందు రెమ్యూనరేషన్ ఇవ్వకుండా, అతి తక్కువ రోజుల్లో ఒక రొమాంటిక్ హారర్ చిత్రం చేస్తున్నామంటేనే ఎవరికయినా విషయం ఈజీగా అర్థమయిపోతుంది.

ప్రతి విషయంలోనూ మాకు చాలా చాలా పరిమితులుంటాయి.

ఇండస్ట్రీలో పదేళ్లనుంచీ ఉండీ - అన్నీ చూస్తూ, గమనిస్తూ కూడా - ప్రతిదానికీ వెనకనుంచో, ఇండైరెక్టుగానో వంకలు పెట్టేవాళ్లన్నా, అర్థం పర్థం లేకుండా విమర్శించేవాళ్లన్నా, కొత్తగా ఎవరి మధ్యనయినా గ్యాప్ క్రియేట్ చేయాలని చూసేవాళ్లన్నా నాకు చాలా చికాకు. అసహ్యం కూడా.

ఇలాంటివాళ్లు టీమ్ బయటివాళ్లయినా, లోపలివాళ్లయినా ఒకటే. వారి అజ్ఞానానికి నిజంగా జాలిపడతాను.

వీరి పట్ల నాకు కోపం రాదు.

చెప్పాలంటే - వాళ్లను నా గురువులుగా భావిస్తాను.

ఎందుకంటే - నా తర్వాతి చిత్రంలో, ప్రతి ఒక్క విషయంలోనూ నేను మరిన్ని జాగ్రత్తలు పాటించి మరీ నిర్ణయాలు తీసుకొంటాను. ఈ జ్ఞానోదయం నాలో కలగటానికి కారణమైన వీళ్లంతా నాకు నిజంగా గురువులే!

కట్ టూ కొన్ని నిజాలు - 

జూదంతో పోల్చ్జినప్పుడు, దాదాపు ఏ రకంగానూ దానికి తక్కువకాని ఒక సినిమా ప్రాజెక్టు కోసం, ఓ ప్రొడ్యూసర్‌ను క్రియేట్ చేసుకోవడం అనేది అంత ఈజీకాదు. అలా సంపాదించుకొన్న ప్రొడ్యూసర్‌ను సినిమా పూర్తయ్యేవరకూ జాగ్రత్తగా కాపాడుకొంటూ, పైసా వృధా కాకుండా అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది.

ఇది .. ఇక్కడ ఈ బ్లాగ్‌లో నేను చెప్పినంత సులభం కాదు.

ఈ నిజం తెలిసీ.. బాధ్యతారహితంగా, ఎంతో కేర్‌లెస్‌గా ఎలా కామెంట్స్ వొదుల్తారో నాకిప్పటికీ అర్థంకాదు.

సినిమా లోకం తెలియనివాళ్లంటే వేరు. వారికి తెలియదు లోపలి విషయాలు, లోపలి తలనొప్పులు.

కానీ, సినిమాల్లో ఉండీ .. "మనం మాట్లాడే ప్రతి చిన్నమాటకూ ఎంత విలువ ఉంటుంది, అవతలివారు ఎంత హర్ట్ అవుతారు" వంటి బేసిక్ ఆలోచన లేకుండా ఎలా అంత ఈజీగా స్టేట్‌మెంట్స్, కామెంట్స్ వొదుల్తారో నాకిప్పటికీ నిజంగా అర్థం కాని ఒక పెద్ద ఎనిగ్మా!

ఏమయినా, ప్రియాతిప్రియమయిన ఈ నా గురువులందరికీ ఇవే నా వందనాలు.

వీళ్లంతా చాలా తొందరగా టాప్ స్టార్స్ కావాలనీ, టాప్ రేంజ్ డైరెక్టర్స్ కావాలనీ, స్టార్ ప్రొడ్యూసర్స్ కావాలనీ హృదయపూర్వకంగా అభిలషిస్తున్నాను.

అప్పుడు మాత్రమే వీళ్లకు ఇలాంటి చీప్ పనులు చేయడానికి అస్సలు టైమ్ ఉండదని నా అభిప్రాయం.     

No comments:

Post a Comment