Saturday 7 March 2015

ఉర్సు టూ హారిస్‌బర్గ్‌!

ఒకరోజు పొద్దుటే యు ఎస్ నుంచి ఓ ఫోన్ కాలొచ్చింది. అప్పుడు యు ఎస్ లో ఏ అర్థరాత్రో దాటి ఉంటుంది. నేనెవరో తనకు తెల్సునన్నాడు అవతలనుంచి నాకు కాల్ చేసినతను. అనటమే కాదు. నాగురించి చాలా చెప్పాడు. తనెవరో కూడా చెప్పుకున్నాడు.

ఇద్దరం ఒకే ఊళ్లో పుట్టి పెరిగినవాళ్లం.

ఉర్సు, వరంగల్.

వరంగల్ నుంచి యు ఎస్ వెళ్లినవాళ్లు చాలామంది ఉన్నారు. కానీ, నాకు తెలిసినంతవరకు - మా వరంగల్ 17 వ వార్డులోని ఉర్సు నుంచి యు ఎస్ వెళ్లి అక్కడ మంచి పొజిషన్లో బాగా స్థిరపడింది మాత్రం నా ఈ మిత్రుడొక్కడే.

నేను నిజంగా గర్వంగా ఫీలయ్యాను ఆ క్షణం. మా ఉర్సు నుంచి కూడా ఒక మిత్రుడున్నాడు యు ఎస్ లో అని!

నాకంటే ఓ ఆరేడేళ్లు చిన్నవాడు నా మిత్రుడు. వాళ్ల బంధువర్గం, మా బంధువర్గం, అతను గుర్తుచేసిన మా కనెక్టింగ్ మిత్రులు.. అన్నీ ఓకే. అన్నీ నాకు తెలిసినవే. ఆయన గురించి మాత్రం నాకు చాలా తక్కువ తెలుసు.

కానీ తర్వాత్తరువాత తన గురించి నేనే స్వయంగా చాలా తెల్సుకున్నాను.

అసలు మా మధ్య ఈ గ్యాప్ కు కూడా ఒక కారణముంది. ఎప్పుడో 1985 లో నేను వరంగల్ నుంచి బయటపడ్డాను అంటే మళ్ళీ అట్నుంచి నాకు ఎలాంటి కనెక్షన్లు లేవు. ఎవరూ నన్ను గానీ, నేను ఎవర్ని గానీ గుర్తుపెట్టుకొనే అవకాశం లేదు.

సో, ఈ లెక్కన ఏ పాతికేళ్ల క్రితమో.. లేదంటే అంతకంటే ఇంకా ముందో.. నా మిత్రుడు నన్ను చూసుంటాడు.

ఓకే..

ఆ మొదటి ఫోన్ తర్వాత మా ఇద్దరి మధ్య ఫోన్‌లు, ఈమెయిల్స్ అలా కంటిన్యూ అయ్యాయి. ఇదంతా దాదాపు ఓ పదినెలలక్రితం ప్రారంభమయిన వ్యవహారం.

కర్టెసీ.. ఫేస్‌బుక్!

మళ్ళీ మార్క్ జకెర్‌బర్గ్‌కి థాంక్స్ చెప్పక తప్పదు.

కట్ చేస్తే -  

2012 జనవరి 4 నాడు నాకు జరిగిన ఓ భారీ యాక్సిడెంట్ గురించి విన్నాడు నా మిత్రుడు. ఇప్పుడు మళ్ళీ నేనెందుకు సినీఫీల్డులోకి రీ-ఎంటరవ్వాలనుకుంటున్నానో కూడా విన్నాడు.

యు ఎస్ నేపథ్యంలో - దాదాపు చాలా సహజంగా ఉండే పూర్తి మెటీరియలిస్టిక్ పరిధులు దాటి, తన విలువయిన సమయాన్ని వెచ్చించి మరీ స్నేహ హస్తం అందించాడు నా మిత్రుడు.

నా మిత్రుడు చేసిన సహాయంలో నేను బాగా విలువిచ్చేదీ, గుర్తించేదీ అవతలివారు నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ, దాన్ని నా మిత్రుడు చాలా ఇష్టంగా చేయగలిగాడు. చేసి, తనేంటో నిరూపించుకున్నాడు.

ఈ మొత్తం ఎపిసోడ్‌లో - నా స్విమ్మింగ్‌పూల్ సినిమా యు ఎస్ షూటింగ్ పార్ట్ కోసం, అన్‌కండిషనల్‌గా నా మిత్రుడు నాకు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను.

క్రియేటివిటీపరంగా మల్టీ టాలెంటెడ్ అయిన నా మిత్రుడు అక్కడ చేస్తున్న ఉద్యోగం వేరు. ఇక్కడ నేను చేస్తున్న ఈ రొమాంటిక్ హారర్ సినిమాకోసం ఆయన చేసిన సహాయం వేరు. అదే అతని గొప్పతనం.

తను చేయగలడని నాకు తెలుసు. చేసి చూపించాడు. "భేష్" అనిపించుకున్నాడు. ఇక్కడ పోస్ట్ ప్రొడక్షన్ సూట్స్‌లో కూడా దాదాపు అందరు టెక్నీషియన్సూ అదే మాట!

ఫినిచింగ్ టచ్ ఏంటంటే - మంచి న్యూస్‌కాస్టర్, వాయిసోవర్ ఆర్టిస్టు కూడా అయిన ఈ మిత్రుడితో స్విమ్మింగ్‌పూల్ లోని ఒక సీన్‌లో యాక్ట్ కూడా చేయించాను!

మైనస్ డిగ్రీల చలిలో కూడా ఎంతో కూల్‌గా, ఉత్సాహంగా నటించిన నా మిత్రుడి కమిట్‌మెంట్‌ని ఇక్కడ పోస్ట్‌ప్రొడక్షన్ మానిటర్స్‌లో చూసినప్పుడల్లా గర్విస్తుంటాను.

అతి త్వరలో యు ఎస్ లో కూడా దాదాపు అన్ని ముఖ్యమయిన సెంటర్లలోనూ విడుదలకాబోతున్న "స్విమ్మింగ్‌పూల్" సినిమా ద్వారా నా మిత్రుడు తొలిసారిగా వెండితెరపై కనిపించబోతున్నాడు. అది నా సంతోషం కోసం!

బహుశా ఈ 2015 లోనే, మేమిద్దరం మళ్లీ కల్సుకుంటామని నాకెందుకో బాగా అనిపిస్తోంది. దానికో ప్లానుంది. ఆ ప్లాన్ కూడా నా మిత్రుడిదే. ఆ ప్లాన్‌ని నిజం చేయగల సామర్థ్యం నాకుంది.

ఇది నిజం అవుతుందని నా నమ్మకం.

నా మిత్రునికి సమాజం సంపూర్ణంగా తెలుసు. క్రియేటివిటీ గురించీ తెలుసు. స్నేహం గురించీ తెలుసు.

కూల్ జెంటిల్‌మాన్.

ఇదంతా చెప్పి, నా మిత్రుడి పేరు చెప్పకుండా ఈ బ్లాగ్‌పోస్టుని ఎలా ముగిస్తాను?

సదానందం భారత.

థాంక్ యూ సదా!

ఫర్ ఎవ్విరిథింగ్ ..  

1 comment:

  1. Yes ! :} Its True :} He always be happy ....because he is "SADA ANANDAM"

    ReplyDelete