Friday 30 May 2014

84 లక్షల కోట్లంటే ఎంతో తెలుసా?

నిన్న సాయంత్రం ఓ నేషనల్ చానెల్లో మొట్టమొదటిసారిగా ఈ టాపిక్ గురించి కొంత వివరంగా, అర్థవంతంగా విన్నాను. పైన చెప్పిన అంకె మరేదో కాదు. అంతా నల్ల ధనం. బ్లాక్ మనీ!

ప్రపంచవ్యాప్తంగా దేశం నుంచి బయటికి భారీ స్థాయిలో బ్లాక్ మనీని పంపిస్తున్న దేశాల్లో మన దేశం టాప్ 10 లో ఉంది. 5 వ స్థానం! ఇదంతాకూడా కేవలం ఒక్క స్విస్ దేశపు బ్యాంకుల్లో దాచిన డబ్బే అన్న విషయం ఇక్కడ గుర్తించాలి. మారిషస్ లాంటి ఇంకెన్నో దేశాల్లో.. ఇంకెన్ని లక్షల కోట్ల ఇండియన్ బ్లాక్ మనీ మూలుగుతోందో!  ఒక్కసారి ఆలోచించండి.

ఈ సందర్భంగా.. ఇక్కడ నేను చర్చించదల్చుకున్న పాయింట్స్ రెండే రెండు:

1. ఇంత భారీ స్థాయిలో నల్లధనం దేశాన్ని దాటి బయటికి వెళ్తోంటే - కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, దాని ఇతర పవర్‌ఫుల్ విభాగాలు ఏం చేస్తున్నట్టు? అసలవన్నీ ఇంక ఎందుకు??

2. అఫీషియల్‌గా స్విస్‌లో డిపాజిట్ చేసిన బ్లాక్ మనీ మొత్తాలు, ఆయా వ్యక్తుల పేర్ల లిస్టులు కూడా బయటపడ్డాయి. ఇప్పటికయినా, పిచ్చ హైప్‌తో అధికారంలోకి వచ్చిన ఈ మోడీ గవర్నమెంటయినా.. నిజంగా ఆయా వ్యక్తులను, వారి ఈ యాక్టివిటీకి సహకరించిన బినామీలు, అధికారులు మొదలైన వారినంతా అనుకుంటే ఒక్క క్షణంలో అరెస్ట్ చేయవచ్చు. ఆ పని చేయగల సత్తా ఈ గవర్నమెంటుకయినా ఉందా?

విదేశాల్లో ఉన్న మన నల్ల ధనంలో ఓ 12% తెప్పించుకోగలిగితే చాలు. కేవలం 24 గంటల్లో మన దేశం అప్పులనుంచి పూర్తిగా బయటపడిపోతుంది. కనీసం ఓ 20 ఏళ్లపాటు ఎవరూ ఏ టాక్స్ కట్టకపోయినా ఫరవాలేని స్థాయిలో .. అంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది మనదేశం.

ఈ స్టాటిస్టిక్స్ నిజంగా నిజం అని ప్రెస్ చెబుతోంది. ఈ నిజాన్ని నిజం చేయడానికి నిజంగా మోడీ ఏమయినా చేయగలడా? చేయనిస్తారా?

చూద్దాం.. 

1 comment:

  1. i think u r not reading news papers regularly under ramjetmalani a commite is already working on it brother...u need not dout Namo

    ReplyDelete