Friday 30 May 2014

తెలంగాణ రాజముద్ర

పక్కన కనిపిస్తున్న చిత్రం ఏదో మామూలు లోగో కాదు. తెలంగాణ ప్రభుత్వ రాజముద్ర.

తెలంగాణ ఉద్యమ నేత, కాబోయే ముఖ్యమంత్రి కెసీఅర్ దీన్ని ఓకే చేశారని విన్నాను. ప్రమాణస్వీకారం అనంతరం  జరిగే తొలి మంత్రివర్గ సమావేశంలోనే దీన్ని అఫీషియల్‌గా ఓకే చేస్తారు. తర్వాత ఈ రాజముద్ర అధికారికంగా అమల్లోకి వస్తుంది.

ఇక్కడివరకూ ఓకే. ఈ టాపిక్ గురించి బ్లాగ్‌లో రాస్తున్నానంటే, దానికో ప్రత్యేక కారణముంది.

కట్ టూ లక్ష్మణ్ ఏలే! 

ప్రముఖ అంతర్జాతీయస్థాయి తెలంగాణ చిత్రకారుడు, ప్రారంభంలో ఎన్నో రాంగోపాల్ వర్మ చిత్రాలకు పబ్లిసిటీ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్, క్రియేటివ్ రియలిస్ట్  అయిన మిత్రుడు లక్ష్మణ్ ఏలే ఈ రాజముద్రని డిజైన్ చేయడం పెద్ద విశేషం.

కంగ్రాట్స్, లక్ష్మణ్ భాయ్!  ఇప్పుడే కాదు.. రాబోయే తరాల్లోని ప్రతి తెలంగాణ బిడ్డ కూడా మీ  పేరుని కనీసం ఒక్కసారయినా స్మరించుకుంటారు.

అన్నట్టు.. నేను నంది అవార్డ్ పొందిన నా "సినిమా స్క్రిప్ట్ రచనాశిల్పం" పుస్తకానికి కవర్ డిజైన్ చేసింది కూడా లక్ష్మణ్ ఏలేనే!

కట్ టూ కాకతీయుల చిహ్నం -

రాజముద్ర డిజైన్‌లో - మూడు సిమ్హాలు, సత్యమేవజయతే, చార్మినార్‌లతోపాటు.. నా జన్మస్థలం వరంగల్‌కు చెందిన కాకతీయుల ద్వారతోరణం ప్రముఖంగా ఉండటం కూడా ఈ రాజముద్రకి మరింత ఆకర్షణని తెచ్చింది. థాంక్ యూ, లక్ష్మణ్ భాయ్! 

84 లక్షల కోట్లంటే ఎంతో తెలుసా?

నిన్న సాయంత్రం ఓ నేషనల్ చానెల్లో మొట్టమొదటిసారిగా ఈ టాపిక్ గురించి కొంత వివరంగా, అర్థవంతంగా విన్నాను. పైన చెప్పిన అంకె మరేదో కాదు. అంతా నల్ల ధనం. బ్లాక్ మనీ!

ప్రపంచవ్యాప్తంగా దేశం నుంచి బయటికి భారీ స్థాయిలో బ్లాక్ మనీని పంపిస్తున్న దేశాల్లో మన దేశం టాప్ 10 లో ఉంది. 5 వ స్థానం! ఇదంతాకూడా కేవలం ఒక్క స్విస్ దేశపు బ్యాంకుల్లో దాచిన డబ్బే అన్న విషయం ఇక్కడ గుర్తించాలి. మారిషస్ లాంటి ఇంకెన్నో దేశాల్లో.. ఇంకెన్ని లక్షల కోట్ల ఇండియన్ బ్లాక్ మనీ మూలుగుతోందో!  ఒక్కసారి ఆలోచించండి.

ఈ సందర్భంగా.. ఇక్కడ నేను చర్చించదల్చుకున్న పాయింట్స్ రెండే రెండు:

1. ఇంత భారీ స్థాయిలో నల్లధనం దేశాన్ని దాటి బయటికి వెళ్తోంటే - కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, దాని ఇతర పవర్‌ఫుల్ విభాగాలు ఏం చేస్తున్నట్టు? అసలవన్నీ ఇంక ఎందుకు??

2. అఫీషియల్‌గా స్విస్‌లో డిపాజిట్ చేసిన బ్లాక్ మనీ మొత్తాలు, ఆయా వ్యక్తుల పేర్ల లిస్టులు కూడా బయటపడ్డాయి. ఇప్పటికయినా, పిచ్చ హైప్‌తో అధికారంలోకి వచ్చిన ఈ మోడీ గవర్నమెంటయినా.. నిజంగా ఆయా వ్యక్తులను, వారి ఈ యాక్టివిటీకి సహకరించిన బినామీలు, అధికారులు మొదలైన వారినంతా అనుకుంటే ఒక్క క్షణంలో అరెస్ట్ చేయవచ్చు. ఆ పని చేయగల సత్తా ఈ గవర్నమెంటుకయినా ఉందా?

విదేశాల్లో ఉన్న మన నల్ల ధనంలో ఓ 12% తెప్పించుకోగలిగితే చాలు. కేవలం 24 గంటల్లో మన దేశం అప్పులనుంచి పూర్తిగా బయటపడిపోతుంది. కనీసం ఓ 20 ఏళ్లపాటు ఎవరూ ఏ టాక్స్ కట్టకపోయినా ఫరవాలేని స్థాయిలో .. అంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది మనదేశం.

ఈ స్టాటిస్టిక్స్ నిజంగా నిజం అని ప్రెస్ చెబుతోంది. ఈ నిజాన్ని నిజం చేయడానికి నిజంగా మోడీ ఏమయినా చేయగలడా? చేయనిస్తారా?

చూద్దాం.. 

Saturday 24 May 2014

స్మాల్ సినిమా, బిగ్ బిజినెస్!

30 నుంచి 300 కోట్లు ఖర్చుపెట్టి తీసే భారీ సినిమాల గురించి నేనిక్కడ రాయడం లేదు. నిజానికి, ఆ రేంజ్  సినిమాలు సూపర్ డూపర్ హిట్ లయినా లాభాలు మాత్రం అంతంత మాత్రమే!

ఇది లోపల్లోపలి నిజం. ఓ పెద్ద గ్యాంబ్లింగ్.

వాటి విషయం వదిలేద్దాం. వాటికోసం ఆల్రెడీ చాలామంది ఉన్నారు ఫీల్డులో.

కట్ చేస్తే -

ఇప్పుడు నిజంగా అంతా కొత్తవాళ్లతో చేసే చిన్న బడ్జెట్ సినిమాలదే పూర్తి హవా. బిజినెస్ పరంగా చూసినా, ఇప్పుడున్న ఈ ట్రెండుని ఓ గొప్ప అవకాశంగా తీసుకోవచ్చు.

కేవలం కోటి, రెండు కోట్లలోపు బడ్జెట్‌తో, అంతా కొత్తవాళ్లతో, ఓ మాంచి కమర్షియల్ ట్రెండీ యూత్ ఎంటర్‌టైనర్ సినిమాని చాలా బాగా తీసి రిలీజ్ చేయవచ్చు. ఇలా తీసిన ఎన్నో మైక్రో బడ్జెట్ / నానో బడ్జెట్ సినిమాలు ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించాయి. వీట్లో కొన్ని సినిమాలు ఒక్క తెలంగాణ ఏరియాలోనే 10 కోట్లవరకు వసూలు చేశాయన్నది చాలామంది నమ్మలేని నిజం. 

మనం పెట్టే ఒకటి లేదా రెండు కోట్ల బడ్జెట్‌కు దాదాపు 0% టెన్షన్ కూడా ఉండదు. ప్రాజెక్ట్ కూడా కేవలం 5-6 నెలల్లో పూర్తయిపోతుంది. ఇంకేం కావాలి?

కట్ టూ డైరెక్ట్ పాయింట్ - 

నిజంగా సినిమాల మీద, సినిమా బిజినెస్‌మీద అమితమైన ఆసక్తి ఉండి.. కనీసం ఓ 10 లక్షల స్థాయి నుంచి, ఆపైన వెంటనే ఇన్వెస్ట్ చేయగల "కొత్త" ఇన్వెస్టర్లు/కో-ప్రొడ్యూసర్లు/ప్రొడ్యూసర్లు నన్ను వెంటనే సంప్రదించవచ్చు.

మీ బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్‌కి సంబంధించి అంతా లీగల్ పేపర్స్ పైన రాసుకోవడం ఉంటుంది. మంచి లాభాలతోపాటు.. ప్రెస్, సోషల్ మీడియా ఫోకస్ వంటి ఇతర బెనిఫిట్స్ ఇంకా చాలా ఉంటాయి.

బేసిక్‌గా మీలో సినిమా పట్ల వ్యామోహం ఉండాలి. ఈ బిజినెస్ లోకి ఎంటర్ అవాలన్న కోరిక ఉండాలి. అలాంటి లైక్‌మైండెడ్ వారెవరైనా నాకు వెంటనే మీ వివరాలు, ఫోన్ నంబర్‌తో ఈమెయిల్ పెట్టొచ్చు. మా ఆఫీస్ నుంచి మీకు వెంటనే కాల్ వస్తుంది. లేదా నేనే మీకు కాల్ చేస్తాను.

ఈమెయిల్:
mchimmani@gmail.com 

పైన చెప్పిన పనిని అత్యంత సమర్థవంతంగా పూర్తిచేసిపెట్టగల 'నెగొషియేటర్స్/మీడియేటర్స్/కనెక్టర్స్' కు కూడా ఇదే ఆహ్వానం. తగిన రాయాల్టీ ఉంటుంది. 

Wednesday 21 May 2014

నమో నమః

అనక తప్పదు. అలాంటి విజయం నరేంద్ర మోడీది. చెప్పాడు. చేసి చూపించాడు.

ఆ వినయం, ఆ విధేయత.. ముఖ్యంగా ఆయనతో జతకట్టిన మనవాళ్లలాగా అణువణువూ అహంకారం, ఈగో, స్వోత్కర్షలు  లేకపోవడం.. ఇవన్నీ కేవలం మోడీకే సొంతం.

కట్ టూ కనీ వినీ ఎరుగని రికార్డు -

గుజరాత్ విధానసభలోకి నరేంద్ర మోడీ తొలిసారిగా ప్రవేశించింది సి ఎం గానే! ఇప్పుడు - పార్లమెంట్ సెంట్రల్ హాల్లోకి కూడా తొలిసారిగా ప్రవేశించింది పి ఎం గా!!

కేన్ అండ్ ఏబుల్, ఫస్ట్ ఎమాంగ్ ఈక్వల్స్ వంటి (కొంతవరకు ఈ కోవకి చెందిన) అద్భుతమైన ఫిక్షన్ రాసిన జెఫ్రీ ఆర్చర్ కూడా థ్రిల్ అయ్యే కాన్సెప్ట్ ఇది!  ఫిక్షన్ కాదు. నిజం.

ఈ రికార్డుని ఎవరయినా బీట్ చేయగలరా? ఈ లక్ష్యాన్ని మరొకరెవరయినా చేదించగలరా? ఏమో.. నాకయితే నమ్మకం లేదు.

ఇదంతా నేను మోడీ భజన చేస్తూ రాయటం లేదు. ఇదొక సక్సెస్ స్టోరీ. సక్సెస్ సైన్స్. ఇంకా చెప్పాలంటే - ఒక రాగ్స్ టూ రిచెస్ లైఫ్! అందుకే మోడీ గురించి ఈ చిన్న బ్లాగ్ పోస్ట్‌ని నేను ఇంత ప్యాషనేట్‌గా రాస్తున్నాను.

ఇంత గొప్ప విజయం వెనుక ఎంతో కఠిన శ్రమ ఉంది. వ్యక్తిగత జీవనత్యాగం ఉంది. చాయ్‌వాలా నుంచి ఒక దేశ ప్రధాన మంత్రి కాగలిగిన ఒక వాస్తవ జీవితం ఉంది.

దేశంలోని మరే సి ఎం లు చేయలేని ఎన్నో పనుల్ని, ఎంతో అభివృధ్ధిని మోడీ సునాయాసంగా చేసి చూపించాడు. విచిత్రమయిన విషయం ఏంటంటే - కొన్ని విషయాల్లో మోడీ అప్పటి చంద్రబాబుని ఆదర్శంగా తీసుకోని పనిచేయడం!

మోడీ మీద మతానికి సంబంధించిన ఒక మరక ఉంది. అయితే అది నిజం కాదని కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చాయి. గుజరాత్‌లో మోడీ చేసిన అభివృధ్ధి కళ్లముందు కనిపిస్తోంది. ప్రపంచదేశాలూ గుర్తించాయి. ఆయనకు మొన్నటివరకూ వీసా ఇవ్వని అమెరికాతో సహా!

మిగిలిన ఎన్ డి ఏ భాగస్వాముల అంకెలతో సంబంధం లేకుండా - ఒక్క బిజెపి తోనే ఒంటిచేత్తో స్వీప్ చేయగలిగిన సత్తా ఒక్క మోడీవల్లనే సాధ్యమయింది. దీన్ని "బిజెపి భీష్ముడు" అద్వానీ కూడా గుర్తించి మోడీని పొగడ్డం విశేషం.
అయితే - తల్లి భారతదేశం లాగే, బిజెపి కూడా తన తల్లేననీ.. ఆ తల్లికి సేవ చేయడం తన బాధ్యత అని.. అమితమైన భావోద్వేగం కన్నీటితెరని కప్పేస్తుండగా వినమ్రంగా చెప్పాడు మోడీ.

అదీ మోడీ వ్యక్తిత్వం.

కావల్సింది చేతలు. మాటలు కాదు. ఆ సత్తా మోడీలో ఉంది. వచ్చే అయిదేళ్లలో మనదేశ ప్రధానిగా మోడీ ఎన్ని మిరాకిల్స్ అయినా క్రియేట్ చేయగలడని నా నమ్మకం.

ఈ అయిదేళ్లలో మోడీ సృష్టించే అద్భుతాలు.. అమెరికా, చైనా వంటి అగ్రరాజ్యాలకు కూడా ఒక జర్క్‌నివ్వొచ్చు.
నో డౌట్!  

"చక్రం" బాబుకు మళ్లీ వచ్చిన అవకాశం!

అప్పట్లో చంద్రబాబుకీ, చక్రం తిప్పడానికీ చాలా అవినాభావ సంబంధం ఉండేది. కొంతకాలం ఆ రేంజ్‌లో ఢిల్లీలో ఆటలాడుకున్నాడు చంద్రబాబు.

మొన్న తెలంగాణ బిల్లు పాస్ కాకుండా కూడా.. ఆ చెదలుపట్టిన చక్రాన్ని అడ్డదిడ్డంగా తిప్పుతూ, ఢిల్లీలో యమ కష్టపడ్డాడు. నేషనల్ మీడియాతో చీవాట్లు కూడా తిన్నాడు.

చెదలుపట్టిన ఆ చక్రం విషయం అలా వదిలేస్తే - 

చంద్రబాబు అనగానే నాకు అనేకమైన విశేష సంఘటనలు గుర్తుకొస్తాయి. వాట్లో మచ్చుకి కొన్ని:

> బాలయోగి లోక్‌సభ స్పీకర్ కావడం కోసం చివరి క్షణాల్లో.. దాదాపు ఓ థ్రిల్లర్ సినిమా క్లయిమాక్స్‌లా, అత్యంత ఉత్కంఠభరితంగా బాబు తిప్పిన చక్రం.
> బాబు "విజన్ 2020".
> బిల్ గేట్స్, బిల్ క్లింటన్ రేంజ్‌వాళ్లను హైదరాబాద్ రప్పించడం.
> సాఫ్ట్‌వేర్ రంగానికి బాగా ప్రాముఖ్యం ఇవ్వడం.

(నేనూ బాబు చేతులమీదుగానే తెలుగు లలిత కళాతోరణంలో నంది అవార్డ్ తీసుకున్నాను. అది నా పర్సనల్ విషయం అనుకోండి.)

ఇలా ఇంకా కొన్నున్నాయి. అన్నీ ఠక్కున గుర్తుకొచ్చేవే. కాకపోతే, ఇది “9 మినట్ బ్లాగింగ్” కాబట్టి.. యమ స్పీడ్‌గా రాసి, తొందరగా క్లోజ్ చేయాలి.

అయితే, వీటిని అంటిపెట్టుకొనే చాలా మైనస్‌లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు:

> వ్యవసాయాన్ని, రైతులను పెద్దగా కేర్ చేయకపోవడం.
> ప్రభుత్వోద్యోగులను ఫుట్‌బాల్ ఆట ఆడుకోవడం.
> కొన్ని పనికిరాని లాబీలకు, కోటరీ భజనకు లొంగిపోయి.. పెడ్ద బ్లండర్ స్టెప్ వేసి ఊహించనివిధంగా గద్దె దిగటం.
> ఫలితంగా - పదేళ్లు కుర్చీని కోల్పోవడం.

కట్ టూ 2014 - 

అధికారంలో ఉన్నపుడు ఏ రైతుల జీవితాల్నయితే కేర్ చేయలేదో – ఇప్పుడు అదే రైతుకు “రుణ మాఫీ” ఇస్తూ విజయాన్ని దక్కించుకున్నాడు బాబు. ఆయన పశ్చాత్తాపానికి ఫలితం దక్కింది.

దీనికితోడు – మిగిలిన విషయాల్లో బాబు ట్రాక్ రికార్డుని సీమాంధ్ర ప్రజలు నిజంగా మనస్పూర్తిగా గౌరవించి గుర్తించారు. మళ్లీ బంగారు పల్లెంలో అధికారాన్ని అందించారు.

కట్ టూ అవసరంలేని “అతి” - 

> రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల్ని బాబు మళ్లీ కలుపుతాడట!
> అక్కడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇక్కడి తెలంగాణను కూడా అభివృధ్ధి చేస్తాట్ట!
> అక్కడ ఆయన చేసే అభివృధ్ధి పనులను చూసి ఇక్కడ తెలంగాణవాళ్లు నేర్చుకోవాలట!

ఎంత అర్థం లేని మాటలు! ఎంత అవివేకం!!

బాబు తాను ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ముఖ్యమంత్రి అన్న విషయం మర్చిపోయాడనుకుంటాను. ఇలాంటివన్నీ విజయం ఇచ్చిన “కిక్” వల్ల తలకెక్కిన ఈగో రూపంలో ఇదిగో ఇలా బయటపడతాయి. ఇక్కడే - తనని చూసి ఇన్స్‌పయిర్ అయిన మోడీని చూసి, తను ఏం మాట్లాడకూడదో నేర్చుకోవాల్సిన అవసరం బాబుకు చాలా ఉంది.

కట్ టూ “రాబోయే మార్పు” - 

ఇప్పుడు ప్రజల్లో చాలా అవేర్‌నెస్ వచ్చింది. ఏదో అర్థం లేకుండా, అల్లాటప్పాగా, ఎడాలిసెంట్‌గా “ఓదార్పు” అంటూ, “అయిదు సంతకాలు” అంటే పడిపోయే రోజులు పోయాయి.

ఇకమీదట ప్రజలు రాజకీయనాయకుల పనితీరు చూస్తారు. ఫలితాలు చూస్తారు. ఆది కూడా ఏదో ఆషామాషీగా కాదు.

సగటు పౌరుని జీవితాన్ని వీరు చేసే పనులు పాజిటివ్ కోణంలో ఎంతో ప్రభావితం చేయగలగాలి. ఎంతో ఉపయోగపడాలి. అలా లేనప్పుడు బాబయినా, ఇంకెవరయినా నిర్మొహమాటంగా ప్రజలు తిప్పికొడతారు. ఆదీ అసలు ప్రజాస్వామ్యం.

దీని విలువని ఇప్పటికయినా మన పొలిటీషియన్లు గ్రహించారనే అనుకుంటున్నాను. ఇకమీదట - ఎంతో బాగా ప్రభుత్వాన్ని నడిపి, మరెంతో గొప్పగా ఫలితాల్ని చూపించాలన్న తహతహ ప్రతి సి ఎం లోనూ, మంత్రిలోనూ, రాజకీయనాయకునిలోనూ ఉంటాయని నేననుకుంటున్నాను. కనీసం కొంత రేంజ్ వరకయినా!

ఏ పార్టీ అన్నది కాదు విషయం. ఏం మంచి చేశారు అన్నదే ముఖ్యం.

Friday 16 May 2014

జయహో కె సి ఆర్!

జస్ట్ కొద్దిరోజుల క్రితం ..

"కె సి ఆర్ పై విచారణ జరిపిస్తాం!" -- పొన్నాల
"కె సి ఆర్ ని పిచ్చాసుపత్రికి పంపిస్తాం!" -- చంద్రబాబు
"కె సి ఆర్, మాకు నీతులు చెప్పొద్దు!" -- వెంకయ్య నాయుడు
"కె సి ఆర్, నా ఆస్తులు ప్రకటిస్తా. నీ ఆస్తులు ప్రకటిస్తావా?" -- దామోదర
"కె సి ఆర్.. కరిష్మా లేని నాయకుడు!" -- డి ఎస్

కె సి ఆర్ ఇదీ, కె సి ఆర్ అదీ అని నానా స్టేట్‌మెంట్లు ఇచ్చారు. ఎలక్షన్ల తర్వాత కె సి ఆర్ ను జైలుకు కూడా పంపిస్తామన్నారు.

వాటన్నిటికీ కలిపి ఒక్కటే సమాధానం.. ఈనాటి ఈ క్లీన్ స్వీప్.

తెలంగాణ ఉద్యమం మళ్లీ ఇంత ఉవ్వెత్తున ఎగిసి, దాదాపు పుష్కర కాలం ఉధృతంగా కొనసాగి, అంతిమ లక్ష్యం ఛేదించడానికి మూలకారణం కె సి ఆర్.

ఎన్ని ఎత్తులు, ఎంత చాకచక్యం, ఏం వాగ్ధాటి, ఎంత జాగ్రత్త.. చివరి నిమిషం వరకూ!

ఎవరు ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం.

తెలంగాణకు తొలి సి ఎం గా రేపు ప్రమాణ స్వీకారం చేయడానికి కె సి ఆర్ అన్ని విధాలా అర్హుడు, సమర్థుడు.  

కె సి ఆర్, నువ్వు సాధించినవ్! ఇప్పుడు సాధించాల్సింది చాలా ఉంది. ఇదే వేడి, ఇదే వాడి.. నువ్వు కలలుగన్న తెలంగాణ పునర్నిర్మాణం దిశగా కూడా కొనసాగాలి. ప్రతి తెలంగాణ బిడ్డ ముఖంలో నవ్వు వికసించాలి.. 

Saturday 10 May 2014

జూన్ 2 తర్వాత ..

ముందుంది ఏదో పండగ అన్నట్టు .. జూన్ 2 తర్వాత నుంచి రెండు తెలుగు ప్రాంతాల్లోని వ్యవస్థలు, వృత్తులు, వ్యాపారాలు, వ్యక్తుల జీవితాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా మార్పులు జరుగుతాయని నాకనిపిస్తోంది.

"జూన్ 2 సరే, ఈ మే 16 కే కదా అందరి జాతకాలు తెలిసేది?" అని మీరు అనొచ్చు. అయితే - ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచినా, ఎవరు సీ ఎం గా వచ్చినా - జరగాల్సింది జరిగిపోయింది. విడిపోవడం విడిపోవడమే. లెక్క లెక్కే!

అడుగూ బొడుగూ - "ఫోలవరం ముంపు గ్రామాలు" లాంటి కొన్ని సమస్యలుంటాయి. రగులుతూ.

ఆదీ అంతం లేకుండా అవి అలా సాగుతూనే ఉంటాయి. మోక్షం ఎప్పుడో ఇప్పుడే ఎవరేం చెప్పలేరు. చేయలేరు. ఇలాంటి నేపథ్యంలోంచే కొత్తగా మరికొందరు మేథా పాట్కర్‌లు పుడతారు.

కట్ టూ సినిమా ఇండస్ట్రీ - 

'ఈ ఇండస్ట్రీలో కూడా పెద్ద తేడా ఉండకపోవచ్చు.. ఉండదు'.. అని సీనియర్ సినీరంగ ప్రముఖులు, స్టుడియోల అధినేతలు, వాళ్లూ వీళ్లూ అంటున్నారు. అదంతా మేకపోతు గాంభీర్యమే అని నాకనిపిస్తోంది. లేదంటే, లోపల్లోపల ఏమయినా ఒప్పందాలున్నాయో తెలీదు.

అక్కడ, (కొత్త) ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సినీ ఇండస్ట్రీకి చాలా వరాలిస్తారు. టాక్స్ దాదాపు ఉండదు. ఎట్ లీస్ట్ కొంతకాలం వరకు. అప్పుడు కూడా హైదరాబాద్‌ని పట్టుకునే వేలాడతాం అని ఏ బిజినెస్ మ్యాన్ కూడా అనుకోడు.

ఈ కోణంలో చూస్తే - ఇండస్ట్రీలో బాగా పాతుకుపోయిన పెద్ద తలకాయలు కొన్నయినా అటు వైజాగ్‌కో, మరోచోటకో వలస వెళ్లితీరతాయి. హైదరాబాద్‌కి  గుడ్‌బై చెప్తూ!

మిగిలిన కొద్దిమంది పాతకాపులకి ఇంతకుముందులా బిజినెస్ ఉండే అవకాశంలేదు. ఎందుకంటే - కొత్తగా రూపొందే/మార్పులుపొందే తెలంగాణ ఫిలిం చాంబర్, అసోషియేషన్లు, యూనియన్లు ఎలాంటి కొత్త పుంతలు తొక్కుతాయో, ఎలాంటి కొత్త శకానికి నాంది పలుకుతాయో ఇప్పుడే చెప్పలేం.

కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం, కొత్త సినిమాటోగ్రఫీ మంత్రి, ఆ మంత్రిత్వ శాఖ తీసుకొనే నిర్ణయాలు, రూపొందించే మార్గదర్శకాలమీద ఇక్కడి సినీ ఇండస్ట్రీలోని చాలామంది జీవితాలు ఆధారపడి ఉంటాయి.

ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇదే నిజం. జూన్ 2 తర్వాత నుంచే ఇక్కడ అసలు సినిమా మొదలవుతుంది. 

Tuesday 6 May 2014

ప్రొఫెషనల్ మీడియేటర్స్‌కి వెల్‌కమ్!

జూన్ 2 ను కాస్తా.. ఈ మే 17 కో, 18కో ముందుకు జరపాలని యమస్పీడ్‌లో పనులూ, ప్రయత్నాలూ జరుగుతున్నాయిట! సో, రాజకీయాలు రాజకీయాలే.. మన సినిమాలు సినిమాలే. ఏదీ దేనికోసం ఆగదు. ఎవ్వరికోసం ఆగదు.

కట్ టూ మన అసలు పాయింట్ - 

నేనిప్పుడు చేస్తున్న రెండు మైక్రో బడ్జెట్ చిత్రాల కోసం .. చిన్న స్థాయిలో (కనీసం 5 నుంచి 10 లక్షలైనా) వెంటనే ఇన్వెస్ట్ చేయగల ఇన్వెస్టర్స్/కో-ప్రొడ్యూసర్స్ అవసరముంది.

ఇక్కడ ఒక అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే - ఇలా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చేవాళ్లకు ప్రధానంగా సినిమాల మీద ఇంట్రెస్టూ, ఫిలిం ప్రొడక్షన్ బిజినెస్ మీద ప్యాషన్ కాస్తో కూస్తో ఉండటం చాలా అవసరం.  ఎందుకంటే, వాళ్లు మాత్రమే కొన్ని కొన్ని విషయాల్ని ఠక్కున అర్థం చేసుకోగలుగుతారు. ఇతర బిజినెస్‌లకూ దీనికీ ఉన్న తేడాను ఇట్టే గ్రహించగలుగుతారు. ఎంతో కోపరేట్ చేస్తారు. మోరల్ సపోర్ట్ కూడా ఇస్తారు.

అలాంటి ఔత్సాహిక ఇన్వెస్టర్లని/కో-ప్రొడ్యూసర్లని పరిచయం చేసి, డీల్ సక్సెస్ చేయించగల సత్తా ఉన్న నెగొషియేటర్లు/మీడియేటర్లకు ఇదే మా రెడ్ కార్పెట్ వెల్‌కమ్!

మీ శ్రమకి మార్కెట్ రేట్ ప్రకారం తగిన రాయాల్టీ ఉంటుంది. తెరపైన కూడా మొట్టమొదటే మీ పేరు వేసి మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటాం.

అంతా కొత్తవారితో తీస్తున్న ఈ 2 ట్రెండీ యూత్ ఎంటర్‌టైనర్ చిత్రాలను "రెడ్" కెమెరాలతో తీస్తున్నాం. మార్కెటింగ్, ప్రమోషన్ (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్), రిలీజ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేవు.

డీల్‌ని ఆథరైజ్‌డ్ సిఏతో పేపర్ మీద రికార్డ్ చేయించి సంతకాలు చేయటం జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే - ఈ పనంతా - ఒక కార్పొరేట్ సంప్రదాయం ప్రకారం లీగల్‌గా జరుగుతుంది.

ముఖ్యమైన విషయం ఏంటంటే - మాకు కావలసింది కో-ప్రొడ్యూసర్లుగా ఇన్వెస్ట్ చేయగలవాళ్లు మాత్రమే తప్ప ఫైనాన్సియర్స్ కాదు. మాకు ఫైనాన్స్ అవసరం లేదు.

కట్ టూ మీడియేటర్స్ - 

ముందే చెప్పినట్టు - ఇండస్ట్రీ సంప్రదాయం ప్రకారం - తగిన రాయాల్టీని డీల్ పూర్తి అయినరోజే మీడియేటర్స్‌కి ఇవ్వటం జరుగుతుంది. స్క్రీన్ మీద మొట్టమొదటి టైటిల్ కార్డ్ "అక్నాలెడ్జ్‌మెంట్స్"లో మీ పేరు తప్పనిసరిగా వేస్తాము.

నిజంగా మీదగ్గర ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నవారు ఉన్నట్లయితేనే - మీ మొబైల్ నంబర్ ఇస్తూ ఈమెయిల్ పెట్టండి. మా ఆఫీస్ నుంచి మీకు వెంటనే కాల్ వస్తుంది. మిగిలిన వివరాలు ఫోన్లో మాట్లాడుకుందాం.

ఇదీ మా ఈమెయిల్ అడ్రస్:
mfamax2015@gmail.com 

కొత్త స్క్రిప్ట్ రైటర్స్‌కు వెంటనే అవకాశం!

టెక్నికల్‌గా ఒక సినిమా స్క్రిప్టును ఎలా రాస్తారో తెలిసిన కొత్త స్క్రిప్ట్ రైటర్స్ కోసం చూస్తున్నాము.

మామూలుగా కథలు రాయడం వేరు. సినిమా కోసం స్క్రిప్ట్ రాయడం వేరు. ఈ ముఖ్యమైన తేడా తెలిసి ఉండటం చాలా ముఖ్యం. అంతే కాదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినిమా స్క్రిప్టుని (యాక్షన్ పార్ట్. డైలాగ్ పార్టులతో) ఏ ఫార్మాట్‌లో ఎలా రాస్తారో ఖచ్చితంగా తెలిసి ఉండాలి.

ఒకవేళ అంతర్జాతీయస్థాయిలో అందరూ ఫాలో అయ్యే "ఫైనల్ డ్రాఫ్ట్" సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి స్క్రిప్టుని రాయగల సామర్థ్యం ఉంటే మరీ మంచిది.

ఈ అవకాశం కేవలం కొత్త/యువ స్క్రిప్ట్ రచయితలకు మాత్రమే అన్న విషయం దయచేసి గమనించాలి. బాగా రాయగల సామర్థ్యం ఉండీ, అవకాశాలు రానివారికి ఇదొక మంచి అవకాశం.

మీదగ్గరున్న స్టోరీలైన్‌లు మాకు నచ్చితే వాటిని తీసుకుంటాము. లేదంటే - మేమిచ్చిన స్టోరీలైన్ మీద మీరు స్క్రిప్ట్ వర్క్ చేసి మీ వెర్షన్ రాయాల్సి ఉంటుంది. ఏదయినా - అశ్లీలం లేని ట్రెండీ యూత్ ఎంటర్‌టైనర్ సబ్జక్టులకే ప్రాధాన్యం.

టైటిల్ కార్డు తప్పక ఇస్తాము. తగిన పారితోషికం కూడా ఉంటుంది. పైన చెప్పిన విధంగా నిజంగా స్క్రిప్ట్ రాయగల సామర్థ్యం ఉండి, ఆసక్తి ఉన్న కొత్త/యువ స్క్రిప్ట్ రైటర్స్‌కి మాత్రమే ఈ అవకాశం అని మరోసారి మనవి. 

మీ పూర్తి బయోడేటా, మొబైల్ నంబర్‌తో వెంటనే సంప్రదించాల్సిన ఈమెయిల్:
mfamax2015@gmail.com 

Monday 5 May 2014

సర్వమ్ ఆధ్యాత్మికమ్!

సుమారు రెండేళ్ల క్రితం - ఇంగ్లిష్‌లో నేనొక స్పిరిచువల్ మెమొయిర్‌ని రాసి, దాన్ని నా కలం పేరుతో పబ్లిష్ చేశాను.

అది పూర్తిగా నా వ్యక్తిగత ఆధ్యాత్మిక నమ్మకాలకు.. నా జీవితంలో జరిగిన కొన్ని అద్భుత సంఘటనలకు సంబంధించిన పుస్తకం. అందులోని కొన్ని ముఖ్యమైన అంశాలు ఎంత రియలిస్టిక్‌గా కనిపిస్తాయో.. అంత నమ్మశక్యం కాని విధంగా ఉంటాయి. కానీ నిజం నిజమే.

పాఠకుల్లో కొందరు - ముఖ్యంగా నన్ను వ్యక్తిగతంగా ఇష్టపడనివారు కొందరు; నాస్తికులు అందరూ.. పుస్తకం చదివాక నన్ను ఎగతాళి చెయ్యొచ్చు. చీదరించుకోవచ్చు. ఎదురుపడితే తిట్టొచ్చు.

మరో కోణంలో.. చాలామంది పాఠకులు బాధపడవచ్చు. కళ్లల్లో నీళ్లు పెట్టుకోవచ్చు. నా చొక్కా పుచ్చుకుని, "అసలు ఎందుకు ఇదంతా అనుభవించావు? మాకెవ్వరికీ ఎందుకు చెప్పలేదు? మేం చచ్చామా?" అని కూడా తిట్టొచ్చు. ముఖ్యంగా నా ఆత్మీయ మిత్రులు.. శ్రేయోభిలాషులు..

నా ఆధ్యాత్మిక నమ్మకాలకు, అనుభవాలకు సంబంధించిన ఇన్ని పార్శ్వాలు ఈ పుస్తకంలో ఉన్నాయి కాబట్టే - (కొన్ని వ్యక్తిగత కారణాలవల్లకూడా) - ఈ పుస్తకాన్ని ముందు నేను నా కలం పేరుతో పబ్లిష్ చేశాను.

అది గతం.

కట్ చేస్తే - 

అసలు ఇప్పుడు నేనున్న సిచువేషన్‌లో ఈ పుస్తకం ప్రసక్తి అంత అవసరమా?

నిజంగా అవసరమే. ఇంగ్లిష్‌లో ఓ సామెత ఉంది.. "మైండ్ చేంజెస్ లైక్ వెదర్!" అని. అప్పుడు ఈ పుస్తకాన్ని కలం పేరుతో పబ్లిష్ చేయడానికే ఎంతో సంకోచించాను. భయపడ్డాను. ఇప్పుడు అదే పుస్తకాన్నినా ఒరిజినల్ పేరుతో బయటికి తేవడానికి సంతోషిస్తున్నాను.

దీని గురించి ఇంకా వివరంగా చెప్పాలంటే - టిమ్ ఫెర్రిస్ గురించి చెప్పాల్సి ఉంటుంది. ఓ అద్భుతమైన అతని కొటేషన్ గురించి చెప్పాల్సి ఉంటుంది. "న్యూయార్క్ టైమ్‌స్ బెస్ట్ సెల్లర్" అవాలన్న లక్ష్యంతో,  మరో నాలుగయిదు నెలల్లో నేను పబ్లిష్ చేయబోతున్న మరో ఆధ్యాత్మిక పుస్తకం గురించీ చెప్పాల్సి ఉంటుంది. ఇదంతా మళ్లీ ఇంకో బ్లాగ్ పోస్టులో చర్చిందుకుందాం.

అంతర్జాతీయంగా ఇప్పటికే ఎన్నో కాపీలు అమ్మకం జరిపిన ఈ పుస్తకం, ఇప్పుడు, నా ఒరిజినల్ పేరుతో మళ్లీ పబ్లిష్ అవుతోంది. యు ఎస్ లో.

వచ్చే జూన్ నుంచి - అమెజాన్‌లో, బార్న్స్ అండ్ నోబెల్లో, ఇతర ముఖ్యమైన ఆన్‌లైన్ అవుట్‌లెట్స్‌లో.. ఆఫ్‌లైన్‌లో కొన్ని ముఖ్యమైన చోట్ల కూడా .. దాదాపు ప్రపంచం అంతా అందుబాటులో ఉండే ఈ పుస్తకం గురించి ఎంత వద్దనుకున్నా, ఎంత డిటాచ్‌డ్‌గా ఉందామన్నా.. కొంత ఎక్‌జైటింగ్‌గానే ఉంది నాకు. 

Friday 2 May 2014

"క్రౌడ్ ఫండింగ్" మనదగ్గర ఎందుకు సక్సెస్ కాదు?

కిక్‌స్టార్టర్, ఇండీగోగో వంటి ఎన్నో సైట్స్ - అమెరికాలోనూ, ఇతర పాశ్చాత్య దేశాల్లోనూ సక్సెస్‌ఫుల్‌గా ఎంతో సెన్షేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఎందరి ప్రాజెక్టులకో ఊహించని స్థాయిలో సపోర్ట్ ఇస్తున్నాయి.

మన దగ్గర ఇలాంటి ప్రయత్నాలు నాలుగయిదు జరిగాయి. ఓ నాలుగయిదు సైట్స్ కూడా వచ్చాయి. బట్.. తుస్సుమన్నాయి. దీనికి కారణాలు అనేకం.

వాటిల్లో కొన్ని కారణాలు :

> మనవాళ్లు రూపాయి పెట్టుబడి పెడితే తెల్లవారే 100 రూపాయలు రావాలనుకుంటారు.

> ఎదుటివారిలోని క్రియేటివ్ ప్యాషన్‌ని అర్థం చేసుకోవాల్సిన అవసరం వీరికి కనిపించదు, లేదు. మన మైండ్‌సెట్స్ అలాంటివి. తప్పేం లేదు.

> ఇంకెవరయినా ఇంట్రెస్ట్ ఉన్నవాడు పెడుతున్నా వద్దని వారిస్తారు. అవసరమయితే, అదే డబ్బుతో ఏ లిటిగేషన్ ఉన్న ల్యాండుకో అడ్వాన్స్ ఇప్పిస్తారు.

> అన్నింటికంటే ముందు.. "అసలు నువ్వు మా డబ్బులు పట్టుకుని ఉడాయిస్తే!?".. అన్న డౌట్ వీళ్లని వెంటాడి వేధిస్తుంది.  

> మన దగ్గర డబ్బులు పెట్టే ప్రతి ఒక్కరికీ కథ చెప్పాలి. అది ప్రతి ఒక్కరికీ నచ్చాలి. క్రౌడ్ ఫండింగ్ కి కనీసం ఒక 100 మంది అయినా అవసరం. అలాంటప్పుడు.. ఏ ఒక్క కథయినా ఆ 100 మందిలో అందరికీ నచ్చుతుందా?

ఇలా చెప్పుకుంటూపోతే బోలెడు..

జస్ట్ ఈ సైట్స్‌ని విజిట్ చేయండి సరదాకి. బయట ఏం జరుగుతోందీ.. మనం ఎక్కడున్నామో.. ఒక ఐడియా వస్తుంది. ఆ అయిడియా మనలో కొందరికయినా అవసరమని నా ఉద్దేశ్యం.

సినిమాలు తీయడం ఒక్కటే కాదు.. ఈ క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఇంకెన్నో కూడా సాధించొచ్చు. అదికూడా మనలో చాలామందికి తెలియాలి. ఎవరు ఏదయినా సాధించొచ్చు..  

చెప్పలేం.. మనవాళ్లలోనూ ఉన్నారు మార్క్ జకెర్‌బర్గ్‌లు!