Tuesday 18 March 2014

ది పవర్ ఆఫ్ పాలిటిక్స్!

నేనెప్పుడూ నా బ్లాగ్‌లో రాసే ప్రతి అంశాన్నీ సాధ్యమైనంత లైటర్‌వీన్‌లోనే రాస్తాను. ఎక్కువ హిట్స్ సినిమాలకు సంబంధించిన పోస్టులకే పడతాయి. వాటిల్లోనూ - ఏ అనుష్కమీదో, దీపికా పడుకొనే మీదో ఓ పోస్టు రాశానంటే ఆ రోజు 1000 హిట్స్ తప్పవు!

కానీ, మొదటిసారిగా, గత 48 గంటల్లో ఒక విచిత్రం జరిగింది..

నోవాటెల్‌లో జరిగిన జన సేన ఆవిర్భావ సభ, ఆ సభలో పవన్ కళ్యాణ్ 2 గంటల సినిమాటిక్ స్పీచ్.. చెప్పాలంటే ఒక యాంగిల్లో సుపర్బ్! ఒక సినిమా టెక్నీషియన్‌గా పవన్‌కు నూటికి నూరు మార్కులు వేస్తాను. ఎవరయినా సరే వేసి తీరాలి.

కానీ, అది మన దేశ రాజకీయ దశ, దిశల్ని మార్చే ధ్యేయంతో ఏర్పాటవుతున్న ఒక కొంగొత్త రాజకీయ పార్టీ పుట్టుకకు సంబంధించిన విషయం కాబట్టి.. కొంచెం సీరియస్‌గా తీసుకోవాల్సివచ్చింది.

దానిమీద నేను రాద్దామనుకున్న బ్లాగ్ పోస్ట్ గురించి అప్పటికప్పుడే ట్వీట్ చేశాను కూడా. అయినా.. ఒక 24 గంటలదాకా ఏం రాయలేదు నేను.

"వదిలేద్దాం.. మనకి ఇంట్రెస్టు లేని సబ్జెక్టుపైన ఎందుకు అనవసరంగా.." అనుకున్నాను.

కానీ, చివరికి రాయాలనే అనిపించింది. రాయకపోవడం తప్పనిపించింది. రాసేసి పోస్ట్ చేశాను. అదే - "జన సేన అధినేతకు 10 ప్రశ్నలు!" 

కట్ టూ "పవర్" పాయింట్ - 

నా బ్లాగ్ కోసం ఓ గెస్ట్ పోస్ట్ రాయమన్నప్పుడు, తను నాకు రాసి పంపిన మొట్టమొదటి పోస్టులో "ఓటు" వాల్యూ గురించి రాశాడు భరత్. ఎలక్షన్ల టైమ్‌లో పోస్ట్ చెయ్యొచ్చులే అని దాన్ని  పక్కనపెట్టాను.

కానీ..

తెల్లారి లేస్తే కాఫీ, న్యూస్‌పేపర్‌తోనో.. టాబ్లెట్టు, ఫేస్‌బుక్‌తోనో ప్రారంభమయ్యే సగటు మనిషి జీవితంలో రాజకీయాలు కూడా ఒక విడదీయరాని భాగం అన్న వాస్తవాన్ని మాత్రం పక్కనపెట్టలేకపోయాను.

మొదటిసారిగా - నేను అసలు రాయడానికే ఇష్టపడని ఈ పొలిటికల్ పోస్ట్‌కి సూపర్ డూపర్ హిట్స్ పడ్దాయి. అదీ గంటకి 100+ వేగంతో!

ఇది నేనే నమ్మలేని నిజం.  

No comments:

Post a Comment