Saturday, 11 January 2014

"1" నేనొక్కడినే ఎందుకు నచ్చింది.. ఎందుకు నచ్చలేదు?

జూబ్లీ హిల్స్, ఫిలిమ్‌నగర్ నుంచి గణపతి కాంప్లెక్స్, క్రిష్ణానగర్ గల్లీలదాకా - నిన్నంతా ఇండస్ట్రీలో ఒకే ఒక్క అంశం పైన చర్చ. ఎక్కువశాతం కాల్స్, ఎస్ ఎం ఎస్ లు, ఫేస్‌బుక్ పోస్టులు, ట్వీట్లు.. అన్నీ ఆ ఒక్క అంశంపైనే.

అది.. "1" నేనొక్కడినే గురించి.

దర్శకుడు సుకుమార్, మహేశ్ కాంబినేషన్ అనగానే అంచనాలు సహజంగానే ఆకాశాన్ని అంటాయి. ఇద్దరూ, ప్లస్ వాళ్ల టీమ్ చాలా కష్టపడ్డారు.. బాగా ఖర్చుపెట్టించారు. బడ్జెట్ ఓ 65 కోట్లదాకా అయ్యిందని అంచనా. తెలుగు సినిమా 100 కోట్ల బిజినెస్‌కు చేరువవుతున్న ఈ సమయంలో 65 కోట్లు ఖర్చుపెట్టడం అంత పెద్ద సమస్య కాదు.


కట్ టూ నాకు ఎందుకు నచ్చింది ఈ సినిమా? 

రామ్‌గోపాల్‌వర్మ ఒక మాట అంటుంటాడు. "నేను తీయాలనుకున్న సినిమా తీస్తాను. మీరంతా ఖచ్చితంగా చూడాలనో, మీరందరూ మెచ్చుకోవాలనో నేను అనుకోను. చుస్తే చూడండి, లేదంటే లేదు. నా సినిమా.. నా ఇష్టం!"

సుకుమార్ అలా అనలేదు, అనలేడు.

కానీ, ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా హాలీవుడ్ స్టయిల్లో స్క్రిప్టు రాసుకొని, కాస్త ఆ స్థాయిలోనే తన సినిమా ఉండాలని చాలా కష్టపడ్డాడు. ఫోటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్ బావున్నాయి. మహేశ్ కమిట్‌మెంట్, కృతి సనన్ ఫ్రెష్‌నెస్.. అంతా ఓకే.

ఒక టెక్నీషియన్‌గా నేను సుకుమార్‌కు, మహేశ్ నిర్ణయానికి ఓటేస్తాను.

ఇంకా చెప్పాలంటే - ఈ చిత్రంలోని కేవలం కొన్ని బ్యూటిఫుల్ షాట్స్ (కంపోజింగ్) చూడ్డం కోసం అయినా సరే.. సినిమా ఒకసారి తప్పకుండా చూడాలంటాను నేను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.


కట్ టూ ఎందుకు నచ్చలేదు?  

అంతా కొత్తవాళ్లతో తీసే బడ్జెట్ లేని చిన్న సినిమాల విషయం వేరు. వాటికి నానా తలనొప్పులు, పరిమితులు ఉంటాయి. అర్థం పర్థం ఉండదు. రకరకాల లెక్కలు, ఈక్వేషన్లతో ఏదో అలా చుట్టిపడెయ్యటమే ఎక్కువగా ఉంటుంది. వీటి విషయం అలా వదిలేద్దాం.

"1" విషయానికొస్తే, అలాంటి ఇబ్బందులు ఏవీలేవు.

భారీ బడ్జెట్ ఉంది. టాప్ రేంజ్ హీరో ఉన్నాడు. టాప్ రేంజ్ టెక్నీషియన్లున్నారు. వీటన్నిటినిమించి.. సుకుమార్ ఆల్రెడీ తన టాలెంట్‌ని బాగా ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్. ఓ కోణంలో చూస్తే.. ఒక డైరెక్టర్‌గా, తను అనుకున్నట్టుగా "1" ని బాగా తీశాడు కూడా.


మరెక్కడ ప్రాబ్లమ్?

రొటీన్ చిత్రాల సొద నచ్చనివాళ్లకు, బాగా చదువుకున్నవాళ్లకు, ఇంగ్లిష్ సినిమాలు ఎక్కువగా చూసేవారికీ, "రిజల్ట్‌తో సంబంధం లేకుండా డైరెక్టర్ తను అనుకున్నది తీశాడు" అని కాన్‌ఫిడెంట్‌గా చెప్పగల సత్తా ఉన్నవాళ్లకు ఈ "1" బాగా నచ్చుతుంది.

అయితే, దురదృష్టవశాత్తూ పైన అనుకున్న కేటగిరీలకుచెందినప్రేక్షకుల సంఖ్య చాలా తక్కువ.

తెలుగు సినిమాలను "హిట్" చేసి, కోట్ల వర్షం కురిపించేది పైవాళ్లెవ్వరూ కాదన్న వాస్తవాన్ని ముందు మనం గుర్తించాలి. వాళ్లు కూడా సినిమాను ఎంజాయ్ చేయగల స్థాయికి మన "హాలీవుడ్ స్క్రిప్టు"ను చేర్చగలగాలి.

దురదృష్టవశాత్తూ అదే జరగలేదు. అక్కడే సుకుమార్, మహేశ్‌ల అంచనా తల్లకిందులయ్యింది బహుశా.

65 కోట్లు ఖర్చుపెట్టి, క్రియేటివిటీపరంగా, ముఖ్యంగా హీరోపరంగా ఎలాంటి పరిమితులు లేనప్పుడు ఈ మాత్రం చేయగలగాలి. చాలా మంది పెద్ద హీరోలు అడుగడుగునా తమ సోకాల్డ్ ఇమేజ్ ని అడ్దం తెస్తూ నానా హింస పెడుతుంటారు డైరెక్టర్లను.  అలాంటి సమస్య మహేశ్‌తో లేదు. అయినా ఈ పొరపాటు జరిగింది!

ఇంకా చెప్పాలంటే - స్వయంగా మహేశ్‌బాబు ఫాన్స్‌లో 90% మందికి ఈ సినిమా నచ్చలేదు. "రెండు వారాల సినిమా" అని థియేటర్ యజమానులనుంచి ఎస్ ఎం ఎస్ లు వచ్చాయి. వాళ్ల జడ్జ్‌మెంట్‌కు తిరుగులేదు!

ఇప్పటికే వచ్చిన నెగెటివ్ టాక్ వల్ల కలెక్షన్ల డ్రాప్ ప్రారంభమయిందనీ, సోమవారం నుంచి అది మరింత డ్రాప్ అవుతుందనీ, ఆ తర్వాత థియేటర్ల డ్రాప్ తప్పదనీ వాళ్ల ఖచ్చితమైన అభిప్రాయం. ఇదీ ఇండస్ట్రీ వాస్తవం..


కట్ టూ ఫినిషింగ్ టచ్ - 

ఓ ఆరు నెలలక్రితం అనుకుంటాను. సినిమాలతో ఏ మాత్రం సంబంధం లేని నా మిత్రుడు ఒకరు ఒక మాటన్నాడు. "మహేశ్-సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న "1" సినిమా.. అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుంది, లేదంటే అట్టర్ ఫ్లాప్ అవుతుంది!" అని.

నా మిత్రుడు చెప్పింది అక్షరాలా నిజమయ్యింది.. 

7 comments:

 1. who knows some times the horse may fly too like sankarabharanam frnd...

  ReplyDelete
 2. కానీ మనోహర్ గారూ. మీ ఫ్రెండ్ చెప్పింది నిజం కాలేదు కదా...
  ఎలాగంటే ఇది సూపర్ డూపర్ హిట్టూ కాదు. అలాగని ఎవరికీ నచ్చక అట్టర్ ఫ్లాప్ కూడా కాదు కదా. కొంతమందికి నచ్చింది కదా. మరీ మీ ఫ్రెండ్ చెప్పింది ఎలా నిజం.
  మీ దృష్టిలో ఈ సినిమా అట్టర్ ఫ్లాపా...?

  ReplyDelete
  Replies
  1. చందు తులసి గారూ!
   థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్.

   నా దృష్టిలోనే కాదు.. మొత్తం ఇండస్ట్రీ దృష్టిలో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్. బిజినెస్ దృష్ట్యా, ఈ సినిమా కలెక్షన్లు మొదటిరోజునుంచే అయ్యాయి! మహేశ్ బాబు విషయంలో ఇది అసలు ఎవ్వరూ ఊహించనిది.

   ఏరియాల వైజ్‌గా ఈ సినిమాను కొనుక్కొని ఆడిస్తున్న వాళ్లందరూ నష్టపోతున్నారు.. అతి దారుణంగా. ఇదంతా నేను వ్యక్తిగతంగా చెప్తున్నది కాదు. థియేటర్స్ నుంచి ఎప్పటికప్పుడు అందుతున్న రిపోర్ట్‌ల ఆధారంగా చెప్తున్నది.

   Delete
  2. Avunu. Ee cinema collections first day nunche drop ayyayi. Theatres kuudaa. Mahesh Babu vishayamlo idi chaalaa aashcharyakaramaina result..

   Delete
 3. అల్లు అర్జున్‌తో ఆర్య-3 అని తియ్యాల్సిన సినిమాని మహేష్‌బాబుతో తీస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. కొంతమంది డైరెక్టర్లు కొంతమంది హీరోలతో ఫిక్స్ అయిపోతారు. సుకుమార్ కూడ అంతే, అల్లు అర్జున్‌తో ఫిక్స్ అయిపోయాడు.

  ReplyDelete
 4. misused the gold star on silver screen with platinum craze in the audience.

  ReplyDelete