Tuesday 10 September 2013

సిల్క్ స్మిత, షకీలాలు కేవలం ఎక్స్‌పోజింగ్ ఐకాన్స్ మాత్రమే కాదు!

అవును. సిల్క్ స్మిత, షకీలాలు ఫిల్మ్ ఇండస్ట్రీలో కేవలం ఎక్స్‌పోజింగ్ ఐకాన్స్ మాత్రమే కాదు! చాలా ఉంది కథ. ఇక్కడో చిన్న బ్రేక్ తీసుకుందాం.

"పేరుకే నీ బ్లాగ్ 'నగ్న చిత్రం.' కనీసం ఒక్కసారయినా ఏ సిల్క్ స్మిత గురించో, షకీలా గురించో రాశావా?" అని నిన్న ఓ మేధావి మిత్రుడు నా దగ్గర సెటైరేశాడు.

ఎలాంటి హిపోక్రసీ, మాస్కులు లేకుండా రియలిస్టిక్‌గా నేను రాయగలిగింది రాయడమే - నగ్నచిత్రం ఉద్దేశ్యం. ఏదయినా సరే. సినిమాలు కావొచ్చు. రచనలు కావొచ్చు. వృత్తి వ్యాపారాలు కావొచ్చు. సంపాదన కావొచ్చు. మానవ సంబంధాలు కావొచ్చు. ఆఖరికి రాజకీయాలు కూడా కావచ్చు.

దురదృష్టవశాత్తూ రాజకీయాలొక్కటే ఈ ప్రపంచంలో నేను బాగా అసహ్యించుకొనే సబ్జెక్టు! కాబట్టి - సాధ్యమైనంతవరకు ఈ బ్లాగ్‌లో పాలిటిక్స్ టచ్ చేయను. చేసి రిస్క్ తీసుకోను. అయినా, ఒకటి రెండుసార్లు ఆ పొరపాటు జరిగింది. బహుశా, మళ్లీ ఆ పొరపాటు చేయననే అనుకుంటున్నాను.

రాజకీయాల మీద నాకు ఇంత అసహ్యం ఏర్పడటానికి ప్రధాణ కారణం - మళ్లీ మన ఇండియన్ పాలిటిక్సే! స్వతంత్రం వచ్చినపుడూ మన దేశం "అభివృధ్ధి చెందుతున్న దేశం." 66 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు కూడా - మన దేశం ఇంకా "అభివృధ్ధి చెందుతున్న దేశమే" కావడం మనం సిగ్గుపడాల్సిన విషయం.

మన దేశంలో వనరులు లేక కాదు. అపరిమితంగా ఉన్నాయి. వాటితోపాటే రాజకీయాలూ ఉన్నాయి. అంతులేని కరప్షన్ మన వాళ్ల జన్మ హక్కు.

మన దేశంలో రాజకీయ నాయకులే అభివృధ్ధి చెందుతారు. వారితోపాటు - వారికి కొమ్ముకాసే కొందరు కుహనా ఇండస్ట్రియలిస్టులు, మరికొందరు వారి చెంచాలు కూడా ఊహించని రేంజ్‌లో అభివృధ్ధిచెందుతారు. దేశం, దేశంలోని సామాన్య ప్రజానీకం విషయంలో మాత్రం ఎలాంటి అభివృధ్ధి ఉండదు.

ఏదో మిరాకిల్ జరిగి - ఒక లేయర్ కొట్టుకుపోతే తప్ప, ఇంకో 100 ఏళ్లయినా అంతే. ఇంకా "అభివృధ్ధి చెందుతున్న" దేశంగానే ఉంటాం మనం.

కట్ టూ మన సిల్క్ స్మితా, షకీలా -

సిల్క్ స్మిత, షకీలాల గురించి నగ్నచిత్రంలో ఏదయినా రాయాలని నా మేధావి మిత్రుడు అనడం సమంజసమే. "ఎక్స్‌పోజింగ్ ఐకాన్స్" గా మన ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్లిద్దరికీ అంత పేరుంది! కానీ, వాళ్లేదో 'నగ్నం' అన్న పదానికి సంబంధించిన "చీప్ సింబల్స్" గా భావిస్తూ చెప్పడమే నాకు నచ్చలేదు.

ఇదే పాయింటాఫ్ వ్యూలో, వాళ్లిద్దరి గురించీ విడిగా రెండు బ్లాగ్ పోస్టులు రాస్తున్నాను. ఏ అర్ధరాత్రో పోస్ట్ చేస్తాను. ఎంజాయ్, మై డియర్ ఫ్రెండ్స్!   

1 comment:

  1. రాజకీయాలు గురించి రాయను అంటూనే ఈ పోస్టులో చాలా రాజకీయాలు రాసారే !?. Any How కరప్షన్ మీద కొన్ని కీ పాయింట్సు( ఒక లేయర్ కొట్టుకు పోవాలి, భారత దేశం ఎప్పటికీ అభువృద్ధి చెందుతున్న దేశమే ... అభివృద్ధి చెందిన దేశం కాదు, ప్రతిదేశంలోనూ కరప్షన్ అనేది రాజకీయాల్లో ఒక భాగం కానీ మన దేశంలో మాత్రం రాజకీయాకు కరప్షన్‌లో ఒక భాగం లాంటివి) రాసారు బావున్నాయి. కరప్షన్‌ను భారతదేశాన్ని విడదీసి చూడడం అసంభవం. అవి సయామీ కవలలు

    ReplyDelete