Thursday, 8 August 2013

ఉదయ భానులో మనం చూడని మరో కోణం!

కొన్ని క్షణాల క్రితమే ఇది చూశాను. యూట్యూబ్‌లో నేనేదో వెతుకుతోంటే అనుకోకుండా ఈ లింక్ కనిపించింది. దీని గురించి అంతకు ముందు కొన్ని రోజుల క్రితం ఎక్కడో ఏదో విన్నాను కానీ, అప్పుడు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు నేను.

ఇప్పుడు మాత్రం చూడగానే ఇలా బ్లాగ్‌లో పెట్టాలనిపించింది. వెంటనే రాయడానికి ఇలా కూర్చున్నాను.

కట్ టూ కాంట్రవర్సీ -

ఇది మా టీవీలోని "రేలా రె రేలా!" ప్రోగ్రామ్‌లో ప్రసారమయింది. ఈ పాటని భాను, వాళ్ల అమ్మ ఇద్దరూ కలిసి రాసి, బాణీ కట్టినట్టుగా తెలుస్తోంది.

ఇప్పటి సమాజంలోని అన్యాయాల్ని, దుష్ట రాజకీయాల్నీ కడిగిపారేసే ఈ పాటలో ఎన్నో ధ్వనులు వినిపిస్తాయి. కొన్ని సూటిగా కూడా ఉంటాయి.

ఇక - ఈ పాటలోని కొన్ని పదాల్ని బహుశా ఇప్పటివరకూ ఏ రచయితా ఉపయోగించే సాహసం చేయలేదు. ఆ సాహసం భాను చేసింది. బాణీ కట్టింది. పాడింది.

ఇప్పటివరకూ భానుని ఒక యాంకర్‌గా, ఒక నటిగా, డ్యాన్సర్‌గా చూశాము. 'రేలా రే రేలా' వంటి ప్రోగ్రాముల్లో  పాటలు కూడా పాడింది. కానీ ఇంత గాఢమైన సీరియస్‌నెస్ ఉన్న పాటను మాత్రం ఇంతవరకూ టచ్ చేయలేదు ఉదయ భాను.

సుమారు ఓ 3 నెలల క్రితం - మేం అనుకున్న ఒక మైక్రో బడ్జెట్ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రతో పాటు, ఒక పాట కోసం కూడా ఉదయ భానుని తీసుకోవాలనుకున్నాను. ఆమెకు అతి దగ్గరయిన ఒక సోర్స్ ద్వారా ప్రయత్నించటం కూడా  జరిగింది. ఉదయ భానుతో అగ్రిమెంట్ కూడా అయిపోయేదేమో బహుశా. కానీ, ఇంతలో మా ప్రాజెక్ట్‌లోనే బోల్డన్ని మార్పులు చేర్పులు జరిగాయి. ఇక ఆ విషయం పక్కన పెట్టేశాం.

ఉదయభాను గురించి రక రకాల కామెంట్స్ సినీ, టీవీ ఇండస్ట్రీల లోపలా, బయటా మనకు వినిపిస్తాయి. కొన్ని నిజ జీవిత వాస్తవాలు కూడా ఉండవచ్చు. ఒకవేళ ఏవయినా వ్యక్తిగ విషయాలున్నా మనకు వాటితో పనిలేదు. ఉండకూడదు కూడా. ఇండస్ట్రీలో కానీ, ఇంకెక్కడయినా కానీ - కొంచెం యాక్టివ్‌గా, ఫాస్ట్‌గా కనిపిస్తే చాలు. ఏవేవో కథలు అళ్లేస్తారు. అదంతా మామూలే. ఒక మాస్క్ అని నా ఉద్దేశ్యం.

ఇండస్ట్రీలో నిలదొక్కుకోడానికి కొన్ని మాస్కులు ధరించక తప్పదు.

కట్ టూ భాను రూట్స్ -

అయితే, ఆ మాస్క్ వెనక, తన అసలు రూట్స్ మర్చిపోని ఉదయభాను విశ్వరూపమే ఈ పాట. నా వ్యక్తిగత ఉద్దేశ్యం ప్రకారం, భాను ఏదో ఒక హల్ చల్ కోసం ఈ పాటని క్రియేట్ చేయలేదు. అంత అవసరం ఆమెకు లేదు. రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే తను ఈ పాట పాడకుండా కూడా వెళ్లవచ్చు. ఆమె కోరుకుంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఆమెను ఇట్టే చేర్చేసుకుంటుంది.

భానుకి అంత పాప్యులారిటీ ఉంది!


ఇంకో విధంగా చెప్పాలంటే, ఇలాంటి పాటలు పాడటం అనేది, సాఫీగా, బాగా నడుస్తున్నతన  కెరీర్‌ని తానే పాడుచేసుకోవటం అవుతుందన్నది కామన్‌సెన్స్. అయినా, ఉదయభాను పాడింది. ఇది తన హృదయంలోంచి వచ్చిన పాట అని నాకనిపించింది. అందుకే నగ్నచిత్రంలో దీన్ని పోస్ట్ చేస్తున్నాను.

పాట పూర్తయ్యాక - భానుని అభినందిస్తూ తమ్మారెడ్డి భరద్వాజ, అనంత శ్రీరామ్, వందేమాతరం, గోరటి వెంకన్నల కామెంట్స్ కూడా ఆర్టిఫీషియల్ అని నేను అనుకోవడం లేదు. అంతగా పొగడాల్సిన అవసరం వారిలో ఏ ఒక్కరికీ లేదు.

'రాకాసి బల్లులంతా రాజ్యమేలే రాజులంటా'.. పాటనిండా ఇలాంటి వర్డింగ్స్ బోలెడన్ని ఉన్నాయి. వినండి పాట. చూడండి భాను ఫీలింగ్స్..  

7 comments:

 1. ఉదయభాను ఒక హృదయభాను!బోలెడు potential ఉన్న ప్రౌఢ!కొంచెం కొంచెం వయసు పైబడుతున్నా తన ఆకర్షణ కోల్పోకుండా ఇప్పటికీ నిలబెట్టుకుంటూ రంగురంగుల పూరి విప్పిన నెమలి!ఆమెను కొత్తకోణం లోంచి చూసి,ఆమెలోని సరికొత్త facet ను,నైపుణ్యాన్ని వెలికితీశారు మనోహర్ గారు!

  ReplyDelete
  Replies
  1. థాంక్ యూ, సూర్య ప్రకాశ్ గారు. మీ "హృదయ భాను" ప్రయోగం అద్భుతం. మీ కామెంట్స్ లోనూ కవిత్వం ఉంటుంది!

   Delete
 2. భానూలో ఇంత ఆవేదన దాగుందని నాకు ఆరోజే తెలిసింది . ఏప్పుడూ నవ్వుతూ హడావిడిగా కనిపించే భానూకు సమాజం పట్ల , సమాజంలో జరుగుతున్న దారుణాల పట్ల స్పందించే మనసుందని ఆరోజే అర్దమైంది . "గద్దెనెక్కే గాడ్దె కొదుకులు" అనేంత దమ్మన్న కలాన్ని అభినందించకుండా ఎలా ఉండగలం !

  ప్రతి మనిషిలో లోలోపల అంతర్లీనంగా ఒక విస్పోటనం దాగి ఉంటుంది . అవసరాలకోసమో లేదా అవకాశాలకోసమో అది అణచబడుతుంది . మీభాషలో చెప్పాలంటే ఒక మాస్కు మన ఆవేశాన్ని ఆపేస్తుంది . కానీ మనసు మనమాట విననప్పుడో లేక కళ్ళముందర మరిచిపోలేని దారుణాలు జరిగినప్పుడో అది కట్టలు తేంచుకుంటుంది . మన రాజకీయ వ్యవస్త కూడా దనికి ఒక ప్రధాన కారణం అని నిస్సందేహంగా చెప్పవచ్చు .

  "వయసు మళ్ళిన ఎముకలు కుళ్ళిన సోమరులారా చావండి" అని శ్రీశ్రీ అందుకే రాజకీయ వ్యవస్తని ఆరోజుల్లొనే తూలనాడారు . యువకులు యన్నాళ్ళవరకూ కార్పోరేట్ మాయలో , పబ్ కల్చర్లో పడి ఆనందిస్తుంటారో , ఎప్పటి వరకూ ఈ దేశం నాది , తగ్గిపోతున్న విలువలకీ , అణగారిపోతున్న మానవత్వానికి అడ్డుపడి దేశాన్ని కాపాడుకోవాలి అనీ ముందుకురారో , అప్పటివరకూ ఈ దేశం ఇలాగే ఉంటుంది .

  కానీ ఈమద్యకాలంలో యువత స్పందిస్తున్న తీరు చూస్తుంటే ఆరొజు ఎంతోదూరంలో లేదనిపిస్తోంది . ఈదేశం మాది . మా యువతరానిది . ఖచ్చితంగా మేం మాదేశాన్ని కాపాడుకుంటాం ..... జై హింద్

  ReplyDelete
  Replies
  1. మీ కామెంట్ చాలా బాగుంది. థాంక్స్, ప్రదీప్!

   Delete
 3. epudu vachindi progaram cheppagalara. udayabhanu garu relarelare progaramme pi naaku chala manchi hopes unnai nenu aa roj ela miss ayyano .

  ReplyDelete
  Replies
  1. నాకు కూడా తెలియదు ఎప్పుడు వచ్చిందనేది. ఒక రోజు నేను యూట్యూబ్‌లో దేనిగురించో చూస్తుంటే ఇది కనిపించింది. వెంటనే బ్లాగ్‌లో పెట్టేశాను. బ్లాగ్‌లో పెట్టిన తర్వాత కూడా రెండు మూడు సార్లు మాటీవీలో ఈ ప్రొగ్రాం మళ్లీ రావడం చూశాను.

   Delete