Thursday 25 July 2013

కవిత్వం రాసే మన తెలుగు హీరోయిన్ ఎవరో మీకు తెలుసా?

నిదురిస్తున్న హృదయాన్ని
నీ వైపు లాగింది నీవేగా!

నా నీడయినా నువ్వే అయి
నన్ను నేను మరిచానే

వొద్దు వొద్దని నువ్వన్న
వలపే పుట్టింది నీ మీద

అప్పుడు పంచిన నీ మనసే
ఇవ్వనని అనవొద్దు

నాలో ఉన్న నా ప్రాణం
నువ్వయి నిలిచావు

కాదు కాదని నీవన్నా
కాదనలేకున్నా..
కన్నీటి కడలిలో నేనున్నా...

***

కొన్ని నమ్మటం కష్టం. అలాంటిదే మొన్నొకటి జరిగింది.

చాలామంది తెలుగు హీరోయిన్లు తెలుగుని ఎంత స్టయిలిష్‌గా మాట్లాడతారో అందరికీ తెలిసిందే. అసలు తెలుగు రానట్టే నటిస్తారు. లేదంటే, ఓ అయిదారు ఇంగ్లిష్ పదాల మధ్య ఒక తెలుగు పదాన్ని అలా పడేస్తూ స్టయిలిష్‌గా మాట్లాడుతున్నామనుకుంటారు.

అలాంటి మాస్కులేవీ లేకుండా తీయటి తెలుగులో మాట్లాడిందా అమ్మాయి. ఆ అమ్మాయి మాట్లాడుతున్నంతసేపూ హాయిగా విన్నాను. ఆ అమ్మాయి మాటల మధ్యలో, కేవలం కవిత్వం రాయగలవాళ్లు మాత్రమే మాట్లాడే శైలిని గుర్తించాను.

అవును. నేను ఊహించింది నిజమే. ఆ అమ్మాయి అప్పుడప్పుడూ కవిత్వం కూడా రాస్తుందట!

ఆ అమ్మాయి మన తెలుగు హీరోయిన్. ఆమె నటించిన తొలి సినిమానే పెద్ద హిట్. అయినా ఎందుకో వెనకే ఉండిపోయింది! పైన మీరు చదివిన కవిత ఆ హీరోయిన్ రాసిందే..

ఇంతకీ ఎవరా హీరోయిన్? ఎందుకని వెనకపడిపోయింది? ఇప్పుడు మళ్లీ ఎలా ముందుకు దూసుకొస్తోంది?
ఆసక్తికరమయిన ఎన్నో వివరాలతో - ఈ ఆదివారం, ఇదే బ్లాగ్‌లో,  "షాట్ బై షాట్"లో కలుద్దాం. 

8 comments:

  1. Thanks for your invitation. I will do it today.

    ReplyDelete
  2. ఇది నిజం గా ఎవరో రాసిన కవితా లేక 'ఆరు ' సినిమా లో పాటా !?
    నాకు సందేహమే !

    ReplyDelete
    Replies
    1. "ఆరు" సినిమా పాటలు నేను వినలేదు. ఒకవేళ మీరు చెప్పింది నిజమే అయితే దయచేసి నాకు ఆ పాట లింక్ పంపించండి. దాన్ని అలాగే మాధవీలతకు పంపిస్తాను.

      Delete
  3. నేను సాధారణంగా పాటల్లోని లిరిక్స్ బాగా గమనిస్తాను, నచ్చినవి గుర్తు పెట్టుకుంటాను. అలా పైన కవిత చదవగానే ఒక సినిమా పాట గుర్తు వచ్చింది. అంతే తప్ప ఎవరినీ అనటానికి కాదండీ. అయినా స్పందించినదుకు కృతజ్ఞతలు !

    ReplyDelete
  4. ivaite aaru cinemaa lo "choododde..nanu choododde.."song lirics..konchem maarcharu ante..

    ReplyDelete
    Replies
    1. రాధిక గారూ! ఆరు సినిమాలో మీరు చెప్పిన ఆ పాట లిరిక్స్ ని పంపించగలిగలరా? దాన్ని అలాగే ఇక్కడ కామెంట్స్‌లో పబ్లిష్ చేస్తాను..

      థాంక్స్ ఫర్ యువర్ కామెట్స్.

      Delete
    2. మనోహర్ గారూ..
      ఆ Lyrics నేను post చేస్తున్నాను.

      "చూడొద్దే నను చూడొద్దే చురకత్తిలాగ నను చూడొద్దే
      వెళ్ళొద్దే వదిలెళ్ళొద్దే మది గూడు దాటి వదిలెళ్ళొద్దే
      అప్పుడు పంచిన నీ మనసే అప్పని అనవద్దే
      ఇప్పుడు పెరిగిన వడ్డీతో ఇమ్మని అడగొద్దే

      వద్దూ వద్దంటూ నేనన్నా వయసే గిల్లింది నువ్వేగా
      పో పో పొమ్మంటూ నేనున్నా పొగలా అల్లింది నువ్వేగా
      నిదరోతున్న హృదయాన్ని లాగింది నువ్వేగా
      నలుపై వున్న రాతిరికి రంగులు నువ్వేగా
      నాతో నడిచే నా నీడ నీతో నడిపావే
      నాలో నిలిచే నా ప్రాణం నువ్వయి నిలిచావే

      వద్దూ వద్దంటూ నువ్వున్నా వలపే పుట్టింది నీ పైన
      కాదు కాదంటూ నువ్వున్నా కడలే పొంగింది నాలోన
      కన్నీళ్ళ తీరంలో పడవల్లే నిలిచున్నా సుడిగుండాల శృతిలయలో పిలుపే ఇస్తున్నా
      మంటలు తగిలిన పుత్తడిలో మెరుపే కలుగును లే
      వొంటిగ తిరిగిన ఇద్దరిలో ప్రేమే పెరుగునులే

      'ఆరు ' సినిమా లో ఈ పాట కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

      Delete
    3. థాంక్ యూ, రాధిక గారు!
      ఇంక దీని గురించి నేను ఏమీ ప్రత్యేకంగా రాయటం లేదు.
      పాఠకులకే వదిలేస్తున్నాను.

      Delete