Tuesday 11 June 2013

అప్పటి డాన్స్‌మాస్టర్ ఇప్పుడు డైరెక్టర్! ('కల' ట్రివియా-5)

నిక్సన్ మంచి డాన్స్ మాస్టర్, మంచి ఫ్రెండు కూడా. "కల" తర్వాత, మా టీమ్‌లో ఎక్కడివాళ్లక్కడ గప్‌చిప్ అయిపోయారు. టీమ్‌లో నన్ను గుర్తుపెట్టుకొని వచ్చి మరీ నాతో సమయం గడిపింది ఎవరన్నా ఉన్నారంటే.. అది నిక్సన్ ఒక్కడే!

ఆ సాయంత్రం నాకింకా గుర్తుంది. మా ఇంటికి వచ్చి, తాజ్ ట్రైస్టార్ లో ఉన్న "బ్లాక్‌బస్టర్" పబ్‌కు నన్ను తీసుకెళ్లాడు నిక్సన్. అక్కడే కెమెరామన్ సెంథిల్ పరిచయమయ్యాడు. ముగ్గురం కాసేపు సరదాగా మాట్లాడుకున్నాం. నిక్సన్ నన్ను ఆ రోజు బయటికి తీసుకెళ్లిన పర్పస్ కూడా అదే. కాసేపు అన్నీ మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేయటం ..

ప్రారంభంలో మాతో గొడవ పెట్టుకుని డాన్సర్స్ యూనియన్ దాకా వెళ్లాడు నిక్సన్. తర్వాత అతనే మంచి ఫ్రెండయ్యాడు. చివరికి, అతన్నే మూడు పాటలు చేయటానికి మారిషస్ తీసుకెళ్లాం. మారిషస్ షూటింగ్‌లో ఉన్న ఆ రెండు వారాల్లో - అక్కడ అన్నిరకాలుగా బాగా ఎంజాయ్ చేసిన ఒకే ఒక్కడు నిక్సన్ మాత్రమే! మారిషస్‌లో మేము  షూటింగ్ ఎప్పుడు ఎక్కడ చేస్తున్నా.. ప్యాకప్ సమయానికి, ప్రతిరోజూ ఎవరో ఒక లోకల్ మారిషస్ అమ్మాయి నిక్సన్ కోసం కాచుకుని ఉండేది. ఇలా ప్యాకప్ చెప్పటం ఆలస్యం.. ఇద్దరూ క్షణంలో మాయమైపోయేవాళ్లు!

అంతకు ముందే నిక్సన్ కొన్ని సినిమాలు చేసినా - అవి బయటికి వచ్చి, అతనికి బాగా పేరు తెచ్చిన సినిమాల్లో "కల" కూడా ఒకటి. ఆ తర్వాత - హీరో రాజా నుంచి, సూపర్ స్టార్ మహేష్ బాబు వరకు దాదాపు అందరు హీరోలకి డాన్స్ మాస్టర్‌గా పని చేశాడు నిక్సన్.

అప్పటి ఆ నిక్సన్ ఇటీవలే డైరెక్టర్ కూడా అయ్యాడు.     

1 comment:

  1. జరిగింది జరిగినట్లు record చేస్తే భవిష్యత్తులో చరిత్రకెక్కుతుంది!ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు ఏ నిక్సన్ లో ఏ నృత్య దర్శకుడున్నాడో తెలియదు!అవకాశం ఇవ్వడమే మీ వంతు అందిపుచ్చుకొని అమాంతం ఎదిగిపోవడం కళాకారుల వంతు!

    ReplyDelete