Wednesday 5 June 2013

ఆ జ్ఞాపకాలింకా పదిలంగానే ఉన్నాయి! ("కల" ట్రివియా-1)

"కల" సినిమా రిజల్టు విషయం పక్కన పెడితే.. ఆ సినిమా నేపథ్యంగా నేను దాచుకున్న మధుర స్మృతులు అనేకం. తొమ్మిదేళ్లయినా ఆ జ్ఞాపకాల ఫ్రెష్‌నెస్‌ని ఈ రోజుకూడా నేను ఫీలవుతూనే ఉన్నాను.

ఒక్క బ్లాగ్ పోస్టులో అవన్నీ రాయటం చాలా కష్టం కాబట్టి.. ఈ పోస్టుతోపాటు, కనీసం ఇంకో రెండు పోస్టుల్లో "కల" తాలూకు ఆ ట్రివియాని కొంతయినా మీతో పంచుకోవాలనిపిస్తోంది.

కట్ టూ హీరో రాజా -

ఇప్పుడు మా మధ్య అంత క్లోజ్‌నెస్ లేకపోయినా - కల ప్రీప్రొడక్షన్ సమయంలోనూ, షూటింగ్ జరుగుతున్నన్ని రోజులూ, ఆ తర్వాత సినిమా రిలీజయ్యేవరకూ.. హీరో రాజా తో ముఖ్యంగా నాకు, మా టీమ్ కి ఎన్నో మంచి మెమొరీస్ ఉన్నాయి. వాటిల్లో కొన్ని..

> మారుతీ వ్యాన్‌లో మౌంట్ ఒపెరాకు వెళుతూ/వెళ్లాక (డాన్స్ మాస్టర్ నిక్సన్ తో కలిసి) నేను, రాజా పార్టీ చేసుకోవటం.
> ప్యారడైజ్ చౌరస్తా నుంచి  నేను, రాజా అలా నడుచుకుంటూ వెళ్లి ఒక హోటల్లో లంచ్ చేయటం. అప్పటికే రాజా మూడు సినిమాలు చేసి ఉన్నాడు! (ఓ చినదానా, అప్పుడప్పుడు, విజయం)
> షూటింగ్ కోసం మారిషస్ కు రెండు వారాలు వెళ్లినప్పుడు, ఒక టీం మెంబర్‌గా ఎలాంటి ఈగో లేని అతని కోపరేషన్.
> కెమెరా లెన్సులున్న బరువైన బాక్స్‌ని తన తలమీద పెట్టుకొని, టీమ్‌తో పాటు కనీసం ఒక మైలు దూరం సముద్రం అంచులవెంట రాళ్లమీద నడవటం.
> కాల్షీట్ టైమింగ్స్ లేకుండా, మారిషస్‌లో చాలా సరదాగా ఆడుతూ పాడుతూ షూటింగ్‌లో పాల్గొనటం, అందర్నీ ఉత్సాహపర్చటం.
> షూటింగ్ సమయంలో, బీచుల్లోని వేడికి బాగా నల్లబడిన నా ముఖానికి తనదగ్గరున్న కాస్మెటిక్స్ ఏవేవో పూసి, రాజా స్వయంగా ఫేషియల్ చేయటం.
> "మనోహర్ గారూ.. డైరెక్టర్ గారూ" అంటూ, ఇంగ్లిష్ యాక్సెంటుతో కూడిన తనదైన వాయిస్‌తో గౌరవంగా పిలవటం.
> అన్నపూర్ణ స్టూడియోలో ఒక మంచి ఎమోషనల్ సీన్  చేస్తున్నపుడు చనిపోయిన వాళ్ల అమ్మగారు గుర్తుకొచ్చి కన్నీళ్లు పెట్టుకోవటం. ఆ ఉద్వేగంలోనే, సెట్లో ఒక మూలన ఉన్న నా దగ్గరకు వచ్చి  "మీతో ఇంకో సినిమా తప్పకుండా చేస్తాను" అని చెప్పటం.
> దాదాపు ప్రతి షాట్‌నీ సింగిల్ టేక్‌లో చేయాలన్న తపనతో ఎప్పుడూ ఉండటం, అలా చేయటం.
.. ఇలా ఇంకో వంద చెప్పగలను రాజా గురించి .

నాకు యాక్సిడెంట్ జరగడానికి ముందు, సుమారు ఏడాదిన్నర  క్రితం, ది సేమ్ రాజాని మణికొండలోని తన కొత్త ఇంట్లో కలిశాను. అదే పలకరింపు. అదే మర్యాద. అదే చిరునవ్వు. కానీ, ఏదో చిన్న గ్యాప్. అదెలా క్రియేటయ్యిందో నాకయితే గుర్తు లేదు.

"సినిమాల్లో నేను డబ్బు సంపాదించలేదు. పోగొట్టుకున్నాను. ఇప్పుడు సినిమాలు చేయాలన్న అవసరం కూడా  లేదు నాకు. లైఫ్ చాలా హాయిగా ఉంది.." అన్నాడు క్రైస్తవ మత ఉపన్యాసకుడుగా ప్రస్తుతం బిజీగా ఉన్న రాజా. రాజాకు సేవాభావం ఎక్కువ. ఈ మధ్యే ఒక ఫౌండషన్ కూడా ప్రారంభించాడు.

ఐ విష్ హిమ్ ఎవ్రీ సక్సెస్ అండ్ ఆల్ హాప్పినెస్ ఇన్ లైఫ్ ..     

2 comments:

  1. ఒక సినిమా విఫలమయినంత మాత్రాన దాని తాలూకు స్మృతులు ఎండిపోతాయా?బిడ్డ చచ్చినా పురుటి కంపు పోదు కదా జయాపజయాలను సమదృష్టితో తీసుకునేవాడే సినిమా రంగంలో చివరివరకు మిగులుతాడు!స్మృతులు తీపివయినా చేదువయినా ఎప్పటికప్పుడు అక్షరరూపం ఇచ్చి పదిలపరచడం మంచిది!

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పింది నిజం. ఏవి మారినా జ్ఞాపకాలు మారవు. థాంక్ యూ ఫర్ యువర్ కామెంట్స్.

      Delete