Sunday 19 May 2013

ప్రతి మనిషికీ రెండో వైపు కూడా ఉంది !


బ్లాగ్ రాయటం కష్టం కాదు. కానీ, నలుగురి గురించి ఆలోచించి బ్లాగ్ రాయాలంటేనే చాలా కష్టం. చిన్నప్పటినుంచీ మనం పెరిగిన వాతావరణంలో మనకు జరిగిన కండిషనింగునుబట్టి.. ప్రతిదానికీ "ఎవరు ఏమనుకుంటారో" అని ఓ తెగ ఇదయిపోతాం.

మొన్న ఒక మీటింగ్ కోసం గ్రీన్ పార్క్ లో కూర్చున్నాము. ఎటు చూసినా - ప్రతి టేబుల్ దగ్గారా ఏదో సీరియస్ డిస్కషన్. అంతలోనే నవ్వులూ, కేకలూ, కేరింతలు!

నిన్న సాయంత్రం మరొక మీటింగ్ కోసం యాత్రినివాస్ లో కూర్చున్నాము. అక్కడా అంతే. ప్రతి టేబుల్  దగ్గరా కొంపలు మునిగిపోతున్న సీరియస్‌నెస్! అంతలో చాయ్‌లూ, డ్రింకులూ, అన్నీ..

ఈ రోజు ఉదయం. మా ఇంటికి దగ్గర్లో ఇరానీ హోటెల్. నేను యూనివర్సిటీలో చదివినప్పటినుంచీ నాకు ఇరానీ హోటెల్ కల్చర్ ఎందుకో బాగా అలవాటయిపోయింది. ఏ మాత్రం వీలున్నా, నేను కంఫర్టబుల్ గా ఫీలయ్యే ఫ్రెండ్ ఒక్కరు ఎవరయినా ఉంటే చాలు .. నేను గబుక్కున ఇరానీ హోటెల్లో దూరిపోడానికే ఇష్టపడతాను.

అక్కడా అంతే! ప్రతి టేబుల్ దగ్గరా ఏదో అలజడి. ఏదో అసంతృప్తి. మళ్లీ అంతలోనే సిగరెట్లూ, చాయ్‌లూ, నవ్వులూ, అరుపులూ, కేకలూ..

కట్ టూ రియాలిటీ -

ఎవరు ఏ స్థాయిలో ఉన్నా, ఎంత హ్యాప్పీగా తుళ్లిపడుతూ బయటికి కనిపించినా .. అదంతా నాణేనికి  ఒక వైపే. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికీ రెండో వైపు కూడా ఉంది. అవి మానవ సంబంధాల సమస్యలు కావొచ్చు. అప్పులు కావొచ్చు. ప్రొఫెషనల్ చాలెంజెస్ కావొచ్చు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ సమస్య అనేది ఏదో ఒక రూపంలో ఎప్పుడూ ఉంటుంది..ఉండక తప్పదు. ఎందుకటే ఇది లైఫ్.

నిజానికి లైఫ్ చాలా చిన్నది. మనకు తెలిసి ఈ జీవితం ఒక్కటే. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో, ఏమయిపోతారో చెప్పలేని సిచ్యువేషన్స్ వస్తాయి. ఇంత మాత్రం దానికి.. మన మధ్య ఇన్ని ఈగోలు, ఇన్ని అనవసరపు ఫీలింగ్స్, బిల్డప్పులు, పనికిరాని కవరప్‌లూ, మాస్కులూ  అవసరమా?

లైఫ్ చాలా సింపుల్.  మనమే దాన్ని కాంప్లెక్స్ చేసుకుంటున్నాం ..

3 comments:

  1. `లైఫ్ చాలా సింపుల్. మనమే దాన్ని కాంప్లెక్స్ చేసుకుంటున్నాం ..`ఇది నిజం.

    ReplyDelete
  2. లైఫ్ చాలా చిన్నది అని తెలిసికూడా, ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో, ఏమయిపోతారో తెలియని స్థితిలొ అనవసరపు ‘ఈగో’ ల తొ ఆనందమయ జీవితాల్ని నాశనం చెసుకొంటున్నాము. మీరు ఆన్నదాంట్లొ నూటికి నూరుపాళ్ళు నిజం..నిజం..

    ReplyDelete