Friday 19 April 2013

100,000 విజిటర్స్ అంత కష్టం కాదు!


నేను గత ఆగస్టులో ఈ బ్లాగ్ ప్రారంభించాను. తర్వాత, బహుశా డిసెంబర్లో అనుకుంటాను... దీనికి బ్లాగ్ విజిటర్స్ మీటర్ ఒకటి తగిలించాను చూద్దామని.

సుమారు నాలుగు నెలల్లో 33,000 దాటింది. నాట్ బ్యాడ్! :)

100,000 విజిటర్స్ ను ఈ బ్లాగ్ కు  రప్పించటం అంత కష్టం ఏమీకాదు. అయితే అది అనుకున్నంత సులభం కూడా కాదు. రెగ్యులర్ గా రాయటం అనేది అప్పుడు తప్పనిసరి అవుతుంది. రాయాల్సిన టాపిక్‌లు కూడా చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాల్సి ఉంటుంది.

ఏది ఏమయినా, ఈ "నగ్న చిత్రం" చాలా సులభంగా లక్ష విజిటర్స్ మైలు రాయిని అతి త్వరలోనే దాటుతుందని నాకు అనిపిస్తోంది. నాకు తెలిసి ఒక్క బ్లాగ్ పోస్ట్ తో ఆ అంకెను దాటవచ్చు. కానీ, లక్షమందిని అట్రాక్ట్ చేసే ఆ టాపిక్ ఏంటి అన్నదే మిలియన్ డాలర్ ప్రశ్న!

ఇప్పుడున్న సినిమా బిజీలోనూ ఈ బ్లాగ్‌లో ఏదో ఒకటి రాసే ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఇది చాలదు. నా ఆలోచనలను పంచుకోటానికీ, వాటిని అమలు చేయటానికీ ఈ బ్లాగే నా ప్లాట్‌ఫాం. ఈజీగా ఎలా తీసుకుంటాను?!

కట్ చేస్తే -

ఆదివారం ఆఫీసులో పూజ. "యురేకా సకమిక" కాస్టింగులో ఊహించనంత ఆలస్యం జరుగుతోంది. అదే పెండింగ్ లేకపోతే - ఆదివారం అన్నపూర్ణలో సినిమా ఓపెనింగ్ ఉండేది!

కొత్త వారితో సినిమాలకు ఇదివరకటిలా ముంబై హీరోయిన్లకోసం వెళ్లటం లేదు ఎవ్వరూ. అందరూ తెలుగు అమ్మాయిలే కావాలంటున్నారు! ఒకరకంగా ఇది మంచి పరిణామం. కానీ, మనవాళ్లు ముంబై అమ్మాయిల రేంజ్‌ను మించి రెమ్యూనరేషన్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రాబ్లెం అంతా అక్కడే వస్తోంది.

విసుగొచ్చిందా, మళ్లీ అందరూ "చలో ముంబై" అంటారు. తప్పదు. అలా జరగదనే ఆశిద్దాం.

8 comments:

  1. All the best for your upcoming movie.

    ReplyDelete

  2. రెమ్యూనరేషన్ రేంజ్ ముంబైని గుర్తు తెస్తుంది ,
    కానీ ఆ రేంజ్ లో వీళ్ళు చూపించలేరుగా ,
    అందుకే మనవాళ్ళు ఆ రెమ్యూనరేషన్ యీయకుండా
    వేరే స్టేట్ వాళ్ళవైపు మొగ్గు చూపటానికిదే కారణం.
    అయితే హీరోయిన్లు చూపించాలనేం కోరటం లేదు
    తెలుగు ప్రేక్షకులు .
    నిర్మాతలే కాష్ చేసుకోవాలనుకుంటున్నారు .
    మీ భవిష్యత్తు 3 పువ్వులూ , 30 కాయలతో కళ కళ లాడాలని ఆశిస్తున్నాను.

    నా బ్లాగు : నా ఆలోచనల పరంపర

    ReplyDelete
    Replies
    1. థాంక్ యూ సో మచ్, శర్మ గారు! సహృదయులు... మీలాంటివారి ఆశీస్సులతో నేను అనుకున్నదాంట్లో కొంతయినా సాధిస్తానని నా నమ్మకం. థాంక్స్ వన్స్ అగెయిన్!

      Delete
  3. Hello....

    Good to see your blog & your thoughts ....when someone says telugu heroines are demanding on par vth Bombay heroines...I get a doubt....how are our heroines of AP less proficient than other state heroines...what is wrong if they demand ? Do we feel our girls are not worthy enough ? Do we get satisfied if a huge sum is offered to non AP girls.....is it that we have a low impression of our girls ? When we happily pay fat purses to others why cant we be generous to our state girls ?

    ReplyDelete
  4. Hello Manoharji....

    I always have a question in mind...plz dont think otherwise for asking this way....when we are ready to squander money on Bombay heroines why cant we be generous to our AP girls ? What is the eligibility criteria ? to be on par vth the Bombay girls to get a fat/fatted purse ?

    ReplyDelete
    Replies
    1. Hello Lakshmi Bhogaraju,
      Thanks for your comments. I agree with you 100%.
      Still.. I think, I should write a detailed blog post to clarify couple of your doubts. :)

      Delete
  5. Hope, this post will clarify everything...

    http://nagnachitram.blogspot.in/2013/04/blog-post_27.html

    ReplyDelete