Tuesday 1 January 2013

హేపీ న్యూ ఇయర్!

హీరో శివాజీ తో తెలుగులో ఒక చిత్రం చేశాను. తెరవెనక జరిగింది వేరు. అది వేరే విషయం.

వివిధ
కలం పేర్లతో డైరెక్ట్ గా ఇంగ్లిష్ లో కొన్ని  డిజిటల్/కిండిల్  బుక్స్ ని "అమేజాన్" కోసం రాసాను. ఫారిన్లో ఆవి బాగా సేల్ అవుతున్నాయి. రాయాల్టీ కూడా ప్రతీ నెల నా అకౌంట్లో డైరెక్ట్ గా పడిపోతోందిఇంకా "ఫైవర్", “క్లిక్ బ్యాంక్” వంటి సైట్స్ లో కూడా హాబీ కోసం ఏవేవో చేస్తున్నాను. ఆదాయం డైరెక్టుగా నా పేపాల్ అకౌంట్లోకి ముందు, తర్వాత నా హైదరాబాద్ బ్యాంక్ అకవుంట్లోకి నేరుగా వచ్చి పడుతున్నాయి.

ఇన్
ఫర్మేషన్ మార్కెటింగ్ లో ఎక్స్ పర్ట్ నయ్యాను. ఫీల్డులో చాలా మందికి (ఫారిన్ లో) ఒక పెయిడ్ "మెంటర్" గా కూడా పనిచేస్తున్నానుకొంత రిలీఫ్

ఎప్పట్లాగే మరొక సంవత్సరం గడచిపోయిందిగొప్పగా సాధించినవి ఏవీ లేవు …

2012 లో, నేను నేర్చుకున్న పాఠాలు  మాత్రం చాలా ఉన్నాయి. రకంగా చూస్తే - 2012 ఒక గురువుగా,నేను పాఠాలనయితే తప్పనిసరిగా నేర్చుకొని తీరాలో” వాటిని నేర్పించింది. సో, 2012 కు నా బిగ్ థాంక్స్ చెప్పక తప్పదు

2012 లో నేను ప్రధానంగా నేర్చులున్న పాఠాలు రెండు:

1. నా స్టీరింగ్ వేరొకరి చేతికి ఇచ్చి, నేను అనుకున్నట్లుగా గమ్యం చేరుకోవాలనుకోవడం చాలా పెద్ద తప్పు. పాఠం ద్వారా నేను నేర్చుకొన్న నీతి ఏంటంటే, ఇక ముందు చిన్న విషయానికయినా సరే ఒకరి మీద ఆధార పడవద్దు.

2. అప్పులో, ఇతర కమిట్మెంటులో అందరికీ ఉంటాయి. ట్రిలియన్ల డాలర్ల అప్పున్న అమెరికా నుంచి, బిలియన్ల డాలర్ల డాలర్ల అప్పున్న మన ఇండియా దాకా అన్ని దేశాలకూ, అందరికీ ఏదో రూపంలో అప్పులు/కమిట్మెంట్ లు ఉన్నాయి. టాటా, బిర్లాలు, అంబానీలయినా - వారికి వ్యక్తిగత సంపద ఎంత ఉన్నా - వారందరి వ్యాపార వ్యవహారాల్లో వారెన్నో వందల వేల కోట్లు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బ్యాంకులకు అప్పు ఉన్నారు. సో, అప్పుల గురించి అంత బాధ పడాల్సిన పని లేదు.

బిసినెస్
ఈజ్ బిజినెస్. మనం ఎవరినీ చీట్ చేయనంతవరకూ, చేయాలనుకోనంతవరకూ నో ప్రాబ్లమ్. బిజినెస్ లలో ఆటు పోట్లు సహజం. వాటిని తట్టుకుని ముందుకు పోవటమే మనం చేయాల్సిన పని. ముందు మనం అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేసుకుంటూ పోతే - మనీ అదే మన వెంట పడుతుంది. అప్పుడు అప్పులు అవే అదృశ్యమవుతాయి

మన టెన్షన్ అంతా మన ప్రధాన లక్ష్యం పైన ఉండాలి తప్ప - మనల్ని వేటాడుతున్న కష్టాల మీద, కమిట్ మెంట్ల మీద ఉండకూడదు.

2012 జనవరి 4 అర్థరాత్రి జరిగిన యాక్సిడెంట్, సర్జరీలు, ఆ తర్వాత సుమారు 9 నెలల బెడ్ రెస్ట్... నన్నూ, నా ఆలోచనా ధోరణినీ, నా దృక్పథాన్నీ సమూలంగా మార్చివేశాయి. 

ఇంతకుముందులాగా - ఇప్పుడు నేను ఎన్నో పడవల మీద కాళ్లు పెట్టట్లేదు. నా ఇతర వ్యాపకాలన్నింటికీ విరామం ఇచ్చేసి, కనీసం ఒక సంవత్సరం పాటు నా పూర్తి ఫోకస్ ని సినిమా మీదే పెడుతున్నాను. మ్యాజిక్ 
ఏంటంటే, ఇలా నిర్ణయం తీసుకున్న తర్వాత నుంచీ అసలు సీనే మారిపోయింది. అన్ని పనులూ నాకు అనుకూలంగా చక చకా జరిగిపోతున్నాయి!

ఒక విధంగా - ఇది నా ఫిలిమ్ కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్. ఈ విషయంలో నాకున్న రిసోర్సెస్ అన్నిటినీ ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. నా నెట్ వర్క్ నంతా వినియోగించుకోవాలనుకుంటున్నాను.

2013 లో కనీసం 3 మైక్రో బడ్జెట్ సినిమాలను తీస్తాను. నా ముందు చేతులు కట్టుకుని నిల్చోవటానికి కూడా అర్హత లేని కొంతమంది మనుషులను నమ్మి, నేను కోల్పోయిన సమయాన్ని వెనక్కి తెచ్చుకోలేను. కానీ, నేను కోల్పోయిన డబ్బునీ, అన్నింటినీ మించి, నేను కోల్పోయిన నా క్రియేటివ్ ఫ్రీడమ్ నీ మళ్లీ నా చేతుల్లోకి తెచ్చుకుంటాను.

హేపీ న్యూ ఇయర్ ...   

1 comment:

  1. మంచిది.. "గతకాలము మేలు వచ్చుకాలం కంటెన్" అన్న నన్నయ్య వాక్యాన్ని తిరగ రాసి, "వచ్చుకాలము మేలు గతకాలం కంటెన్" అని నిరూపిస్తావని కొరుకుంటూ..నిరూపించాలని ఆశిస్తూ.. "నూతన సంవత్సర శుభాకాంక్షలతో"
    -- దయానంద్ రావ్.

    ReplyDelete