Wednesday 21 November 2012

నా మినీ లేబొరేటరీ


గత ఆగస్ట్ లో - బ్లాగ్ ను నేను ముందుగా మొదలెట్టిన ఉద్దేశ్యం వేరు. తర్వాత, రెండు మూడు నెలల్లోనే, రెండు మూడు మలుపులు తిరిగి, చివరికి ఇదే నా పర్సనల్ బ్లాగ్ అయిపోయింది.

ముందు సినిమాల కోసమే అనుకున్నాను. సినిమాలకు సంబంధించిన అంశాలే ఇందులో రాశానుతర్వాత, కేవలం టిట్ బిట్స్ లాగా చిన్న చిన్న బ్లాగ్ పోస్టులు మాత్రమే రాయాలనుకున్నాను. తర్వాత, నాకు రాయాలని అనిపించిన ప్రతీదీ ఇందులో రాయటం మొదలెట్టాను. ఇంక మార్పులేం లేవు. ఉండవు. నేను ఏం రాయాలనుకున్నా... నా మిత్రులు, శ్రేయోభిలాషులు, బ్లాగ్ రీడర్స్ తో ఏం షేర్ చేసుకోవాలనుకున్నా ... చివరికి, నాకు నేను ఏదయినా గట్టిగా చెప్పుకోవాలనుకున్నా - ఇక ఇదే నా తెల్ల కాగితం

"నా జీవితాన్ని నేను సృష్టించుకుంటాను!" ...  "జీవితంలో ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది!" ...

రెండూ రెండు విభిన్న అలోచనా విధానాలు. భూమ్యాకాశాల అంతరం ఉన్న రెండు భిన్న ధ్రువాలు. ప్రపంచ వ్యాప్తంగా కాలమాన పరిస్థితుల్లోనయినా ప్రధానంగా రెండు అలోచనా విధానాలే కొనసాగుతుంటాయి. మొదటి వ్యక్తి జీవన వాహనానికి సంబంధించిన "స్టీరింగ్" అతని చేతుల్లోనే ఉంటుంది. రెండో వ్యక్తి తన స్టీరింగ్ ను గాలికి వదిలేస్తాడు. దేని ఫలితం ఎలా ఉంటుందో ఎవరయినా  ఇట్టే ఊహించవచ్చు. ప్రస్తుతం నా స్టీరింగ్ మళ్లీ  నాచేతుల్లోకి తీసుకున్నాను. కొంచెం ఆలస్యంగా.

సామర్థ్యం ఉన్నప్పుడు మరింతగా ఎదగడానికి ప్రయత్నించడం, మరింత ఉన్నతమైన జీవనశైలిని కోరుకోవటం తప్పు కాదు. అసంతృప్తితో బాధితుడుగా మిగిలిపోవటమా, సంతృప్తితో అనుకున్నస్థాయికి ఎదగడమా అన్నది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. " రోజు నేనిలా ఉండటానికి నూటికి నూరు పాళ్లూ బాధ్యుడిని నేనేఅని స్వీయ విమర్శ చేసుకోవడం అనేది ఎప్పుడయినా సరే, జీవితంలో ఒక మంచి మలుపుకి కారణమవుతుంది. ప్రస్తుతం అలాంటి ఒక మలుపుకి దగ్గరలో ఉన్నాను

ఇలాంటి సమయంలో, ఎల్లవేళలా నాకు అతి సమీపంలో ఉండి, నాకు అవసరమయిన కంపెనీ ఇస్తున్న నేస్తాలు ప్రస్తుతం నాకు రెండున్నాయి. ఒకటి - ఫేస్ బుక్. రెండవది - నగ్నచిత్రం, నా బ్లాగ్.

ఫేస్ బుక్ లో ప్రపంచం చూస్తున్నాను. ప్రపంచంలో నన్ను చూసుకుంటున్నాను. నగ్నచిత్రం లో నన్ను నేను చూసుకుంటున్నాను. నాలో ఉన్న నన్ను ని విశ్లేషించుకుంటున్నాను.

ఈ కొత్త నేస్తాలతో ప్రస్థానం చేస్తూ - నా
ఐడియా మజిల్ ను మరింత శక్తివంతం చేసుకుంటున్నాను. ఈ ప్రస్థానంలో నా సినిమా ప్రొఫెషన్ అనేది కేవలం ఒక అతి చిన్న భాగం మాత్రమే.  

3 comments:

  1. బానే ఉంది కానీ, మీ బ్లాగ్ background వేరేదైన ఐతే చదవడానికి ఇబ్బంది అనిపించదు. బహుశా మి ఆలొచన/మనసు ఎదో ప్రతిబింబించేలా background లో ఈ చిత్రాన్ని పెట్టి ఉండవచ్చు. కాని చదవడానికి కాస్త ఇబ్బందిగానే ఉంది.

    ReplyDelete
  2. బ్లాగర్ వాళ్లు రూపొందించిన టెంప్లేట్ ఇది. బ్యాక్ గ్రౌండ్ మార్చాలన్న ఆలోచన నాకు ఇప్పటివరకు రాలేదు. ఎవరూ కూడా ఈ విషయం గురించి ఇంతవరకు నాతో అనలేదు - చదవటానికి ఇబ్బంది అవుతుంది అని. తప్పకుండా ఆలోచిస్తాను. థాంక్ యూ.

    ReplyDelete
  3. ఆహ్లాదకరమైన వైట్ బ్యాక్‌గ్రౌండ్‌తో బ్లాగ్ టెంప్లేట్ మార్చాను. ఇది బానే ఉన్నట్టుంది చూస్తుంటే.

    ReplyDelete