Saturday 6 October 2012

ఆత్మీయ నవోదయమ్ - 2

ఫేస్ బుక్ లో నా వాల్ ఫోటో కి చాలా ప్రాధాన్యమిస్తాను నేను.

సాధారణంగా
ఎప్పుడూ సముద్రమే ఉంటుంది అక్కడ. నాకు సముద్రమంటే చాలా ఇష్టం. ప్రస్తుతం స్థానాన్ని నవోదయలో నా సన్మానం ఫోటొ ఆక్రమించింది.

ఇది
సన్మానం మీద మోజుతో చేసిన పని కాదు. నాకు అత్యంత ప్రియమైన నా నవోదయ విద్యార్థుల ఆనందం, ప్రేమ సన్మానంలో ఉంది. అనుభూతిని కనీసం కొన్ని రోజులయినా నెమరువేసుకోవాలన్నది నా తాపత్రయం.

ఒక భారీ యాక్సిడెంట్ కారణంగా, సుమారు 8 నెలల బెడ్ రెస్ట్ తర్వాత - సర్జరీ అయిన కాలుతో, మొట్టమొదటిసారిగా ఫంక్షన్లోనే నేను బాగా నడిచాను.

నవోదయ
సిల్వర్ జుబ్లీ కాకుండా, మరేదయినా, వెళ్లటం ఇట్టే ఎగ్గొట్టేసేవాణ్ణి. ఇప్పుడు అనిపిస్తోంది .. మరే కారణంతోనో నేను ఫంక్షన్ కు వెళ్లకపోయి ఉన్నట్లయితే నిజంగా చాలా మిస్ అయ్యేవాణ్ణని.

ఫంక్షన్లో అపర్ణ అనే ఒక జూనియర్ బ్యాచ్ విద్యార్థిని నా దగ్గరకు వచ్చి పలకరించడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. అలా ఇంకెందరో జూనియర్ బ్యాచ్ ల  స్టూడెంట్స్ నన్ను ప్రత్యేకంగా కలిసి విష్ చేయటం ఒక మంచి అనుభూతి.

ఖచ్చితంగా
ఇదంతా ఫేస్ బుక్ పవర్. కాని, దానికి 'బేస్' మాత్రం నా నవోదయ బ్యాక్ గ్రౌండేనని నేను ఒప్పుకోక తప్పదు

అలాగే - నేను నవోదయలో పనిచేసినపుడు - అప్పటి తొలి నాలుగు బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ నాకు తెలుసు. వాళ్లళ్లో చాలా మంది ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. కొందరయితే మరీ పెద్దవాళ్లయిపోయినట్లుగా కనిపించారు. అదొక్కటే కొద్దిగా ఫీలయ్యాను నేను.

వాళ్లందరితో
పోలిస్తే, ఇంకెంత పెద్దవాణ్ణయిపోయుంటాను నేను? :)

ఇదిలా ఉంటే - చాలా మంది జూనియర్ బ్యాచ్ విద్యార్థులు నా దగ్గరకు వచ్చి, నన్నూ అప్పటి పాత స్టూడెంటే అనుకొని, "అన్నా! నీది బ్యాచ్?" అని అడిగారు!

నా
పక్కన ఫస్ట్, సెకండ్ బ్యాచ్ స్టూడెంట్స్ ఉండగా ప్రశ్న నన్ను ఎందరో అడిగారు. ఒకసారి రాజా కూడా నా పక్కనే ఉన్నాడు!

నాతో
వచ్చిన మా పెద్దబ్బాయి ప్రణయ్ సీన్లని బాగా ఎంజాయ్ చేసాడు.

అంతేనా - ఫస్ట్ బ్యాచ్ లోని మరొక "ఆల్ రౌండర్" లక్ష్మీ కవిత కూడా అమెరికా నుంచి ఫేస్ బుక్ లో ఒక కామెంట్ పెట్టింది - "మీరేంటి ఇంకా అలానే ఉన్నారు! వాటీజ్ సీక్రెట్?" అంటూ.

నిజానికి అలాంటిదేమీ
లేదు. నేనూ చాలా మారిపోయాను.

ఇకమీదట ప్రతి సంవత్సరం - డిసెంబర్ ఫస్ట్ సండే ని పాత విద్యార్థులందరూ నవోదయలో కలుసుకొనే  రోజుగా పాటించనున్నారని రాజా చెప్పాడు.

చాలా
మంచి ఆలోచన.

పాత
జ్ఞాపకాలు, స్నేహమే కాదు .. రోజుల్లో నెట్ వర్కింగ్ కి కూడా చాలా ప్రాధాన్యముందిఅదే విధంగా,  హైదరాబాద్ లో కూడా ఎక్కువమంది పాత విద్యార్థులున్నారు కాబట్టి - వీరంతా కూడా అప్పుడప్పుడూ "మినీ మీట్" లా యేదయినా ప్లాన్ చేసుకుని కలిస్తే బావుంటుంది. ఇదే విషయం నేను సి హెచ్ వి కె ఎన్ ఎస్ ఎన్ మూర్తి, బేబీ  మొదలైన వారికి చెప్పాను.

ఇక
విదేశాల్లో ఉన్న నవోదయన్స్ వచ్చినపుడు కూడా - హైదరాబాద్ లో ఉన్నవాళ్లతో ఒక చిన్న "గెట్ టుగెదర్" ప్లాన్ చేసుకోవచ్చు. ఇలాంటి గెట్ టుగెదర్లలో ఇక్కడే ఉన్న నాలాంటి వాళ్లను కలుపుకొంటే మరింత ఆనందం. :)

ఇవన్నీ ఇలా ఉంటే - హైదరాబాద్ లోనూ, గుంటూరులోనూ ఏర్పాటుచేయదల్చిన హాస్పిటల్స్ కు సంబంధించిన ఆలోచన నిజంగా ఒక గొప్ప ఆలోచన. లక్ష్మినారయణ (PET)గారితో పాటు మరికొందరిని గౌరవ సలహాదారులుగా పెట్టుకొని, విషయంలో కూడా ఎంత త్వరగా ముందుకు నడిస్తే అంత బావుంటుంది. దేశంలోనే ఇంకెందరికో మార్గదర్శులయిన ఘనత గుంటూరు నవోదయన్స్ కే దక్కుతుంది.

అలా
దక్కాలన్నదే నా కోరిక.

No comments:

Post a Comment