Wednesday 26 September 2012

మద్దిరాల స్మృతులు


అనుకోకుండా కొన్ని జరుగుతాయంటారు. నిజమేననిపిస్తుంది నాకిప్పుడు...

ఫేస్ బుక్ ను నేను పెద్దగా పట్టించుకోలేదు ఎప్పుడూ. కాని,  మధ్యే దానికి రెగ్యులర్ యూజర్ అయిపోవాల్సి వచ్చింది. వృత్తిపరంగా నాకు అవసరమైన నెట్ వర్క్ ను క్రియేట్ చేసుకోచేసువటానికి పని తప్పనిసరి  అయిపోయింది నాకు

 ట్రాక్ అలా నడుస్తుండగానే -

అనుకోకుండా - భరత్, ఉష, విద్య, రాజా, చైతన్య, మస్తాన్, దిలీప్, కవిత .. ఇలా ఒక్కొక్కరే కనెక్ట్ అవటం ప్రారంభమయింది. సుమారు రెండు దశాబ్దాల క్రితం - గుంటూరు లోని మద్దిరాలలో నేను పనిచేసిన జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థులు వీరంతా!

ఇదిలా
కంటిన్యూ అవుతుండగానే ఒక రోజు - అనుకోకుండా - అప్పటి నా నవోదయ కలీగ్, ఫ్రెండ్ PLN కూడా FB లో కనెక్ట్ అయ్యాడుఇది నేను అస్సలు ఊహించనిది. అప్పటి మా విద్యార్థుల గురించి, వారు యెవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు .. అన్నీ చెప్పాడు నా మిత్రుడు PLN.  ఇంకెన్నో విశేషాలు  ఫేస్ బుక్ నెట్ వర్క్ ద్వారా నేనే స్వయంగా తెలుసుకున్నాను. చాలా సంభ్రమానికి గురయ్యాను. దాదాపుగా అందరూ మంచి పొజిషన్ కి వెళ్లారు

డాక్టర్లు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, లెక్చరర్ లు, యస్ లు, బిజినెస్ మాగ్నెట్ లు, ఎం ఆర్ ఓ లు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ  .. ఇలా ప్రభుత్వ ప్రయివేట్ రంగాలకు చెందిన దాదాపు ప్రతి చోటా మంచి పొజిషన్స్ కి వెళ్లారు. అప్పటి రాజా ఇప్పుడు 'డాక్టర్ రాజా' (డెంటిస్త్రీ పీజీ) అయ్యాడు. ఇంకా - సురేష్, ఉష, విద్య మొదలయిన వాళ్లెందరో మంచి డాక్టర్లయ్యారు.  భరత్, కవిత, విద్య, కస్తూరి .. ఇంకా ఎందరో అమెరికాలో ఉన్నారు.

ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో, అప్పుడు పొట్టి నిక్కర్లు వేసుకుని నవోదయ కారిడార్లలో తిరిగిన సజ్జా సాంబశివరావు ( శాం సజ్జా) ఇప్పుడు UK లో పని చేస్తూనే స్వంత కంపెనీ కూడా పెట్టాడు. త్వరలోనే ఇక్కడ భారీ వెంచర్లు ప్రారంభించే అలోచనలో ఉన్నాడు.  అప్పటి నవోదయ 'ఆల్ రౌండర్' భరత్ ప్రస్తుతం అమెరికాలోని 'నార్త్ కెరోలినా' లో పనిచేస్తున్నాడు. భరత్ మనసులో చాలా మంచి అలోచనలున్నాయి. అతను త్వరలోనే ఇండియా వచ్చి ఆ పనులకు స్వీకారం చుట్టబోతున్నాడు. ఇవన్నీ, ప్లస్ ఇంకా యెన్నో  తెలిసి, నిజంగా 
చాలా హాప్పీగా ఫీలయ్యాను.

అప్పటి  ఆ పాత విద్యార్థులంతా - వారు చదివిన జవహర్ నవోదయ విద్యాలయలో 'సిల్వర్ జుబ్లీ' పేరుతో ఒక భారీ గెట్ టుగెదర్’ ఇప్పుడు యేర్పాటు చేస్తున్నారు.  ఆ ఫంక్షన్ నెల 29, 30 తేదీల్లో.

విద్యార్థులే అన్ని ఖర్చులూ పెట్టుకుని, ప్రారంభం నుంచి ఇప్పటివరకు మద్దిరాల నవోదయలో పని చేసిన ప్రతి టేచర్ నూ, ప్రతి ఉద్యోగినీ ఫంక్షన్ కు ఆహ్వానిస్తున్నారు. యెవరు యెక్కడెక్కడ ఉన్నది ఆరా తీసి మరీ పని చేస్తున్నారు. అందరికీ కుటుంబ సమేతంగా టికెట్స్ కూడా వాళ్లే బుక్ చేస్తున్నారు! ఇతర అన్ని  ఏర్పాట్లూ విద్యార్థులవే!!

ఇంతటిటో అయిపోలేదు. ఈ నవోదయ 'అలుమ్ని’ ప్లాన్ చేస్తున్న ఇంకొక భారీ ఆలోచన గురించి విన్న తర్వాత ఎవరైనా  'హాట్స్ ఆఫ్' అనాల్సిందే. ఆ విషయం గురించి మరో సారి రాస్తాను.

సో, ఇటీవలి కాలంలో నన్ను అమితంగా ప్రభావితం చేసిన ఈ న్యూస్ ఇలా వుంటే – అనుకోకుండా, వ్యక్తిగతంగా నాకింకో విషయం గుర్తుకొచ్చింది.

ఈ 'గెట్ టుగెదర్'కి అటెండ్ కావటం కోసం, 28 న బయలుదేరాల్సిన నేను - ఇప్పుడు ఒక రోజు ముందే .. అంటే, 27 కే బయల్దేరుతున్నాను. ఎందుకు? సరిగ్గా 23 ఏళ్ల క్రితం - ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ నుంచి ఇదే సెప్టెంబర్ 27 వ తేదీ నాడు నేను గుంటూరు బయల్దేరి వెళ్లి, 28  సెప్టెంబర్ ఉదయం 11 గంటలకి మద్దిరాలలోని నవోదయ విద్యాలయలో ఉద్యోగంలో చేరాను! అది నా రెండో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.

అనుకోని సంఘటనలు జరగటం అంటే ఇదేనేమో ..

సరిగ్గా 23 యేళ్ల తర్వాత - వృత్తిపరంగా ఒక మధురమైన 'ఫ్లాష్ బ్యాక్'కి తెర లేచింది. ఇప్పుడు మళ్లీ ఆ క్యాంపస్ ను చూస్తాను. ఆ పరిసరాల్ని చూస్తాను. అప్పుడప్పుడూ సాయంత్రం పూట  నేనూ ఇంకొక మిత్రుడు (ఐజాక్) కలిసి  ఫిషింగ్ చేసిన ఆ మద్దిరాల కాలువనీ చూస్తాను. అప్పటి నా విద్యార్థుల్నీ, నా కలీగ్స్ నీ కలుస్తాను.

ఈ ఫీలింగే యెంతో బాగుంది. ఒక విధంగా నన్ను నేను మళ్లీ స్వీయ విమర్శ  చేసుకొనే అవకాశమిచ్చింది.  ఇదంతా అనుకోకుండానే జరిగింది.  

ఎపిసోడ్ అంతటికీ మూల కారణమయిన  నవోదయ మద్దిరాల విద్యార్థులకూ - అక్కడే వుండి, ఈ సిల్వర్ జుబిలీ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లనూ తన భుజం మీద వేసుకొని పనిచేస్తున్న నాకత్యంత ప్రియమైన విద్యార్థి డాక్టర్ రాజశేఖర్ బాబు, నాగరాజు, రమాదేవి మొదలైన అందరికీ  'హ్యాట్స్ ఆఫ్' చెప్పకుండా ఎలా ఉండగలను?


2 comments:

  1. Sir..wonderful emotional journey through your writing.

    I am eager to see a movie from you in family genre filled with melody songs...

    ReplyDelete
  2. Thanks, Sajja my dear for your comment.

    Movie.. hummm .. can't tell in near future as our Tollywood filmmakers' targets are peculierly different, from person to person. And to be frank, making Telugu movies isn't my ultimate creative goal.

    ReplyDelete