Friday, 25 July 2025

🎬 Where Creativity Meets Land!


A Creative Escape Near Hyderabad — Just 70 km Away!! 

Writers, directors, actors, musicians, and creative souls —
Imagine your own peaceful weekend retreat…
A place for story sittings, music sessions, or just recharging your soul in nature. 🌿

Welcome to  Green Leaves Infratech’s Gated Farmland Project near Sadashivpet —
With river views, fresh air, and total tranquility near Singur Dam.


✅ Perfect for film & TV folks
✅ Build your own farmhouse
✅ Grow your own food
✅ Weekend escapes or creative hideouts
✅ Great land appreciation (2–3x in just a few years)

Surrounded by booming zones — NIMZ, IIT, Woxsen, ORR, RRR & top MNCs —
This is not just a getaway… it's a goldmine.

📲 WhatsApp me (text only) for a personal site visit & special deal: +91 99895 78125

— Manohar Chimmani
Writer | Film Director | Investment Advisor
MD, Swarnasudha Projects Pvt Ltd (GLIT Group)


🎬 Because the best scripts begin on solid ground. 

Wednesday, 23 July 2025

- - - ప్రయివేట్ లిమిటెడ్! టోటల్ సినిమా!


సరిగ్గా ఒక రెండేళ్ళు. 
రైటింగ్, సినిమాలు. 
పూర్తి ఫోకస్ ఈ రెండింటి మీదే.
ఇంకేం లేదు. 

సో, ఈ క్షణం నుంచే నా టార్గెట్స్‌కు ఏ రకంగానూ సంబంధంలేని విషయాల మీద నా సమయాన్ని వెచ్చించటం మానుకుంటున్నాను. ఆల్రెడీ మానుకున్నాను. 

సోషల్ మీడియా అయినా, ఇంకేదైనా - నా టార్గెట్స్ రీచ్ కావడానికి ఉపయోగపడే పనే పని. ఇంకేదీ పని కాదు. 

బ్లాగ్ కూడా ఎక్కువగా రాయలేకపోవచ్చు. నా ప్రొఫెషనల్ ప్రోగ్రెస్‌కు సంబంధించిన అప్‌డేట్స్ కోసం తప్ప బ్లాగ్ వైపు బహుశా రాకపోవచ్చు.    

కట్ చేస్తే - 

"ఎర్ర గులాబి" పోస్ట్ ప్రొడక్షన్‌లో అందరం బిజీగా ఉన్నాము. తర్వాతి సినిమా (కామెడీ-రొమాంటిక్-హారర్) ప్రిప్రొడక్షన్ పని కూడా నడుస్తోంది. 

ప్రయివేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ సన్నాహాలు జరుగుతున్నాయి. మిత్రులు ఆవైపు బిజీగా ఉన్నారు. 

మరోవైపు ఇంకో యజ్ఞం కూడా పెట్టుకున్నాను. సంకల్పం ఉంటే ఏదీ దేనికీ అడ్డం కాదు అని మనకంటే ముందు ఎందరో ఎన్నెన్నో సాధించి చూపించారు. మేం కూడా మా షేర్ సాధించుకుంటాం. పీరియడ్.     

When in Rome, do as the Romans do.
100% professional.
Rock solid. Renegade spirit.

I know it’s hard — but I’m here to rise, rock, and make it happen.

- మనోహర్ చిమ్మని 

100 Days. 100 Posts. 100/100. 

సిటీకి దూరంగా "క్రియేటివ్ స్పేస్!"


ఫిలిం/టీవీ/వెబ్ సీరీస్ డైరెక్టర్స్, యాక్టర్స్, రైటర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, ఇతర క్రియేటివ్ రంగాల్లోని వారందరికీ - స్క్రిప్టులు రాసుకోవడం, స్టోరీ సిట్టింగ్స్, మ్యూజిక్ సిట్టింగ్స్, ప్రొడక్షన్ ప్లానింగ్స్ వంటి పనుల కోసం ఎలాంటి డిస్టర్బెన్స్‌లేని మంచి క్రియేటివ్ స్పేస్‌ చాలా అవసరం!    
 
గేటెడ్ కమ్యూనిటీ ఫామ్‌లాండ్స్ అనేవి ఈ విషయంలో ఒక కొత్త సొల్యూషన్!   

GREEN LEAVES INFRATECH LIMITED వారి గేటెడ్ కమ్యూనిటీ ఫామ్‌లాండ్స్ అలాంటిదే!  

సదాశివపేట, సింగూర్ డ్యామ్‌కు దగ్గరలో - ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, మంజీరా నది వ్యూతో అద్భుతంగా ప్లాన్ చేసిన ఈ వెంచర్‌ను - సినీఫీల్డు, టీవీ ఫీల్డు, ఇతర క్రియేటివ్ రంగాల్లోని ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, రైటర్స్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఒకసారి విజిట్ చేసి నిర్ణయం తీసుకోవచ్చు.

జస్ట్ సినిమా-టీవీవాళ్ళనే కాదు... నేచర్‌కు దగ్గరగా, జీవితాన్ని ఆర్టిస్టిక్‌గా ఎంజాయ్ చెయ్యాలనుకొనే అందరికీ "వీకెండ్ క్రియేటివ్ డెస్టినేషన్స్‌"గా కూడా ఈ గేటెడ్ కమ్యూనిటీ ఫామ్‌లాండ్స్ బాగా ఉపయోగపడతాయి.


మనకు నచ్చిన డిజైన్‌లో ఓ చిన్న ఫామ్‌హౌజ్ వేసుకొని, మనకిష్టమైన వెజిటబుల్స్, ఫ్లవర్ ప్లాంట్స్, గ్రీనరీ పెంచుకొంటూ, మనకు అవసరమైనప్పుడు గాని, వీకెండ్స్ గాని అక్కడ గడపగలిగితే చాలు... లైఫ్ నిజంగా ఇంకో లెవెల్లో ఉంటుంది.

సిటీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఫామ్‌లాండ్ ప్రాజెక్టు, ముంబై హైవేకు కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేవలం 15 నిమిషాల దూరంలో సంగారెడ్డి జిల్లా హెడ్‌క్వార్టర్స్, 30-45 నిమిషాల దూరంలో RRR (Regional Ring Road) & ORR (Outer Ring Road) ఉన్నాయి.   

13,000 ఎకరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన NIMZ (National Investment & Manufacturing Zone) ప్రాజెక్టు, MRF, పెన్నార్, పెప్సికో, BHEL, KIRBY, తోషిబా, ఎక్స్‌పోర్ట్ కారిడార్, MNR మెడికల్ కాలేజి, IIT, Gitam, Woxsen యూనివర్సిటీలు... TCS, Wipro, ISB, Microsoft, Google వంటి గొప్ప గొప్ప సంస్థలన్నీ ఈ వెంచర్‌కు 45 నిమిషాల పరిధిలో ఉన్నాయి. 


ఆసక్తి వున్న సినీ-టీవీ ఫీల్డు, ఇతర క్రియేటివ్ రంగాలవాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియావాళ్ళు డైరెక్ట్‌గా నాకు మెసేజ్ చేయొచ్చు. మీ సైట్ విజిట్ నేను ఏర్పాటు చేస్తాను. నావైపు నుంచి పర్సనల్‌గా మీరూహించని స్పెషల్ ఆఫర్ ఇప్పిస్తాను.  

ఇంకేం ఆలోచిస్తున్నారు?
ఈరోజే ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్ తీసుకోండి.

After all, the best investment on Earth is land.

- మనోహర్ చిమ్మని 
MD, Swarnasudha Projects Pvt Ltd
Under GLIT Group
Whatsapp (text): 9989578125  

100 Days, 100 Posts. 99/100.

Tuesday, 22 July 2025

రక్తం రుచి మరిగిన ప్రేక్షకులు!


ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్న 99 శాతం సినిమాల నిండా కత్తులు, కొడవళ్ళు, గన్స్, ఇంకా కొత్త కొత్త రకాల మారణాయుధాలతో నిజంగా రక్తాన్ని ఏరులు పారిస్తున్నారు. సర్ర్... సర్ర్ మని నరికి పోగులు పెడుతున్న శబ్దాలతో సినిమా హాల్స్ షేక్ అయిపోతున్నాయి. 

ఒక్క థియేటర్స్‌లోనే కాదు, ఓటీటీల్లో కూడా ఈ బ్లడ్‌షెడ్ క్రైమ్ సినిమాలకే వ్యూయర్‌షిప్ ఎక్కువగా ఉంటోంది. 

హీరోలు, డైరెక్టర్స్ వారి ఒక్కో సినిమాకు ఈ బ్లడ్‌షెడ్ లెవల్స్‌ని ఇంకా ఇంకా పెంచుకుంటూ పోతున్నారు. ఆఖరికి ఇలాంటి సినిమాలు తీసే పోటీ ఎక్కడిదాకా వెళ్ళిందంటే - ఇలాంటి రక్తప్రవాహపు సీన్లల్లో రోజుల పసికందును కూడా చంపడానికి పెట్టి తమాషా చూసే సైకిక్ మైండ్‌సెట్ లెవెల్ దాకా!     

ఇలాంటి రక్తపాతం లేని సినిమాల్ని ప్రేక్షకులు తిప్పికొడుతుండటం ఆశ్చర్యం. 

ఈమధ్యనే వచ్చిన ఒక సూపర్ నీట్ సినిమాలో కూడా "ప్రొడ్యూసర్-డిస్ట్రిబ్యూటర్స్-బిజినెస్" అవసరాల దృష్ట్యానో, లేదంటే "నేనూ రక్తం ఏరులు పారించగలను" అన్నది చెప్పడానికో గాని, ఆ సినిమాలో కూడా ఒక సీన్లో నరకడాలు, రక్తాలు బాగానే చొప్పించగలిగాడు డైరెక్టర్.       

ఆ సినిమా కూడా హిట్ అయింది. 

ఇష్టం ఉన్నా లేకపోయినా డైరెక్టర్స్ అందరికీ ఇప్పుడిదే ట్రెండ్.

ట్రెండ్ ఫాలో కాకపోతే వచ్చిన అవకాశం పోతుందన్న భయం! డైరెక్టర్‌గా వెనకబడిపోతున్నా అనుకుంటారేమోనన్న భయం!   

గమనించారో లేదో... ఇలాంటి సినిమాల ప్రభావం సమాజంలో చాలా ప్రస్పుటంగా కనిపిస్తోంది. లెక్కలేనన్ని మర్డర్ వారలు రోజూ చూస్తున్నాం. భార్యని భర్త, భర్తని భార్య, తల్లిని కూతురు, తండ్రిని కొడుకు... ఇలా చాలా సింపుల్‌గా చంపేసుకుంటున్నారు. 

సినిమాల వల్ల ప్రయోజనం లేదని ఎవరంటారు?    

కట్ చేస్తే - 

ఈ రక్తప్రవాహాల సినిమాలు ఇంకా చాలా చాలా రావాలి అని నా ఉద్దేశ్యం. అలాంటి సినిమాలను చూసీ చూసీ ప్రేక్షకులకు విసుగొస్తుంది. మొహం మొత్తుతుంది. బోర్ కొడుతుంది. 

అప్పుడు మళ్ళీ కొత్తగా ఫీల్ గుడ్ సినిమాలు, ప్రేమకథలు వరుసపెట్టి రావడం మొదలవుతుంది. ప్రేక్షకులకు కాస్త మామూలు మనుషులవుతారు. 

కొత్తవాళ్లతో తీసిన హిందీ సినిమా "సయ్యారా" కేవలం మూడురోజుల్లో 99 కోట్ల కలెక్షన్ చేయడం - రాబోతున్న ప్రేమకథల, ఫీల్ గుడ్ సినిమాల పాజిటివ్ ప్రవాహానికి నాంది అనిపిస్తుంది నాకు. 

- మనోహర్ చిమ్మని 

100 Days. 100 Posts. 98/100. 

2012 నుంచీ నాకున్న ఒకే ఒక్క అత్యంత ఆత్మీయ స్నేహితురాలు...


“No matter who you are, no matter what you do, no matter who your audience is: 30 percent will love it, 30 percent will hate it, and 40 percent won't care. Stick with the people who love you and don't spend a single second on the rest. Life will be better that way.” - James Altucher


ఒకసారెప్పుడో "బ్లాగర్" అన్న పదం నా బయోలో పెట్టుకోనా వద్దా అని నా స్టుడెంట్ ఒకరిని అడిగాను. 

"అసలు అదే మీ యు యస్ పి సర్. ఇంకేం పెట్టుకోకపోయినా పర్లేదు. బ్లాగర్ ఉండాలి" అన్నాడు నా స్టుడెంట్. 

కట్ చేస్తే -  

"ఎవరేమనుకుంటారో అన్న ఘర్షణ, భయం లేకుండా నేను అసలు ఒక్క బ్లాగ్ పోస్ట్ కూడా ఇప్పటివరకు పోస్ట్ చేయలేదు" అంటాడు జేమ్స్ ఆల్టుచర్.   

నా బ్లాగులో కూడా అలాంటి మరీ ఇబ్బందికరమైన టూ మచ్ పర్సనల్ థింగ్స్ కొన్ని ఉన్నాయి. కొన్ని ప్రొఫెషనల్లీ పర్సనల్ పోస్టులు, కొన్ని మరీ ఓపెన్ సెల్ఫ్ ప్రమోషన్స్!

అయితే - జేమ్స్ ఆల్టుచర్ లాగే, నేను కూడా వాటి గురించి ఇప్పుడు అసలు పట్టించుకోవటం లేదు. 

మన జీవితంలోని మంచి చెడుల గురించి, సుఖ సంతోషాల గురించీ మనకి మనం నెమరేసుకొంటూ, ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎప్పటికప్పుడు చాలా ఉంటుంది. బ్లాగింగ్ లాంటి "ఫ్లో రైటింగ్" వల్ల శాస్త్రీయంగా నాకు లభించే గొప్ప ఉపయోగం అదే. 

బ్లాగింగ్ ఒక అద్భుతమైన సాధనం. నమ్మరు కాని, బ్లాగింగ్ నిజంగా మనల్ని వేరే ఎడిక్షన్స్ జోలికి వెళ్లకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది. భౌతికంగానే కాదు, మానసికంగా కూడా.   

ఎవరేమనుకుంటారో అన్న మైండ్‌సెట్ లోంచి బయటపడగలిగితే చాలు... బ్లాగింగ్, మనతో మనం మాట్లాడుకోడానికి ఒక మంచి ఔట్‌లెట్‌లా పనిచేస్తుంది. ఎలాంటి హిపోక్రసీ, ఇన్‌హిబిషన్స్ లేకుండా అన్నీ పంచుకోగలిగిన ఒక అత్యంత ఆత్మీయమైన అతిదగ్గరి స్నేహితురాలు అవుతుంది. 

అంతకు మించి ఇంకేం కావాలి నాకు? ఆ కోణంలో, 2012 నుంచీ నాకున్న ఒకే ఒక్క అత్యంత ఆత్మీయ స్నేహితురాలు... నా బ్లాగింగ్.

- మనోహర్ చిమ్మని 

100 Days. 100 Posts. 97/100.    

Celebrate to Accelerate


Most people wait to celebrate the finish line. But here’s the truth: if you only celebrate outcomes, you miss the real fuel for growth.

Every win—big or small—deserves a moment. Why? Because celebration isn’t just fun… it’s functional. It builds momentum. It rewires your brain to enjoy progress, not just results.

Think of a runner—arms raised at the finish. That emotion becomes fuel for the next race.

It’s the same in life, business, health, and relationships. When you acknowledge your effort—closing a deal, making a tough call, showing up for yourself—you create a positive loop. You train your nervous system to connect effort with reward.

Over time, that loop becomes gratitude. And gratitude multiplies energy, joy, and confidence.

I’ve built everything not on perfection—but on progress.
Not on waiting—but on celebrating.

So if you’re stuck?
Start small.
Celebrate today.

What you celebrate, you accelerate. 

- Manohar Chimmani 

100 Days. 100 Posts. 96/100.

The Quiet Superpower: Single Task. Zero Task.


We often celebrate the hustlers — juggling ten things at once, chasing every goal, saying yes to everything.

But the true Hero?
He’s the one who can slow down, breathe deep, and fully show up for the one task in front of him. No noise. No split screens. Just presence.

And the even braver one?
He’s the Hero who can do nothing — not out of laziness, but out of wisdom.
He knows when to pause, when to clear the deck, when to let silence do the talking.

Single-tasking is strength.
Zero-tasking is surrender.
Both are rare. Both are revolutionary.

In a world chasing more, choose less — and do it fully.

- Manohar Chimmani

100 Days. 100 Posts. 95/100. 

Fiction Is a Lie That Tells Us True Things


Fiction is strange magic.

On the surface, it’s all made up — characters who never existed, dialogues never spoken, events that never happened. And yet… we feel seen. We find ourselves in those pages. We cry for people who don’t exist. We walk away with truths that hit harder than reality ever could.

Why?

Because fiction bypasses our logical mind. It doesn’t debate or preach — it invites. It lets you step into another’s soul and see the world through their wounds, their wonder, their love. And in that journey, something raw and real cracks open inside us.

The story might be a lie. But the emotions, the questions, the revelations? They’re the truest things we know.

That’s the power of fiction.
And that’s why we keep reading.

- Manohar Chimmani

100 Days. 100 Posts. 94/100. 

Monday, 21 July 2025

Just Go With the Flow


There comes a moment in life when nothing needs to be forced.

Nothing to be stopped.
Nothing to be continued.
No more hard decisions weighing heavy on the chest.

It’s not giving up.
It’s not waiting.
It’s not confusion either.

It’s trust — in life, in your inner rhythm, in the silent intelligence that guides everything.

You no longer chase.
You no longer resist.
You simply flow.

And in that flow, you begin to witness miracles — small, subtle, and soul-deep.

So if you’re standing at a crossroad today, unsure what to hold on to or let go of…
Pause. Breathe.

Maybe, just maybe — this is your time to float, not fight.

Let life lead.
You just show up — present, open, and real. 

- Manohar Chimmani

100 Days. 100 Posts. 93/100. 

Sunday, 20 July 2025

మిలియనేర్ కావడం ఎలా?


ఇదేం థర్డ్‌గ్రేడ్ యూట్యూబ్ థంబ్‌నెయిల్ కాదు. నాకు నేను వేసుకొన్న ప్రశ్న. నాకు సమాధానం తెలిసిన ప్రశ్న. 

కట్ చేస్తే -

ఈ భూమ్మీదున్న జనాభాలోని ప్రతి 140 మందిలో ఒక మిలియనేర్ ఉన్నారట! ఇక్కడ మిలియనేర్ అంటే, అమెరికన్ డాలర్స్‌లో మిలియనేర్. 

అంటే, ఈరోజు లెక్కప్రకారం, సుమారు 8.6 కోట్లు. 

గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ ఆధారంగా, నోమాడ్ కాపిటలిస్ట్ వంటి సోర్సులు చెప్తున్న ఈ న్యూస్ ఐటమ్ చదివాక, నాకు నిజంగా సిగ్గేసింది. 

ఇదేం లక్షల్లో కాంపిటీషన్ కాదు. జస్ట్ ఒక 140 మందిలో నేనూ ఒక మిలియనేర్ కావాలని ఇప్పటిదాకా ఎందుకు అనుకోలేదు? అలాంటి హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ ఎందుకని చెయ్యలేకపోయాను? కనీసం ఇప్పుడైనా అవ్వాలనుకుంటున్నానా?  

కట్ చేస్తే - 

"నీ దగ్గర ఎంత డబ్బున్నా, నీకు ఎన్ని ఆస్తులున్నా, నువ్వు చచ్చిపోయేలోపు అందులో నువ్వు ఎంత ఖర్చుపెట్టగలిగావన్నది నీ అసలు వాల్యూ. అలా చేయలేనప్పుడు నీకూ, డబ్బులేనివాడికీ పెద్ద తేడా లేదు" అంటాడు రామ్‌గోపాల్ వర్మ. 

ఇది అందరికీ నచ్చకపోవచ్చు. కాని, ఇదే లాజిక్. 

డబ్బు సంపాదించడం వెనుక ఎవరి ఉద్దేశ్యం ఏంటన్నది వారి వ్యక్తిగతం. కాని, సంపాదించడం అనేది మాత్రం ఎవరికైనా తప్పనిసరి. 

ఒకటి వదిలేస్తే నేనూ మిలియనేర్ కావడం పెద్ద కష్టం కాదు. ఆ ఒక్కటి ఎప్పుడు వదిలేస్తానన్నదే నన్ను ఎప్పటికప్పుడు ఆడిస్తున్న చిక్కు ప్రశ్న. 

Money isn’t everything — but without it, your freedom stays a prisoner. Earn with purpose, spend with soul.

- మనోహర్ చిమ్మని

100 Days, 100 Posts. 92/100.